సైరాబాను-ముంతాజ్-జీనత్అమన్- జైరా వసీం-సనాఖాన్-తటస్థులు

సనాఖాన్ – హిందీ,తమిల్,తెలుగు,కన్నడ కలిపి 15 సినిమాలూ, హిందీ బిగ్-బాస్, ఝలక్ దిఖ్లాజా వంటి కొన్ని టీవీ షోలూ చేసింది. కొన్ని రోజుల ముందు – సడెన్ గా తాను టీవీ/సినిమాలకూ, మొత్తంగా మోడలింగ్/ఎంటర్టైన్మెంట్ రంగానికీ స్వస్తి చెప్తున్నట్లు ప్రకటించింది. తన ట్విట్టర్,ఇన్స్టాగ్రాం అకౌంట్ల నుండీ, తాను గతంలో పోస్ట్ చేసిన అన్ని గ్లామరస్ ఫోటోలనూ డిలీట్ చేసేసింది. హిజాబ్ తో ఉన్న లేటెస్ట్ ఫోటోను పోస్ట్ చేసింది. ఇదంతా చేయడం వెనక తన మైండ్లో నడిచిన థాట్ ప్రాసెస్ ని ఓ చక్కని పోస్టులో రాసింది.
ఈమె చెప్పిన ప్రధాన కారణాలు రెండు.

1. జీవితానికి ఓ పర్పస్ అంటూ ఏమైనా ఉందా, ఉంటే అదేమిటీ అనే ఆలోచనలు.
2. ఏదో ఓ సమయంలో మరణం ఐతే తప్పక వస్తుంది. మరణాంతరం ఏమవుతుంది – అనే ఆలోచనలు.
ఈ రెండూ, వీటితో పాటు తనను గతంలో డిప్రెషన్ కి గురిచేసిన కొన్ని జీవితానుభావాలూ -ఇవన్నీ తన ఆలోచనలను సృష్టికర్తవైపుకు మరలేలా చేశాయనీ, సృష్టికర్త ఆదేశానుసారం జీవించడంలోనే శాంతి,సౌఖ్యం ఉన్నాయి తప్ప, తలుకుబెలుకుల మెరుపుల్లో, భౌతిక,ప్రాపంచిక విషయాల్లో కాదనే విషయం తనకు అర్థమైందనీ, ఇకపై ఆ మార్గంలోనే పయనించబోతున్నట్లు ప్రకటించింది.ఇదే విషయాన్ని ఖురాన్ ఒక్క మాటలో – “Verily, in the remembrance of Creator do hearts find rest. (13:28) ” అని చెప్తుంది. దీని గురించి మెయిన్ స్ట్రీమ్/సోషల్ మీడియాలో పెద్దగా చర్చగానీ,హడావుడి గానీ లేదు. అదే గనక ఆమె ఇస్లాం/ఖురాన్/హిజాబ్ లకు వ్యతిరేకంగా ఏమైనా చెప్పిఉంటే, అదోపెద్ద న్యూస్ అయ్యుండేది. ఆమె రాత్రికి రాత్రి సెలెబ్రిటీ అయ్యుండేది. దాని గురించి మనోల్లు పోస్టులు పెట్టి, రోజుల తరబడి డిస్కషన్లు చేసి ఉండేవారు. ప్రస్తుతం “మెయిన్ స్ట్రీమ్ మైండ్ సెట్” అలా ట్యూన్ చేయబడి ఉంది.

కొన్ని రోజుల ముందు మరో యువనటి జైరా వసీమ్ కూడా ఇదేబాటలో నడిచి సినిమాలకు స్వస్తి చెప్పింది. ఈమె చేసింది మూడు సినిమాలే అయినా, మూడూ కమర్షియల్ సక్సెస్ లే. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్,ద స్కై ఈజ్ పింక్. మొదటి రెండు సినిమాలు ఈమెకు బోలెడన్ని జాతీయ,అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి.

సినిమాల్లో కేవలం ఒక్క చాన్స్ కోసం కూడా కొన్ని లక్షల మంది పడిగాపులు కాస్తూ, స్టూడియోల చుట్టూ చక్కర్లు కొడుతుంటారు. అలాంటి చాన్స్ ఈమెను వెతుక్కుంటూ వచ్చింది. అది కూడా అమీర్ ఖాన్ లాంటి బాలీవుడ్ దిగ్గజం తో కలిసి పనిచేసే అవకాశం. డబ్బు, స్టార్ డం, గుర్తింపు.. సమాజం సక్సెస్ కి చిహ్నాలుగా భావించేవన్నీ ఈమె చిన్న వయసులోనే సాధించేసింది.“అంతా బాగుంది – ఈమెకు ఇక ఆకాశమే హద్దు” – అనుకునే సమయంలో, ఈమె బాలీవుడ్ కి స్వస్తి చెప్పింది. ఇక మీదట సినిమాలేవీ చేయనని ప్రకటించింది. దానికి ఈమె చెప్పిన కారణం –-

“గత ఐదేల్లుగా, నన్ను అందరూ రోల్ మాడల్ లా చూస్తున్నారు. సక్సెస్ కి చిహ్నంగా మారిపోయానంటున్నారు. కానీ, ఇవేవీ నాకు సంతోషాన్నివ్వట్లేదు. నా దృష్టిలో సక్సెస్ ఇది కాదు. గత ఐదేళ్ళుగా నేను నా నుండీ దూరంగా వెల్తున్నట్లనిపిస్తుంది. నేను వేరే ఎవరిలానో మారిపోతున్నట్లుంది. నేను చేసే పని, నా ఈమాన్(తెలుగులో సరైన పదం లేదు?)ను నా నుండీ దూరం చేస్తుంది. ఫలితంగా నా జీవితంలో బర్కత్ కూడా క్రమంగా దూరమైపోసాగింది. బర్కత్ అంటే – సుఖ సంతోషాలు, సంపదలూ కాదు. మన మనసులో మనం ఎంత స్థిరంగా, సంతృప్తిగా ఉన్నామన్నది. మన ఆలోచనలతో, మన జీవితంతో, మన చుట్టూ ఉన్న పరిసరాలతో మనం ఎంతగా సమాధాన పడగలిగామన్నది. సినిమాల్లో పనిచేస్తూనే, నా ఇమాన్ నీ , సృష్టికర్తతో నా అనుబంధాన్నీ కొనసాగించాలని గత 5 ఏళ్ళుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ, ప్రతిసారీ ఫెయిల్ అవుతున్నాను. ప్రయత్నించీ, ప్రయత్నించీ అలసిపోయాను. నిజానికి – ఈ సినిమా రంగమే ఇలాంటిదని తెలుసుకోవడానికి నాకు ఇన్నేళ్ళు పట్టింది. అందుకే దీని నుండీ పూర్తిగా దూరమవ్వాలని నిర్ణయించుకున్నాను.”

– ఇంకా, అనేక ఖురాన్ సూరాల్ని,ప్రవక్త బోధనల్నీ సంధర్భోచితంగా కోట్ చేస్తూ – తాను అనుభవించిన సంఘర్షనల్ని, ఆమె థాట్ ప్రాసెస్ నీ – చాలా చక్కగా వ్యాస రూపంలో పొందుపరిచింది.జనరల్ గా ఇలాంటి వ్యాసం సూసైడ్ చేసుకునే ముందు రాస్తారు. “అలసి పోయాను, ఇక చాలు” – టైపు నిరాశతో,నిర్వేదంతో, నిద్రమాత్రలు మింగిన వారు, బిల్డింగుల పై నుండీ దూకి చనిపోయిన వారి దృష్టాంతాలు, సినిమా రంగంలోనే చాలా జరిగాయి. మరికొందరు, ఇవేటైపు ఆలోచనలతో ఆల్కహాల్ కి, డ్రగ్స్ కీ బానిసలుగా మారుతారు. ఇవికూడా అందరికీ తెలిసినవే. కానీ, జైరా వసీమ్ ఇవేవీ చేయకుండా – కేవలం సినిమాలు మానేస్తున్నానని మాత్రమే చెప్పింది. దానికి ఆమెను అభినందించాల్సింది పోయి, కొందరు ఆమెను విమర్శించారు. కొన్ని టీవీ స్టూడియోలు దీనిపై రోజులకొద్దీ చర్చలు జరిపాయి. పనిలో పనిగా, “ఓ అమ్మాయి కెరీర్ ని నాశనం చేసేసింది, అది ఎలాంటి మతమో చూశారా”- అంటూ తమ విమర్శల్ని ఏకంగా ఇస్లాంపై మళ్ళించారు.

ఇస్లాం గురించీ ఏమీ తెలుసుకోకుండానే అన్నీ తెలుసనుకునేవారికీ, జీవితంలోని తలుకుబెలుకులూ,సక్సెస్-ఫెయిల్యూర్లే తప్ప, ఆ తలుకుబెలుకులకు అతీతంగా – ఆత్మ అనేది ఒకటుంటుందనీ తెలియని వారికి – జైరా వసీమ్ వ్యాసం అర్థమయ్యే అవకాశం లేదు.కానీ, కళ్ళముందు కనిపించే తలుకు-బెలుకుల్ని వద్దనుకుని, ఇస్లాం పంచన చేరి శాంతిని పొందిన, పొందుతున్న వారి లిస్టు, చాలా చాలా పెద్దది.

జైరా వసీమ్, సనా ఖాన్ లంటి వారు కొందరి దృష్టిలో సొంత ఆలోచనలు లేని, బ్రెయిన్ వాష్ చేయబడి, అణచివేయబడ్డవారిలా కనిపిస్తుంటారు. అదే ఇస్లాం ని విమర్శిస్తే మాత్రం వారు పెద్ద క్రియేటివ్ వీరవనితలుగా, శూరులుగా రాత్రికిరాత్రి మారిపోతారు.

స్త్రీలకు సొంత ఆలోచనలూ,తెలివితేటలూ ఉంటాయని వీరే పెద్ద,పెద్ద స్పీచులిస్తుంటారు. ముస్లిం స్త్రీలకు మాత్రం సొంత ఆలోచనలు ఉండవన్నట్లు, ముస్లిం పురుషులు చెప్పబట్టే వారు మతాన్ని ఫాలో అవుతారన్నట్లూ మాట్లాడుతుంటారు. బేసికల్ గా వీరు చెప్పేదేమంటే, తమలాగా నాస్తికత్వాన్నీ, ఇస్లామోఫోబిక్ ఆలోచనల్నీ కలిగిఉన్న స్త్రీలు మాత్రమే సొంత ఆలోచనలూ,తెలివితేటలూ కలిగినట్లు, తమకు విరుద్ధ భావాలు కలిగిఉన్నోల్లందరూ బ్రెయిన్ వాష్ చేయబడిన వారన్నట్లు – ఇదేవీరి దిక్కుమాలిన లాజిక్.

ఇక ప్రస్తుతం, గత రెండు రోజులుగా జరుగుతున్న విషయాల్ని గమనిస్తే – “వాల్లూ ఇంతే-వీల్లూ ఇంతే”,
“విప్పుకుంటే వాల్లొప్పుకోరు-కప్పుకుంటే వీల్లొప్పుకోరు” –అంటూ కొందరు సోకాల్డ్ తటస్థ, నాస్తిక విశ్లేషకులు, గత రెండు రోజుల్నుండీ చాలా బ్యాలెన్సింగ్ ఫీట్స్ చేస్తున్నారు. ఓ హిజాబీ అమ్మాయికి మనస్పూర్తిగా మద్దతివ్వలేక, బత్తాయిల ఆగడాల్ని చూస్తూ సైలెంట్ గా ఉండలేక, పాపం వీరు చాలా మధనపడుతున్నట్లుంది.

సైరా బాను-ముంతాజ్-జీనత్ అమన్-షబానా ఆజ్మీ-షకీలా వీరందరూ ముస్లిం పేర్లతోనే ఎలాంటి లైఫ్ స్టైల్ ని ఫాలో అయ్యారో అందరికీ తెలిసిందే. వీరి గురించి ముస్లింలు ఎవరైనా, ఏనాడైనా పట్టించుకున్నారా? జైరావసీం, సనాఖాన్ లను కూడా ఎవరైనా ఏదో అన్నారని వారు హిజాబ్ లోకి మారారా? మతం మీద నమ్మకం హృదయాంతరాల్లోనుండీ రావాలి. కానీ, సోదిరాతలు రాసే అభ్యుదయం బ్యాచ్ కి, తమలాగా నాస్తికత్వాన్ని తలకెత్తుకుంటేనే వారికి తెలివితేటలు, ఫ్రీ విల్ ఉన్నట్లు. మిగతా అందరికీ తెలివితేటలు లేనట్లు, ఎవరో వేరేవారి ప్రభావంలో ఉన్నట్లు పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటారు.

2005 లో, సానియా మీర్జా స్కర్ట్ పై ఒక మతపెద్ద యెవరో ఫత్వా జారీ చేశారని, జాతీయ-అంతర్జాతీయ మీడియా నానా హంగామా చేసింది. ఫత్వా అంటే ఓ మత పెద్ద అభిప్రాయం. ఏ అభిప్రాయన్నైనా, ఎవరైనా నమ్మితేనే గౌరవిస్తారు,ఫాలో అవుతారు. ఆయన ఆ అభిప్రాయం వెలిబుచ్చాక కూడా సానియా మీర్జా అదే స్కర్టుతో ఆడింది, ముస్లిం గానే కొనసాగుతుంది. “ముస్లిం మగాల్లు చెడ్డీ తొడుక్కుని ఇతర మహిళలకు తమ శరీరం చూపించవచ్చా” అని ఏ ముస్లిం మతపెద్దనైనా అడిగిచూడండి. ఇస్లాం ప్రకారం అది 100% తప్పనే అందరూ చెప్తారు. ఆ అభిప్రాయం ఆధారంగా , “షారుఖ్ ఖాన్-సల్మాన్ ఖాన్ డ్రస్ లకు వ్యతిరేకంగా ఫత్వా” – అని హెడ్లైన్స్ వేయొచ్చు. కానీ అలా చేయరు. ఎందుకంటే, సానియా మీర్జాని వాడుకుని ముస్లింలపై ద్వేషాన్ని, మహిళలపై సానుభూతినీ కురించేసి అభ్యుదయవాదులుగా భుజం చరుచుకునే స్కోప్ ఇక్కడ ఉండదు కాబట్టి.

సమాజంలో జరిగే అన్ని విషయాల్నీ, హ్యూమన్ సైకాలజీస్ ని మైక్రో అనాలసిస్ చేసే మేధావులకు అర్థం కానంత కాంప్లికేట్ విషయాలేమీ కావివి. కాకపోతే, న్యూటన్ మొదటి గమన నియమంలో చెప్పినట్లు, తమకు బాగా అలవాటైన థాట్ ప్రాసెస్ లో మార్పును, వీరి మైండ్ వ్యతిరేకిస్తుంది. కానీ, వీరికి ఏమూలో కాస్తంత నిజాయితీ, ఓపెన్ మైండ్ ఉంటే- ఎలాంటి జడత్వాన్ని ఐనా అధిగమించేలా చేసే ఫోర్స్ ఇస్లాంలో ఉంది. ముస్కాన్ గొంతులో ధ్వనించింది ఆ ఫోర్సే.

-మహమ్మద్ హనీఫ్

Leave a Reply

Your email address will not be published.