మహిళల మసీదు ప్రవేశం గురించి..

Part-1

గండికోట ప్రవేశం లాగా, మసీదులోకి ప్రవేశం అనే మాటే వినడానికి చాలా గంభీరంగా ఉంది. కేరళ ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చినప్పటి నుండీ, మసీదుల్లోకి కూడా మహిళల ప్రవేశాన్ని అనుమతించాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇంతకీ, ఈ విషయం గురించి ఖురాన్, ప్రవక్తబోధనల్లో ఏముంది?

 

ఖురాన్ లో ఈ విషయం గురించి ఎలాంటి ప్రత్యేక వ్యాఖ్యానాలూ లేవు. ప్రవక్త కాలంలో మహిళలు కూడా మసీదులోకి వచ్చి నమాజ్ చేసేవారు. ఈ విషయం గురించి చాలా హదీసులు ఉన్నాయి. కానీ, ప్రవక్త మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యాఖ్యానాలు ఏవీ లేవు. దీనిని బట్టి మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై ఎలాంటి ఆంక్షలూ లేవనేది నిర్వివాదాంశం. గల్ఫ్, యూరప్, అమెరికా లాంటి అనేక దేశాల్లో, అనేక మసీదుల్లో మహిళలకు పురుషులతో పాటే ప్రవేశం ఉంది. మన ఇండియాలో కూడా కొన్ని మసీదుల్లో ప్రవేశం ఉంది. ముఖ్యంగా కేరళలో ఇలాంటి మసీదులు కనీసం 500పైనే ఉన్నాయి.

కొన్ని మసీదుల్లోకే ఎందుకు. అన్ని మసీదుల్లోకీ ఎందుకు అనుమతించరు?

ఎందుకంటే, అక్కడ తగినన్ని ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి. మహిళలు కూడా వస్తే, వారికి సపరేట్ గా, టాయ్ లెట్లు, నమాజు చేసుకోవడానికి స్త్రీ,పురుషులకు ప్రత్యేకంగా పార్టీషన్లు ఇవన్నీ ఉండాలి. చాలావరకూ మసీదులు నిధుల లేమి వల్ల, అక్కడికొచ్చే పురుషులకే సరైన వసతులు కల్పించలేని స్థితిలో ఉంటాయి. పురుషులకే చోటు సరిపోక, శుక్రవారం, రంజాన్ నెలల్లో మసీదు బయట, రోడ్డుపై, ఎండలో,వానలో నిలబడే నమాజు చేస్తుంటారు. ఇక మహిళలు కూడా వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

మక్కా,మదీనాల్లోని ప్రధాన మసీదుల్లో స్త్రీ,పురుషుల ప్రవేశం విషయంలో ఎలాంటి తేడాలూ లేవు. కాకపోతే, కొన్ని దర్గాల్లో మాత్రం ఏవో ఆంక్షలున్నట్లున్నాయి. అసలు ఈ దర్గాలకు వెళ్ళి, సమాధులకు మొక్కుకునే సంస్కృతే ఇస్లాం కి విరుద్ధం. కాబట్టి వాటి ఆచారవ్యవహారాలతో ఇస్లాం కి సంబంధం లేదు.

Part-2

దీనిని మరింత లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

ఖురాన్,ప్రవక్త బోధనల్లో చాలా విషయాలకు సంబంధించి డిక్టేటర్ లాగా, ‘చచ్చినట్టు ఇదే చేయమనే ‘ ఏక వాక్య తీర్మాణాలుండవు. 1.ఆర్డర్డ్/మాండేటరీ, 2.సజెస్టెడ్/రెకమెండెడ్, 3.పర్మిటెడ్/అలోవ్డ్, 4.ప్రొహిబిటెడ్/అపోజ్డ్, ఇలా వివిధ కేటగరీలు ఉంటాయి. ప్రొహిబిటేడ్/అపోజ్డ్ విషయాల్లో పెద్దగా చర్చించేదేమీ ఉండదు. ఉదాహరణకు – వడ్డీ, ఆల్కహాల్, దొంగతనం లాంటివి ఈ కేటగిరీలోకొస్తాయి. 1వ కేటగరీ గురించి కూడా చాలా వరకూ క్లారిటీ ఉంది. 5 పూటలా నమాజు, రంజాన్ నెలలో ఉపవాసాలు, దాన ధర్మాలు వంటివి దీనికిందికి వస్తాయి.

వచ్చిన చిక్కంతా 2వ,3వ కేటగరీల గురించే.

1.”ఒంటరిగా నమాజ్ చేసే కంటే, మసీదులో నమాజ్ చేస్తే వచ్చే పుణ్యం చాలా రెట్లు ఎక్కువ”
2.”మహిళకు నమాజ్ చేయడానికి ఉత్తమమైన స్థలం ఆమె ఇల్లు, దానికంటే ఉత్తమమైన స్థలం ఆమె యొక్క వ్యక్తిగత గది/రూం”
3.”మహిళలు మసీదుకు వెల్లాలనుకుంటే వారికి అడ్డుచెప్పకండి”

ఇవన్నీ ప్రవక్త వివిధ సంధర్భాల్లో చేసిన వ్యాఖ్యలే.

1.”స్త్రీ,పురుషులు నిండుగా/పద్దతిగా బట్టలు ధరించాలి”
2.”పరస్త్రీని తేరిపార చూడకుండా, పురుషులు తమ చూపులు దించుకోవాలి/మరల్చుకోవాలి”

ఇవి ఖురాన్ వాక్యాలు.

మొత్తానికి – స్త్రీలకైనా, పురుషులకైనా -రోజుకు 5 సార్లు నమాజ్ చేయడం కంపల్సరీ- ఇది క్లియర్.
ఒంటరిగా నమాజ్ చేసే కంటే, ఇతరులతో కలిసి చేయడం వల్ల వచ్చేపుణ్యం ఎక్కువ- ఇది కూడా క్లియర్.
ఈ విషయం ప్రవక్త గారు చెప్పినప్పుడు, “మరి మహిళలకు ఇంట్లో చిన్న పిల్లలుంటారు, వారి బాగోగులు చూసుకునే బాధ్యత వారిపై ఉంది కదా, మరి వారు ఒంటరిగా నమాజ్ చేసుకుంటే ఆ పుణ్యం రాదా” అని ఓ మహిళ ప్రవక్తను ప్రశ్నించింది” దానిని సమాధానంగా ప్రవక్తగారు చెప్పిందే – ” “మహిళకు నమాజ్ చేయడానికి ఉత్తమమైన స్థలం ఆమె ఇల్లు, దానికంటే ఉత్తమమైన స్థలం ఆమె యొక్క వ్యక్తిగత గది/రూం”

ఇప్పుడు కొందరు మహిళలకు ఇంట్లో అలాంటి బాధ్యతలేమీ ఉండకపోవచ్చు. అలాంటి మహిళలు మసీదుకెళ్ళి నమాజు చేయాలంటే వారిని వద్దని వారించే అధికారం ఎవరికీ లేదు. అలాగని,’ఫెసిలిటీలు ఉన్నా,లేకున్నా, నేను వెళ్ళి పురుషుల మధ్యలో నిలబడి నమాజ్ చేసుకుంటానని’ ఏ మహిళ కూడా అనదు అనలేదు, ఎందుకంటే అది పైన చెప్పిన ఖురాన్ వాక్యాలతో కాన్ ఫ్లిక్ట్ అవుతుంది కాబట్టి.

క్లుప్తంగా చెప్పాలంటే, మసీదులో మహిళలకు ప్రత్యేక ఫెసిలిటిలు ఉండి, ఇంట్లో వేరే ఏ ఇతర బాధ్యతలూ/డిపెండెన్సీలూ లేకుండా, ఎవరైనా మహిళ మసీదుకు వెళ్ళాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళోచ్చు.

అలాంటి ఫెసిలిటీలు కల్పించే సాధ్యాసాధ్యాలు ఎంత? ఫెసిలిటీలు కల్పించాక వాటిని వినియోగించుకునే మహిళలు ఎంతమంది? అనేవి తరువాతి ప్రశ్నలు.

దీనినే మరో రకంగా చూస్తే.. అలా మసీదుకు వెళ్ళాలనుకునే ముస్లిం మహిళలు ఎక్కువసంఖ్యలో ఉండికూడా, వారికి సదుపాయాలు కల్పించే వనరులు ఉండి కూడా, అలాంటి ఫెసిలిటిలు కల్పించలేకపోతే, అది ముస్లిం సమాజం తప్పవుతుంది.

నా అంచనా ప్రకారం, అలాంటి ఫెసిలిటీ కావాలని వాదించే ముస్లిం మహిళలు చాలా,చాలా తక్కువ. ఎందుకంటే, మసీదనేది ఎంటర్టైన్మెంట్ పార్కో, అమ్యూజ్మెంట్ పార్కో కాదు. ముస్లింలకు నమాజ్ చదవడం అనేది తప్పకుండా చేయాల్సిన ఓ విధితప్ప, ఆహ్లాదం కోసమో, ఎంటర్టైన్మెంట్ కోశమో, సరదా కోసమో చేసే పని కాదు. శుక్రవారాలు, రంజాన్ లో తప్ప, చాలా మంది ముస్లిం పురుషులే మసీద్ వైపుకు వెళ్ళరు. అలాంటిది మహిళలు మేం వెల్తామని ఎందుకు పట్టుబడ్తారు?

మసీదుల గురించి ఏ మాత్రం అవగాహన లేకున్నా, మహిళల తరుపున మాట్లాడి ఏదో పెద్ద ఆదర్శవంతులుగా ఫీలయ్యేవారికీ , టీఆర్పీ రేటింగుల కోసం ఆరాటపడే న్యూస్ చానెల్లకూ తప్ప, మిగతా ఎవరికీ, ఇదే మాత్రం పనికొచ్చే అంశం కాదు.

-మహమ్మద్ హనీఫ్.

 

Leave a Reply

Your email address will not be published.