దారినపోయే దానయ్య(దాదా): ఇస్లాంలో, సున్నీ-షియా లని ఉన్నారంట కదా, వాల్లిద్దరి మధ్య తేడా ఏంటి? ముస్లిం: ఖురాన్,ప్రవక్త బోధనల్లో సున్నీ,షియా అనే పదాలు లేవు. జస్ట్ ‘ముస్లిం’ అనే ఉంది. దాదా: లేకుంటే అన్ని గొడవలు ఎందుకు జరుగుతాయి. నువ్వు ఇంతకూ సున్నీవా, షియా వా? ముస్లిం: నేను జస్ట్ ముస్లిం ని. ప్రవక్త మరణం తర్వాత ఎవరు ఖలీఫా కావాలి అనే రాజకీయపరమైన అభిప్రాయబేధాలతో కొందరు తమను తాము షియాలుగా పిలుచుకుంటారు. వారు నమ్మేది కూడా ఒకే ఖురాన్ నే, ఒకే ప్రవక్తనే – ఆ బోధనల్లో ఎక్కడా సున్నీ,షియా అనే పదాలు లేవు.
దాదా: మరి, అన్ని గొడవలు ఎందుకు? ఒకరినొకరు ఎందుకు చంపుకుంటారు?ముస్లిం: పాకిస్తాన్, ఇండియా, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా,లెబనాన్, కువైట్,బహ్రైన్ లాంటి దేశాల్లో కూడా షియాలు అక్కడి జనాభాలో 10-15%పైనే ఉన్నారు, పైగా సున్నీ లతో కలిసి పక్క,పక్కనే జీవిస్తుంటారు. వారిమధ్య గొడవలు జరిగినట్లు ఎన్నిసార్లు విన్నావ్..? ఎంతసేపూ ఇరాన్,ఇరాక్,సిరియా వీటిగురించే వింటుంటావ్. ఎందుకు? అక్కడ జరుగుతున్న ఆధిపత్య రాజకీయాల గురించీ, అమెరికా, బ్రిటన్, రష్యా లాంటి దేశాలు ఆధిపత్యం కోసం వివిధ గ్రూపుల్ని క్రియేట్ చేసి, ఆయుధాలు సప్లై చేసే విషయం.. ఇవన్నీ తెలీనట్లు ఎందుకు నటిస్తావ్. ఎందుకు వాల్లు కేవలం ఇస్లాం కారణంగానే దాడులు చేసుకుంటున్నారని నిరూపించాలని తాపత్రయపడతావ్? దాదా: నువ్వు లక్ష చెప్పు, నేను నమ్మను గాక నమ్మను. నేనసలే ప్రపంచదేశాలు తిరిగొచ్చిన మేధావిని. మతస్థులు చెప్పేదేదీ నేను చచ్చినా నమ్మను. ముస్లిం: నువ్వు మేధావినని ఒప్పుకుంటాలేగానీ, నువ్వు నమ్మకుంటే, ఎందుకు నమ్మవో,నీ లాజిక్కులేమిటో, నీ దగ్గరున్న ఆధారలేమిటో చెప్పు. దాదా: నీకు మేధస్సు అంటే అసహనం. మీ మతాలన్నీ ఇంతే. మీదంతా మూర్ఖత్వం.. ప్రతి మతస్థుడూ మా మతమే టాప్ అని చెప్పుకుంటుంటాడు. ముస్లిం: నువ్వు చెప్పే నాస్తికత్వం ఎలా కరెక్ట్ అని నువ్వు వాదించుకుంటావో, అలాగే ప్రతిముస్లింకూడా తాను నమ్మే ఇస్లాం కరెక్ట్ అని వాదించుకుంటాడు. పైగా, ముస్లిం వాదనలకు ఖురాన్,హదీస్ లు బెంచ్ మార్క్. ఖురాన్,హదీసుల్లో లేని విషయన్ని ఎవరైనా ముస్లిం కోట్ చేసినా, మిస్-ఇంటర్పెట్ చేసినా ఈజీగా పట్టేయొచ్చు. చేతనైనా నువ్వు ఆ పని చేయి. ఏ బేసిసూ, ఏ బెంచిమార్కూ లేకుండా రోజుకో వాదన చేసే నీకే అంత ఇది ఉంటే, 1400 సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా, కొన్ని కోట్లమంది ఫాలో అవుతూ, ఖండాంతరాలకు వ్యాపించిన మతాన్ని ఫాలో అయ్యే ముస్లిం కు ఇంకెంత కాన్ఫిడెన్స్ ఉండాలి. చేతనైతే ఫ్యాక్ట్స్,లాజిక్ ఆధారంగా, కన్సిస్టెంట్ వాదనల ఆధారంగా ఇస్లాం ని విమర్శించు. పడికట్టు విమర్శలతో టైమ్ వేస్టు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు.