Brian Longden – లండన్ లో లారీ డ్రైవర్. గూడ్స్ డెలివరీ చేసే క్రమంలో, ఇంగ్లాండ్ లోని వివిధ ప్రదేశాలు తిరుగుతుంటాడు. ఓ సారి, అలా StalyBridge అనే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. Brian Longden కి ఓ హాబీ ఉంది. అది తన పూర్వీకుల చరిత్రల్ని,వారి జీవన విధానాల్ని సేకరించడం. అలా రెండు తరాల సమాచారం మొత్తం సేకరించాడు. మూడో తరం నాటి వ్యక్తులు, StalyBridge ఏరియాలో నివసించినట్లు అతనిదగ్గర సమాచారం ఉంది. అంతకు మించి మరేమీ తెలీదు. దీనితో అక్కడి లోకల్ ప్రభుత్వాఫీసుకు వెళ్ళి, సర్ నేమ్ Stanley కి సంబంధించిన పాత సమాచారం ఏదైనా ఉందేమో కావాలని అడిగాడు. అక్కడ ఉన్న ఓ పెద్దాయన, పాత రికార్డ్స్ అనీ వెతికి కొన్ని డాక్యుమెంట్లు తెచ్చి ఆయన ముందు పడేశాడు. అవి -1828-1911 మధ్య ఆ టౌన్ లో జీవించిన Robert Reschid Stanley అనే వ్యక్తికి సంబంధించిన రికార్డ్స్. ఆ రికార్డ్ ని బట్టి, ఆయన ఆ ప్రాంత మేయర్ గా పనిచేశారని అర్థమైంది. ఇక రెండో పేపర్లో ఆయన ఫోటో ఉంది. అది చూడగానే, బ్రయాన్ లాంగ్డన్ కి షాక్ కొట్టినట్లైంది. దానికి కారణం – ఫోటోలో ఆయన తలపై ఉన్న టోపీ.
బ్రయాన్ లాంగ్డన్ కి ఇలాంటి షాక్ కొట్టడం ఇది రెండో సారి. మొదటి సారి, పదేళ్ళ ముందు, తన కొడుకు, రూంలో తలుపువేసుకుని, తలమీద టోపీతో నమాజ్ చదువుతున్న దృశ్యాన్ని చూసి అతనికి మొదటిసారి షాక్ కొట్టింది. ముస్లిం గా మారిన తన కొడుకువల్లే, ముస్లింలు అలా తలపై టోపీ ధరిస్తారని అతనికి తెలిసింది. తన కొడుకు క్రైస్తవ మతాన్ని వదిలేయడాన్ని జీర్ణించుకోవడం మొదట్లో కష్టంగా ఉన్నప్పటికీ, తర్వాత అతనికి అలవాటైపోయింది. ఇప్పుడు తన గ్రేట్,గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కూడా ఇస్లాం లోకి కన్వర్ట్ అయి ఉన్నాడనే విషయం తెలిసి, అతని మైండ్ బ్లాంక్ అయింది. మరి ఈ విషయం తన తల్లి-దండ్రులు తనకు ఎందుకు చెప్పలేదు? వారికి కూడా తెలీదా? ఆయన ఎలా,ఎందుకు కన్వర్ట్ అయ్యాడు? దానిని తమ వంశం వారు ఎందుకు సీక్రెట్ గా ఉంచారు? ఇలాంటి ప్రశ్నలు ఆయన మైండ్లో వరసపెట్టి ముసురుకున్నాయి. తన ముందున్న రికార్డ్స్ అన్నిటినీ తీసుకుని ఆయన ఇంటికి చేరుకున్నారు.ఇంటికి రాగానే తన కొడుకు Steven Longden, కూతురు Christina Longden లకు తనకు తెలిసిన సమాచారం మొత్తం చెప్పి, ఆ రికార్డ్స్ ని వారి ముందుంచాడు. అప్పటికే ముస్లిం ఐన Steven Longden, అల్-హందులిల్లాహ్ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. Christina Longden మైండ్ మాత్రం కంఫ్యూజన్ తో నిండిపోయి ఉంది. ఆమె అసలే హిస్టరీ స్టూడెంట్. మొదటి ప్రపంచయుద్ధానికి ముందు, బ్రిటన్ లోని సామాజిక పరిస్థితులు, అప్పటి ముస్లిం రాజ్యం అట్టోమాన్(ఇప్పుడు టర్కీ) తో బ్రిటన్ కి ఉన్న శత్రుత్వం, బ్రిటన్ లో అప్పట్లో ఇస్లాం స్వీకరించిన ప్రముఖ బ్రిటీష్ అధికారులు Abdullah Quillium, Marmaduke Pickthall వంటి వారిని , అట్టోమన్ సామ్రాజ్యం తరుపున పనిచేసే దేశద్రోహులుగా ముద్రేసి, వేధించిన విషయం, వారిని సమాజం నుండీ వెలేసిన పరిస్థితులు .. ఇలాంటి అంశాల గురించి క్రిష్టినాకు అప్పటికే అవగాహన ఉంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో తన ముత్తాత, ఎందుకు ఇస్లాం లోకి కన్వర్ట్ అయి ఉంటాడు? ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొని ఉంటాడు? Abdullah Quillium, Marmaduke Pickthall వంటివారు బ్రిటీష్ ప్రభుత్వంలో ఉన్నతోద్యోగులు కాబట్టి, వారు అప్పట్లో ప్రభుత్వ పనులమీద ఇస్లామిక్ దేశాల్ని సందర్శించడం, అక్కడ ఇస్లాం కి అట్రాక్ట్ అయి ముస్లింలుగా మారడం జరిగింది. కానీ, బ్రిటన్లోని ఓ మారుమూల టౌన్ లో నివసించిన ఈ వ్యక్తి ఇస్లాం కి ఎలా ఆకర్షితుడయ్యాడు.. ఇలాంటి ప్రశ్నలను చేధించడానికి ఆమె ఓ పెద్ద రీసెర్చీనే చేసింది. 150 ఏళ్ళ క్రితం నాటి పాత బ్రిటీష్ న్యూస్ పేపర్లను, ప్రభుత్వ రికార్డులనూ జల్లెడ పట్టి వెతికింది. తాను తెలుసుకున్న విషయాల పై రెండు పుస్తకాల్ని రాసింది. – 1. His Own Man(A Victorian Hidden Muslim. The life and Times of Robert Reschid Stanley ) 2. Imagining Robert (Scenes from the life of Robert Reschid Stanley 1828-1911)