బంగ్లాదేశ్ వెళ్ళిపోండి!!

పాకిస్తాన్ లో జరుగుతున్న ఆయిల్ నిక్షేపాల ఎక్స్ ప్లోరేషన్ గురించి ఆల్రెడీ రాసి ఉన్నా.

నిన్న ఇమ్రాన్ ఖాన్ అదే చెప్పాడు.
ఈ స్పెక్యులేషన్ నిజం ఐతే, సౌదీ,దుబాయ్,కువైట్ లాంటి సంపన్న దేశాల సరసన పాకిస్తాన్ నిలబడుతుంది.
అప్పుడు భారత్-పాక్ సంబంధాలు ఎలా ఉంటాయి. భారత సమాజంలో, భారత మీడియాలో పాకిస్తాన్ డెపిక్షన్ ఎలా ఉండబోతుంది? 


భారత కార్పోరేట్ మీడియాల్ని, భారత రాజకీయాల్ని నిర్దేషించే ఉత్తర భారత గుజరాతీ-మార్వాడీ బ్యాచ్ కి రాత్రికి రాత్రి పాకిస్తాన్ శత్రు దేశంలా కాకుండా, ఆకర్షనీయమైన మార్కెట్ గా మారిపోతుంది. ఆ వెంటనే రాజకీయాల్లోనూ, సాంస్కృతిక రంగాల్లోనూ వెనువెంటనే చాలా మార్పులొస్తాయి.
ఇప్పుడు ముస్లింలను పాకిస్తాన్ వెళ్ళిపొమ్మని రంకెలేసే శక్తులు, అందరికంటే ముందుగా, రెక్కలు కట్టుకుని అక్కడవాలిపోతాయి, మెళ్ళో తాబీజులు వేసుకొని మరీ.

మరి, ఈ ఛప్పన్ ఇంచ్ చప్పుల్లూ,నేషనలిజం నినాదాలూ, దేశభక్తి సూక్తులూ, అర్నబ్ గోస్వామి మొరుగుల్లూ .. ఇవన్నీ ఏమైపోవాలి?
ఏం పర్లేదు. పక్కనే బంగ్లాదేశ్ ఉందిగా. అసలే ఈ మధ్య వాల్లు క్రికెట్ కూడా నేర్చేసుకుంటున్నారు. ఇంకేం కావాలి.
ఓ రెండు మ్యాచుల్లో ఇండియా ఓడిపోయి, ‘బంగ్లాదేశ్ గెలిస్తే పాతబస్తీలో టపాసులు కాల్చి, బంగ్లాదేశ్ జెండా ఎగరేశారంట ‘ అనే ఫేక్ న్యూస్ ని ఫేసుబుక్కూ, వాట్సప్పుల్లో ఫార్వర్డ్ చేస్తే సరి. మనోల్లకు బంగ్లాదేశ్ కి వ్యతిరేకంగా, దేశభక్తి పూనకం ఆటోమేటిక్ గా తన్నుకొచ్చేస్తుంది.

సో, ఇక మనం వినబోయే కొత్త నినాదం – “ఇండియాలో మీకేం పని, బంగ్లాదేశ్ వెళ్ళిపోండి”

Leave a Reply

Your email address will not be published.