స్టీఫెన్ హాకింగ్ గారు పోయారు!!

స్టీఫెన్   హాకింగ్   గారు పోయారు!!
============================
ఎన్నో పరిశొధనలు చేసి, మరెన్నో కొత్త కొత్త విషయాలు చెప్పిన స్టీఫెన్ హాకిన్స్ గారు పోయారు.

“ఎక్కడికి పోయారు?”
ఏమో తెలీదు. ఆయన చెప్పలేదు.

“అదేంటి, ఎన్నెన్నో కొత్త విషయాలు చెప్పినాయన, ఎక్కడికి పోతున్నారో చెప్పకుండాపోయారా?”
అస్సలు, రావడం పోవడం అంటూ ఏం ఉండవంట. జస్ట్ అదలా, యాక్సిడెంటల్ గా జరిగిపోతుండంట.

“ఓ పిట్టకథ కూడా చెప్పే ఉండాలే?”
అవును, చెప్పారు. ఇప్పుడూ.. ఓ సూపర్ కంప్యూటర్ ఉందనుకుందాం. అదెంత సూపర్ డూపర్ కంప్యూటర్ అయినా, కొన్నేళ్ళకు దానిలో పార్ట్స్ అరిగిపోతాయి. అప్పుడు అది పని చేయడం మానేస్తుంది. మనిషి కూడా అంతేనంట. మెదడు కణాలు ముసలివైపోయి, పనిచేయడం మానేస్తాయంట. అప్పుడు ఆ బాడీని తీసుకెళ్ళి కాల్చడమో,పూడ్చడమో చేస్తారంట. అది తప్ప, స్వర్గం, నరకం, దేవుడు లాంటివేమీ ఉండవంట.

“అబ్బో, సూపర్ గా చెప్పాడే!! సరేగానీ, మొన్న నేను చూసిన ఓ విషయం గురించి చెప్పనా. ఓ సారి, మాఇంటి కిటికీలోనుండీ బయటికి చూస్తున్నాను. అప్పుడు మట్టిలోనుండీ సిలికాన్ అనే పరమాణువు బయటికి వచ్చింది. నేను చూస్తుండగానే అది చిప్ గా మారింది. అట్లాంటి చిప్పులన్నీ వాటికవే, ఒకదానిపక్కన ఒకటి చేరిపోయి ప్రాసెసర్ గా మారిపోయాయి. తర్వాత, భూమిలోనుండి ఇనుప ఖనిజం, కర్బనము కలిసి, ఆ పక్కనే ఉన్న గుంతలోని నీటితో బాగా సమ్మిలితమైపోయి, ఓ తెల్లటి మెటల్లిక్ బాడీలా ఐపోయాయి. ఇలాగే అనేక చిన్న చిన్న వస్తువులు వాటంతటవే తయారైపోయి, అన్నీ కలిసి ఓ సూపర్ కంప్యూటర్ గా ఏర్పాటయ్యాయి. ”

ఏంటేంటీ.. కంప్యూటర్ దానికదే తయారైపోయిందా? నీ కళ్ళకి నేనేం ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా? ఎవరో ఒకరు తయారు చేయకుండా, కంప్యూటర్ దానికదే ఎలా తయారవుద్ది?

“అడ్డడ్డే!! సృష్టికర్త అంటూ ఎవరూ లేకుండా, కొన్ని కణాలన్నీ కలిసి కన్నుగా, కొన్ని కణాలు మెదడుగా, కొన్ని గుండే,కొన్ని ముక్కూ, చెవులుగా యాక్సిడెంటల్గా ఏర్పడ్డాయని, తరువాత ఇవన్నీ కలిసి మనిషిగా మారిపోయాయనీ ,
, సొ కాల్డ్ నాస్తిక మేధావులు చెబితే, యెర్రిపప్పలాగా నోరెళ్ళబెట్టి విన్నావ్ కదా. అలాంటప్పుడు కంప్యూటర్ కూడా అలాగే యాక్సిడెంటల్గా ఎందుకు ఏర్పాటై ఉండకూడదు. ప్రతిదాన్నీ ప్రశ్నించండీ, లాజికల్ గా అనలైజ్ చేయండి అనీ ఈ మేధావులే చెప్తుంటారు కదా. మరి, ఇంత కాంప్లికేట్ అయిన మానవ శరీరం, ఈ భౌగోళిక, సౌర వ్యవస్థలు, ఎవరూ తయారు చేయకుండా, వాటంత అవే యాక్సిడెంటల్ గా ఎలా ఏర్పడ్డాయనే ప్రశ్న అడగకపోవడం, ఈ సోకాల్డ్ హేతువాదానికే అవమానం కదా. ”

ఏమో బయ్యో.. ఈ యాంగిల్ లో ఎప్పుడూ ఆలోచించలేదు.

ఎందుకు ఆలోచించలేదంటే, దానికి కారణం – ఇదో టైపు బ్రెయిన్ వాషింగ్. దేవుడు లేడనీ, స్వర్గం, నరకం లాంటివన్నీ మూఢవిశ్వాసాలనీ, ‘దేవుడు లేడని చెప్పడమూ, హేతువాదిననీ చెప్పుకోవడమూ, చాలా గొప్ప విషయాలనీ, ప్రస్తుతం మనం ఉంటున్న, మెటీరియలిస్టిక్ వ్యవస్థ చిన్నప్పటినుండీ మన మెదడుల్లో నూరిపోస్తుంది. ఇదంతా బాగా మెదల్లలోకి ఇంకిపోయి ఉండబట్టి, మతానికి/దేవుల్లకూ వ్యతిరేకంగా మాట్లాడే వారందరూ మేధావులుగా, వారు చెప్పేది ప్రశించాల్సినవేవీ లేని కటిక నిజాలుగా మన మైండ్ మనకు తెలీకుండానే ఓ టైపు అజంప్షన్ లోకి వెళ్ళిపోతుంది. దాని ఫలితమే ఈ యాంగిల్ లో ఆలోచించకపోవడానికి కారణం. ఆలోచించండి.

డిస్క్లైమర్-1. తమ తెలివితేటల్ని ఉపయోగించకుండా గుడ్డిగా ఇతరుల్ని అనుసరించేవారే, అంతిమ దినం నాడు సృష్టికర్త నిరాదరణకు గురవుతారు. ( ఖురాన్) . ఈ వాక్యం, మతాన్ని పూర్తిగా తెలుసుకుని ఆచరించకుండా, కేవలం సర్టిఫికెట్లో ఉంది కాబట్టొ, లేకా, తాత,తండ్రులు ఫాలో అయ్యారనో, గుడ్డిగా నమ్మే అందరు విశ్వాసులకు కూడా వర్తిస్తుంది.నా దృష్టిలో, వీరందరికంటే స్టీఫెన్ హాకిన్స్ చాలా బెటర్.
డిస్క్లైమర్-2. దేవుడు,స్వర్గం,నరకం ల గురుంచి అతను ఇచ్చిన ఊహాజనిత స్టేట్మెంట్లు తప్ప, అతను చెప్పిన అనేక సైంటిఫిక్ థియరీలపై నాకు ఎలాంటి విబేధం లేదు.

-మహమ్మద్ హనీఫ్
shukravaram.in

Leave a Reply

Your email address will not be published.