మిడిల్ ఈస్ట్ లో బెస్ట్ నాయకత్వం – ఖతార్

మిడిల్ ఈస్ట్ దేశాల రాజకీయాల్ని గమనిస్తే – భౌగోలికంగా చిన్నదైనప్పటికీ, ఖతార్ దేశం చేసే పనులు చాలా గొప్పగా అనిపిస్తాయి.
1. సి.యెన్.యెన్,బీబీసీ,టైంస్ లాంటివి ముస్లిం/అరబ్ లకు వ్యతిరేకంగా వార్తల్ని రాస్తున్నాయని అందరూ కేవలం ఏడుస్తుంటే, ఖతార్ ఏకంగా వాటికి పోటీగా అల్-జజీరా ను స్థాపించి, ఇంటర్నేషల్ స్టేజ్ మీదకి వదిలింది. వెస్ట్రన్ మీడియా యొక్క వన్-సైడ్ న్యారేషన్ కి బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తుంది.

2. ఖతార్ దాదాపుగా ద్వీపంలా ఉంటుంది. చుట్టూ సముద్రం, ఒక్క వైపు మాత్రం సౌదీ,యూఏయీ,బహ్రైన్ ల్లోకి కాస్తంత రోడ్డు మార్గం ఉంటాయి. తమమాట వినకుండా సొంత తెలివి ఉపయోగిస్తుందనే అక్కసుతో, సౌదీ అరేబియా ఖతార్ నుండీ రోడ్డు మార్గాన్ని బ్లాక్ చేసేసింది. యూఏయీ,బహ్రైన్ లతో కూడా బ్లాక్ చేయించింది. మూడేళ్ళపాటు ఈ బ్లాకేడ్ నడిచింది. వేరే ఏదేశమైనా అయ్యుంటే సౌదీ కాళ్ళమీదపడి క్షమాపణచెప్పుకుని దారుకొచ్చేది..కానీ ఖతార్ తిరగబడింది. ఇరాన్, టర్కీ లతో సముద్రమార్గాన్ని పటిష్టం చేసుకుంది. మొదట్లో పాలు,కూరగాయలు,పౌల్ట్రీ వంటి నిత్యావసర వస్తువులకోసం ఇబ్బందులు పడ్డప్పటికీ, కొద్ది నెలల్లోనే వాటిని తన దేశంలోనే సొంతంగా ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళికలు రచించి చాలా రంగాల్లో స్వయం సమృద్ధి సాధించింది. చివరికి సచ్చినట్లు ఆ బ్లాకేడ్ ని సౌదీ ఉపసమ్హరించుకుంది.

3.ఫుట్బాల్ వరల్డ్ కప్ సమయంలో, స్వలింగ-గ్రూపులు వెస్ట్రన్ మీడియాతో కుమ్మక్కై ఎంతగా ఒత్తిడితేవాలని చూసినా ఖతర్ ఏమాత్రం చలించలేదు. మీ బోడి డాలర్ల కోసం మా మతం,సంస్కృతిని పక్కనపెట్టం అని ఖరాఖండీగా చెప్పింది. జకీర్ నాయక్ ని రానిస్తే ఇండియా ఏమైనా అంటుందేమోనని సౌదీ,దుబాయ్ లాంటి పెద్దదేశాలు కూడా మొహమాటపడుతున్న పరిస్థితుల్లో, ఖతార్ రెడ్-కార్పెట్ స్వాగతమిచ్చింది, ఆయనతో ప్రసంగాలు ఇప్పించింది.

4. ఇక ప్రస్తుతం లేటెస్ట్ గా, ఇజ్రాయెల్ దురాగతాల్ని ఖండించడంలో, మిగతా అన్ని దేశాల కంటే ముందుంది. ఈ పరిస్థితికి ఇజ్రాయెల్ దురాక్రమణే కారణమనీ, ప్రతిదాడులని సాకుగా చూపి, గాజాలో ఇజ్రాయెల్ జనహనానికి పాల్పడే ప్రమాదముందని హెచ్చరించింది.

సౌదీ పాలకులకు ఖతార్ పాలకుల ముందుచూపు,నిజాయితీ,ధైర్యం లలో కనీసం 10% ఉన్నా, ప్రపంచ రాజకీయాలు మరోరకంగా ఉండేవి.

Leave a Reply

Your email address will not be published.