“ఏ.. మేం హిందువులం కాదా.
మేం యాగాలు చేయలేదా. మేం చేసినన్ని యాగాలు దేశంలో ఇంకెవరన్నా చేసిండ్రా. నువ్ చెప్తేనే చేసినమా.
నువ్ మా కంటే పెద్ద హిందువువా.
చిన్న జీయర్ కాళ్ళకు మొక్కుతా.. కంచి పీఠాధిపతి కి సాష్టాంగ వందనం చేస్తా. పొద్దున లేసి మంత్రం చదువుతా. నువ్ చెప్తేనే చేసినమా ఇయన్నీ..
నువ్వెవరు హిందూ మతం గురించి చెప్పనీకి..”
ఇవి నిన్న ప్రెస్ మీట్ లో కేసీఆర్ సంధించిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు. ఈ ఆర్గ్యుమెంట్ కి చెడ్డీ బ్యాచ్ దగ్గర సమాధానం లేదు, ఉండదు.
బీజేపీ ని హ్యాండిల్ చేయాలంటే – ఈ ఒక్క స్ట్రాటెజీ మాత్రమే వర్కవుట్ అవుద్ది. ఈ విషయం కేసీఆర్ చక్కగా అర్థం చేసుకున్నారు. అస్సలు అర్థం చేసుకోలేక, నాస్తికత్వాన్ని తలకెత్తుకుని కమ్యూనిష్టులు కనుమరుగయ్యారు. సగం-సగం అర్థం చేసుకుని కాంగ్రెస్ కొన ఊపిరితో ఉంది, అప్పుడప్పుడూ కొన్ని రాష్ట్రాల ఎన్నికలు గెలుస్తూ బీజేపీకి సేఫ్టీ వాల్వ్ లా సహాయం చేస్తూ ఉంది.
“కావాలంటే ఇంకో యాగం ఎక్కువ చేస్కో గానీ, రాజకీయాల గురించి మాత్రం మాట్లాడొద్దు ” – 2010 లో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి , సమైక్యఆంధ్ర ప్రదేశ్ కి మద్దతుగా మాట్లాడినప్పుడు – ఆయనకి కేసీఆర్ ఇచ్చిన కౌంటర్ అది.అలాంటి కేసీఆర్, ఇప్పుడు యాగాలు చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. వ్యక్తిగతంగా ఎవరి మత విశ్వాసాలు వారివి. దాని గురించి ఇతరులు మాట్లాడేదేమి ఉండదు.
కానీ, కేసీఆర్ చేస్తున్న ఈ యాగాలు, రాజకీయంగా ఆయనకు చాలా సహాయం చేస్తాయి. ఎందుకు, ఎలా అనేది తెలియాలంటే, ప్రస్తుతం రాహుల్ గాంధీ/కాంగ్రెస్ పరిస్థితి చూస్తే చాలు. రాహుల్ గాంధీ ఈ మధ్య ఎక్కడికెళ్లినా , ముందుగా అక్కడి ప్రముఖ దేవాలయాలను సందర్శించడం అనే నియమాన్ని చాలా ఖశ్చితంగా, నిష్టగా ఫాలో అవుతున్నాడు. ఇంతకు ముందు ఇలా చేసేవాడు కాదు. కేవలం ఈ మధ్య మాత్రమే మొదలుపెట్టాడు. ఎందుకలా చేస్తున్నాడు? ఎందుకంటే, బిజెపి, దాని అనుబంధ సంఘాలు, కాంగ్రెస్ గురించి తెరవెనుక చేసే ప్రచారాల్లో అతి ముఖ్యమైంది – “కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకం అని”. దానికి, సోనియా గాంధీ యొక్క క్రిష్టియన్ బ్యాక్గ్రౌండ్ కూడా వీరికి బాగా కలిసొచ్చింది. దానికి తోడు, వీరు ముస్లింల గురించి అప్పుడప్పుడు కార్చే మొసలి కన్నీరు అదనపు అడ్వాంటేజ్ గా మారింది. దానితో, హిందూ-ముస్లింల మధ్య గొడవలు జరిగిన ప్రతీసారీ, ప్రతిచోటా, హిందువులు, బిజెపి వైపే మొగ్గుచూపారు, చూపుతున్నారు. ముస్లింలు మాత్రం – కాంగ్రెస్ కంటే రెండు చుక్కలు ఎక్కువ మొసలి కన్నీరు కార్చగల లాలూ, ములాయం వంటివారివైపుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ మాత్రం రెంటికి చెడ్డ రేవడి లా తయారైంది. బీహార్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనుమరుగు కావడానికి ప్రధాన కారణం ఇదే.
ఈ విషయం ఆలస్యంగానైనా , రాహుల్ గాంధీ గుర్తించాడు. “నేను కూడా హిందువునే ” అని చాటుకోవడానికి ఇప్పుడు పాపం చాలా శ్రమిస్తున్నాడు. అట్లే, ముస్లింల పై మొసలి కన్నీరు కూడా, ఇంతకు ముందులా ధారాళంగా కురిపించకుండా కాస్తంత జాగ్రత్త పడుతున్నాడు., అందుకే , గోగ్రవాదుల లించింగ్ ఉదంతాలపై పెద్దగా నోరువిప్పడు. ఏ ఒక్క బాధిత కుటుంబాన్నీ ఇప్పటివరకు కలిసి పరామర్శించి లేదు. విలువలు, ఆదర్శాల సంగతెలా ఉన్నా, 20 % కంటే 80 % చాలా చాలా ఎక్కువకదా। బోడి 20 % కోసం ఆశపడి, 80 % ని ఎవరు వదులుకుంటారు ?
కేసీఆర్ ఎంతైనా, తెలివైనోడు. అనుభవశాలి. బిజెపి, వారి వెనకున్న చెడ్డీబ్యాచ్ చావు తెలివితేటలు , వారి కుయుక్తులన్నీ బాగా తెలిసిన వాడు. అందుకే రాహుల్ గాంధీలా ‘చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండా’, ముందుగానే విరుగుడు స్టెప్స్ వేస్తున్నాడు. ఓ పక్క, నేను 80 % లో ఒకడినని అన్నిరకాలుగా ప్రకటిస్తూనే, మరో పక్క ఛాన్స్ దొరికినప్పుడల్లా తలపై టోపీ ధరించి, నిజాం గురించి శుద్ధ ఉర్దూ లో నాలుగు మంచిమాటలు చెప్తూ, అటు ముస్లింలనూ గ్రిప్ లో పెట్టుకుంటున్నాడు. షాదీ ముబారక్, రెసిడెన్షియల్ పాఠశాలాల్లాంటి మంచి పథకాలు ఉండనే ఉన్నాయి।।। “ఐడెంటిటీ ” అనేది ఓ కీలక రాజకీయాంశం ఐన ప్రస్తుత భారత రాజకీయాల్లొ, కేసీఆర్ అత్యంత తెలివిగా, సమర్థవంతంగా దానిని హ్యాండిల్ చేస్తున్నాడు. కంగ్రాక్ట్స్ కేసీఆర్।!