సూటిగా.. సుత్తి లేకుండా..

జగన్ ఏం హామీలిచ్చాడు, YSRCP మ్యానిఫెస్టోలో ఏముంది.. వంటి అంశాలతో సంబంధంలేకుండా. చాలా మంది రెడ్డీస్.. దాదాపుగా.. జగన్ పార్టీకే ఓటేస్తారు. ఆ పార్టీ తమదిగా భావిస్తారు. అలాగని YSRCP నాన్-రెడ్డీస్ కి వ్యతిరేక పార్టీ కాదు. దానికి ఇతరులు కూడా ఓటేస్తారు. ఇతర వర్గాల నాయకులు కూడా ఆ పార్టీలో చాలామంది ఉన్నారు.

చంద్రబాబు ఏం హామీలిచ్చాడు, టీడీపీ మేనిఫెస్టోలో ఏముంది.. వంటి అంశాలతో సంబంధం లేకుండా చాలా మంది చౌదరీలు( కమ్మాస్) టీడీపీ కే ఓటేస్తారు. ఆ పార్టీ తమదిగా భావిస్తారు. అలాగని టీడీపీ చౌదరేతరులకు వ్యతిరేక పార్టీ కాదు. దానికి ఇతర వర్గాల వారు కూడా ఓటేస్తారు. ఇతర వర్గాల నాయకులు కూడా ఆ పార్టీలో చాలామంది ఉన్నారు.

చాలా మంది కాపు యువత జనసేనకే ఓటేయాలని ఫిక్స్ ఐపోయి ఉన్నారు. అలాగని జనసేన కాపులు కానివారికి వ్యతిరేక పార్టీ కాదు. జనసేనకు ఇతరులు కూడా చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.
దలితులు చాలా వరకూ మాయావతి సారధ్యంలోని బియస్పీ కే ఓటేస్తారు. ఆ పార్టీ తమదిగా భావిస్తారు. అలాగని బీయస్పీ దలితేతరులకు వ్యతిరేకపార్టీ కాదు. ఇతర వర్గాల నాయకులు కూడా ఆ పార్టీలో ఉన్నారు. ఇతరులు కూడా ఆపార్టీకి ఓట్లేస్తారు.

పాతబస్తీ ముస్లింలు చాలామంది యం.ఐ.యం ని తమ పార్టీగా భావిస్తారు. దానికే ఓట్లేస్తారు. అలాగని యం.ఐ.యం ముస్లిమేతరులకు వ్యతిరేక పార్టీ కాదు. దానికి పాతబస్తీలోని ఇతర వర్గాల ప్రజలు కూడా ఓట్లేస్తారు. ముస్లిమేతరులు చాలా మంది ఆ పార్టీ తరుపున కౌన్సిలర్లుగా ఎన్నికై ఉన్నారు. యం.యల్.ఏ, యంపీలుగా పోటీ చేసి ఉన్నారు.

“ఏమిటీ.. యం.ఐ.యం మిగతా పార్టీల లాంటిదే అంటావా. మేం అస్సలు ఒప్పుకోం, అది మా చెడ్డ పార్టీ, హిందువుల వ్యతిరేక పార్టీ” – అని కొందరు ఇప్పటికే బుసలు కొడుతుండవచ్చు. సరే.. అలాంటి వారితో చర్చలు పెట్టే ఓపికా,తీరికా నాకు లేవు కాబట్టి, కాసేపు వీరు చెప్పేది నిజమేనని ఒప్పుకుందాం.
సో, యం.ఐ.యం హిందువులకు వ్యతిరేకపార్టీ. ఐతే ఏంటి? దానివల్ల హిందువులకు ఎలాంటి కష్టం,నష్టం కలిగే అవకాశం ఉంది అనేవి ఆలోచించాల్సిన ప్రశ్నలు.

గత పాతికేల్లుగా, దాని యం.యల్.ఏ, యం.పీ ల సంఖ్య స్థిరంగా ఉంది. ఈ సంఖ్య ఆధారంగా అది ఏం చేయగలిగింది? పాతబస్తీలోని హిందువులకు దాని వల్ల ఏమైనా ఇబ్బందులున్నాయా? వారి దైనందిన జీవితాలకు గానీ, పండగలకు గానీ, శుభకార్యాలకు గానీ, ఏమైనా ఆటంకం కలుగుతుందా? వారి వ్యాపారాలకు ఏమైనా అడ్డంకులున్నాయా? మొత్తంగా హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కి యం.ఐ.యం వల్ల ఏమైనా సమస్యలున్నాయా? అది హైదరాబాద్ అభివృద్దిని ఏమైనా అడ్డుకుంటుందా?

ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం – కాదు.లేదు. లేనే లేదు.

అంటే – అది అధికారంలో లేదు కాబట్టి, ఇప్పుడు ఏం చేయట్లేదని కొందరంటారేమో. గత నాలుగున్నరేళ్ళుగా అది అధికార TRS పార్టీతో జాన్ జిగ్రీ లా ఉంది. మరి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అది చేసిన చెడుపని ఒక్కటి చెప్పండి చూద్దాం. చెప్పలేరు. ఏమీ లేవు కాబట్టి.

మరి కొందరు- భవిష్యత్తులో దానికి మరిన్ని సీట్లు వస్తాయేమో, అప్పుడు అది ఏమైనా చేస్తుందేమోనని వగలమారి భయాలు పోతుంటారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో అది పోటీ చేసి, ముస్లింలందరూ గంపగుత్తగా దానికే ఓట్లేసినా అది మహా అంటే ఎన్ని స్థానాలు గెలవగలదు? ఈడ్చి కొడితే ఓ 15? పోనీ 20? అప్పుడు మిగతా 100 స్థానాల్లో ముస్లిమేతర యం.యల్.ఏలే ఉంటారు. అంతమందిని కాదని ఈ ఇరవై మంది ఏం చేయగలరు? ఆ 100 మందీ హిందూ యం.యల్.ఏ ల కన్నా 20 మంది ముస్లిం యం.యల్.ఏ లే ప్రమాదకరమని కొందరు ఏడుపుగొట్టు ముఖాలు చెప్పేది నిజమేనని నమ్మినా, ఆ రకంగా ఈ ఇరవై మందీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అనుకున్నా.. ప్రభుత్వాన్ని నడిపించేది కేవలం యం.యల్.ఏలు కాదు. సెంట్రల్ గవర్నమెంట్, ఆర్మీ, IAS,IPS, Group-1 officers,, లాయర్లు, జడ్జిలు, కాంట్రాక్టర్లు.. ఇంతమంది ఉంటారు. వీరిలో ముస్లిం లెంతమంది, ముస్లిమేతరులెంతమంది.. వీల్లందరినీ కాదని ఓ 20 మంది యం.యల్.ఏలు ఏం చేయగలరు? ఒక స్పీచ్ ఇచ్చాడని యం.ఐ.యంలో నంబర్-2 ఐన అక్బరుద్దీన్ ఓవైసీ ని 40 రోజులు జైల్లో పడేశారు. అసలు ఏ నేరం చేయని నిర్దోషులైన వందలాది పాతబస్తీ యువకుల్ని ఏళ్ళ తరబడి జైల్లలో పడేసి చివరికి నిర్దోషులుగా వదిలేశారు. అలాంటిది, వారు నిజంగానే ఏదైనా చట్టవ్యతిరేక పని చేసి తప్పించుకోగలరా?

అంచేత.. మొత్తానికి, చెప్పొచ్చేదేంటంటే – యం.ఐ.యం అనేది ఓ వానపాము లాంటిది. కానీ, దాని పేరెత్తగానే, అది ఓ నాగుపాములాంటిదనే ఇంప్రెషన్ ముస్లిమేతరుల్లో కలగటానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందో ఎవరికి వారు ఆలోచించండి. దాని గురించి నేను తర్వాత రాస్తా.
ఇప్పుడు అసలు విషయానికి రండి.

– బీజేపీ అని ఓ పార్టీ ఉంది. అది హిందువేతరులకు పూర్తి వ్యతిరేకమైన పార్టీ. ( అసలు హిందువంటే ఎవరు? దలితులు, ఆదీవాసీలు హిందువులా కాదా? సర్టిఫికేట్లో హిందువు అని ఉన్నోల్లందరూ హిందువులా, లేక ఓ పర్టికులర్ నమ్మకమున్నోల్లే హిందువులా వంటి అంశాల గురించి ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పట్లో ఆ క్లారిటి రాదు కూడా.) మొత్తానికి – “అబ్బే, బీజేపీ హిందువేతరులకు వ్యతిరేక పార్టీ కాదు” – అని ఎవరైనా అనుకునేవారుంటే , వారు ఇది చదవటం, ఇంతటితో ఆపేయండి. అనవరసరంగా మీకూ, నాకూ, టైం వేస్టు ఎందుకు. ఇది ఆపేసి, ఎప్పట్లాగే టైంస్ నౌ,రిపబ్లిక్ టివీ, మీ వాట్సప్ మెసేజ్ పుస్తకాలూ మీరు చదువుకోండి.

సో, బీజేపీ హిందూవేతరులకు వ్యతిరేకపార్టీనా, కాదా అనేది అస్సలు చర్చనీయాంశం కాదు. కళ్ళుండి, కాసింత ఆలోచనా గ్ఞానం ఉన్నోల్లందరికీ, గత నాలుగేల్లుగా దేశంలో జరుగుతున్న పరిణమాల్ని బట్టి, ఈ విషయం ఇప్పటికే కంఫర్మ్ అయి ఉంటుంది. అలా ఓ 20-25% వర్గానికి పూర్తి వ్యతిరేక భావజాలం ఉన్న ఓ పార్టీ అధికారంలోకి వచ్చి, ఆ పాతికశాతం జనాల మనుగడని ప్రశ్నార్థకం చేస్తూ, వారి హక్కుల్ని కాలరాస్తూ, వారి సాంస్కృతిక వారసత్వాన్ని తుడిచేయాలని చూస్తూ, అణచివేత విధానాల్ని పాటిస్తే – దాని పర్యవసానాలు దీర్ఘకాలంలో ఎలా ఉంటాయి అనేది ఆలోచించాల్సిన ప్రశ్న.

ఆలోచించండి ఓ హింట్ ఇస్తా.. ఇటీవల నక్సలిజం చాలా వరకూ తగ్గుముఖం పట్టింది. ఎందుకు? ఎలా? గత 10-15 ఏళ్ళుగా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అమలు చేసిన సంక్షేమ పధకాల వల్ల. ఆదీవాసీ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి వల్ల. ఆదీవాసీ యువతని అట్రాక్ట్ చేసి, వారిని మెయిన్ స్ట్రీం జనజీవన స్రవంతిలో కలిపే ప్రభుత్వ చర్యలు సఫలీకృతం కావడం వల్ల. వారికి భవిష్యత్తుపై కలిగిన కొత్త హోప్ వల్ల. అంతే తప్ప, వారిని అడవులకే పరిమితం చేసి వారిపై అణచివేత చేయడం వల్ల మాత్రం కాదు. అణచివేత వల్ల, ఓ వర్గాన్ని దూరం పెట్టడం వల్ల, ఎప్పటికీ దుష్పరిణమాలేగానీ, మంచి పరిణామాలు ఎప్పటికీ ఉండవు.

మరో హింట్ ఇస్తా. ఇటీవల కాశ్మీర్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్ని అక్కడి 95% ప్రజలు బహిష్కరించారు. కేవలం 5% పోలింగ్ జరిగింది. 1950 తర్వాత, ఇదే కాశ్మీరీలు అతి తక్కువలో పాల్గొన్న ఎన్నికలు. యూపీయే పదేళ్ళ పాలనలో క్రమంగా తగ్గుతూ వచ్చిన వేర్పాటు వాదం మళ్ళీ కేవలం నాలుగేల్లలో, ఈ స్థాయికి ఎలా పెరిగింది? అక్కడ మరింత మంది వేర్పాటు వాదం వైపు మొగ్గు అంటే దానర్థం ఏంటి?.. , మరిన్ని దాడులు, మరిన్ని ప్రతిదాడులు, మరిన్ని చావులు, మరిన్ని యుద్ధాలు, మరిన్ని ఆయుధాల కొనుగోల్లు.. అదీ జరిగేది.. చివరికి ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అఫ్కోర్స్.. మన దేశం కొనే ప్రతి ఆయుధం, మన జేబులోనుండీ తీసుకున్న డబ్బుతోనే అనే తెలివి చాలా మందికి ఎలాగూ లేదు. కానీ, శాంతీ, సుస్థిరత లేనిచోట అభివృద్ధి ఉండదు. అక్కడ అసలు అభివృద్ధికి అర్థమే ఉండదు. అదైనా ఒప్పుకుంటారా? ఆలోచించండి…

Leave a Reply

Your email address will not be published.