“స్త్రీ, పురుషులు సమానమేనట, ఇస్లాం స్త్రీలను అణచివేస్తుందట”

“స్త్రీ, పురుషులు సమానమేనట, ఇస్లాం స్త్రీలను అణచివేస్తుందట”
==================
5 సంవత్సరాల MBBS కోర్సు తర్వాత, PGలో వివిధ స్పెషలైజేషన్లు ఉంటాయి. ఇది మళ్ళీ ఇంకో 3 సం. చదవాలి. వీటిలో ఆండ్రాలజీ అనేది పురుషుల శరీర నిర్మానం, వారికి వచ్చే వివిధ జబ్బులు/సమస్యలు వంటి వాటి గురించి బోధిస్తుంది. ఇక గైనకాలజీ అనేది మహిళల శరీరం, వారి సమస్యలు, వారి హార్మోన్లు, గర్భస్థ, రుతుచక్ర,మెనోపాజ్ వంటి అనేక సమస్యల గురించి బోధిస్తుంది.
“స్రీ, పురుషులు ఇద్దరూ సమానమే, ఆ మాత్రం దానికి రెండు సపరేటు కోర్సులు ఎందుకు. ఏమిటీ అన్యాయం. రెండూ కలిపి ఒకేకోర్సు కింద చెప్పండి. మేము అది చదివేసి గైనిక్ కం ఆండ్రాలజిస్ట్ అని పెట్టేసుకుంటాం”- అని ఏ డాక్టరూ ఇప్పటిదాకా డిమాండ్ చేయలేదు.

******
అమెరికాలో జాన్ గ్రే , అనే ఓ ప్రఖ్యాత రచయిత ‘మెన్ ఆర్ ఫ్రం మార్స్- వుమెన్ ఆర్ ఫ్రం వీనస్’ అనే పుస్తకాన్ని రాశాడు. స్త్రీ,పురుషుల ఆలోచనలు ఎలా వేరు వేరుగా ఉంటాయి. వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా వేరువేరుగా ఉంటాయి లాంటివి వివరించే, 300 పేజీల ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 5కోట్ల కాపీలు పైగానే అమ్ముడుపోయింది. ఇంకా అమ్ముడుపోతూనే ఉంది.
“స్త్రీ-పురుషులు సమానం రా వెధవ,వారి ఆలోచనలూ, ఆవేశాలూ అన్నీ సమానమే, వస్తే ఇద్దరూ మార్స్ నుండో, లేక ఇద్దరూ వీనస్ నుండో వస్తారు కానీ, ఇలా మహిళల పట్ల ఈ వివక్ష ఎందుకని” ఎవరూ ఆ రచయితని ఇప్పటిదాకా నిలదీయలేదు.

******
సం యుక్త బీజంలో, XX క్రోమోజోంలుంటే ఆడ శిశువు, XY క్రోమోజోములుంటే మగ శిశువు జన్మిస్తారని స్కూల్లలో బోధిస్తున్నారు. “ఉంటే రెండూ XX ఉండాలి, లేకుంటే రెండూ YY ఉండాలి. అంతే తప్ప, ఆడ శిశువు, మగ శిశువులకు తేడాలు ఎందుకు, ఇలాంటి చదువులు చెప్పొద్దని” ఏ హేతువాదీ ఇప్పటిదాకా నినదించలేదు.
పైన చెప్పిన విషయాల్లో, ఎవరికీ ఏదీ తప్పుగా,వివక్షగా అనిపించట్లేదు. కానీ, ఇస్లాం దగ్గరికి వచ్చేటప్పటికి, వారి అభిప్రాయాలు ఎలా మారిపోతాయో చూడండి.
ఇస్లాం స్త్రీ, పురుషుల గురించి ఏమంటుంది?
“స్త్రీ, పురుషులు వేరు,వేరు. ఇద్దరూ సరూపాలే కానీ, సమానాలు కాదు.(IDENTICAL, but NOT EQUAL) అలాగని ఒకరు ఎక్కువనో, ఇంకొకరు తక్కువనో కాదు. ఇద్దరికీ, వేరు,వేరు హక్కులున్నాయి, బాధ్యతలున్నాయి. వాటిని అర్థం చేసుకుని, ఇద్దరూ దైవభీతి కలవారై, సఖ్యతతో మెలగండి”
ఇది వినగానే, స్త్రీ, పురుషులకు వేరు,వేరు హక్కులా, ఇది అన్యాయం, స్త్రీల పట్ల వివక్ష, స్త్రీలపై అణచివేత అంటూ కొందరు తయారవుతారు.వీరికి మీడియా కూడా విపరీత ప్రాచుర్యం కలిగిస్తుంది. ఈ అడ్డగోలు వార్తలన్నీ తలకెక్కి, చాలామంది ముస్లింలు కూడా, ఇస్లాం మహిళల పట్ల వివక్ష చూపడం నిజమేనేమో అనే భావనతో ఆత్మ న్యూనతకి(ఇంఫీరియారిటీ) గురవుతుంటారు.
మనం తెలుసుకోవలసిన విషయాలు
1. వెస్ట్రన్ మీడియా, వెస్ట్రన్ సమాజం ప్రవచించే స్త్రీ, పురుష సమానత్వం కేవలం ఓ మిధ్య.(Myth).
2. అది స్త్రీ శరీరాన్ని ఓ ఆటవస్తువుగా మార్చి, వాణిజ్యావసరాలకు వాడుకునే ఓ నీచమైన ఎత్తుగడ. T.Vల్లో వచ్చే అడ్వెర్టైస్మెంట్లను ఒక్క 5 నిమిషాలు గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. మగాల్లు తోలే బైకు యాడ్ అయినా, గెడ్డం గీక్కునే బ్లేడు అయినా.. ఓ అందమైన స్త్రీ అమ్మవలసిందే.

3. వేల కోట్ల విలువైన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోని హాలీవుడ్,బాలీవుడ్ లాంటి వివిధ వుడ్ లు సగం నడిచేది, ఆడవారి అంగాంగ ప్రదర్శన మీదే.
స్త్రీలను ఏదో ఉద్ధరిస్తున్నామని ఫోజు కొట్టే యూరప్,అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ సమానత్వ చట్టాలు వచ్చింది గత కొన్ని శతాబ్ధాల్లోనే. ఇది ఎక్కువరోజులు ఉంటుందని కూడా చెప్పలేము. ఎందుకంటే, అక్కడ చట్టాల్ని, సంస్కృతిని నిర్దేశించేది మార్కెట్ శక్తులే. వాటి అవసరాల్ని బట్టి ఏ చట్టాన్ని ఎలా అయినా మార్చేస్తాయి. కానీ ఇస్లాం ధర్మం, కాలాన్ని బట్టో, ప్రాంతాన్ని బట్టో, లేక ఏ ఒక్క వర్గం స్వార్థ పూరిత సౌకర్యాల కోసమో మారేది కాదు. ఖురాన్, మానవ జీవితానికి యూజర్ మ్యాన్యువల్ లాంటింది. స్త్రీ, పురుషులకు ఏదైతే మంచిదనే విషయం సృష్టికర్తకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published.