సైన్సు-మానవత్వం

“మతం కంటే సైన్స్ గొప్పది”
“మతం కంటే మానవత్వం గొప్పది”
-ఈ రెండు స్టేట్మెంట్లు చాలా ఫ్రీక్వెంట్ గా వాడేస్తుంటారు..

ఇంతకూ సైన్సు-మానవత్వం లలో ఏది గొప్పది..?
ఓ వ్యక్తికి దగ్గరగా వెల్లి చేత్తో కొట్టో, బల్లెంతో పొడిచో చంపడం – కష్టమైన పని, పైగా చాలా టైమ్ వేస్ట్.
దూరం నుండే “డిష్యూం” అని పిస్టోల్ తో కాల్చి చంపడం చాలా ఈజీ.
AK-47 ఐతే నిమిషానికి 60 రౌండ్లు.

అసలు ఒక్కో వ్యక్తిని టార్గెట్ చేసి కాల్చి చంపడం కూడా కష్టమైన పనే. సైన్స్ ఉండగా ఈ కష్టాలెందుకు. యుద్ధవిమానంలో వెళ్ళి ఒకే ఒక్క బాంబ్ వేస్తే, మొత్తం సిటీనే భూస్థాపితం.. 20,30 ఏళ్ళవరకూ గడ్డి కూడా మొలకెత్తదు.
ప్రపంచానికి ఈ డెమో చూపించి అమెరికా అగ్రరాజ్యమైంది.అమెరికాను ఎదుర్కోవాలంటే అంతకంటే పెద్ద డెమో చూపించాల.

ఆ అమెరికా అండదండలతోనే ఇజ్రాయెలోడు వారానికి ఓ పాలస్తీనియన్ ఊరు, నిమిషానికి ఓ పిల్లోడి తల -చొప్పున చెలరేగి పోతున్నాడు. చుట్టూ అన్నేసి అరబ్ దేశాలు ఉండి కూడా ఏమీ చేయలేక కుక్కినపేనులా పడి ఉంటున్నాయి.

సైన్సును కాకుండా మతాన్ని పట్టుకుని వేలాడిన ఫలితమే ఇది అని కొందరు అంటున్నారు. బాధతోనో,కసితోనో… క్లారిటీ వారికైనా ఉందో,లేదో..

Leave a Reply

Your email address will not be published.