ఏ యూనివర్సిటీ, పరిశోధన ఎప్పుడు చేసింది?
అమెరికాలోని University of Alaska Fairbanks లో, సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ కి చెందిన, పీ హెచ్డీ విద్యార్థులు ఈ పరిశోధన చేశారు. మొత్తం నాలుగు సంవత్సరాల పాటు, బిల్డింగ్ కి సంబంధించిన అన్ని డీటైల్స్ నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి, కంప్యూటర్ సిములేషన్ టెక్నాలజీ ఆధారంగా వివిధ రకాల డెమాలిషన్ మాడల్స్ తో క్రాస్ చెక్ చేసుకుని, పరిశోధనా ఫలితాల్ని గతనెలలో రిలీజ్ చేశారు.
(Link from university website – http://ine.uaf.edu/wtc7)
మొత్తానికి ఏం తీర్మానించారు?
అమెరికన్ ప్రభుత్వం చెప్తున్నట్లు, ఈ కూలిపోవడం అనేది మంటవల్ల అయ్యుండే అవకాశం ఏ మాత్రం లేదు, అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఇంతకీ ఇది ఏ టవర్ గురించి?
సెప్టెంబర్ 11, 2001 అమెరికాలో విమానాలు ఢీకొట్టినరోజు కూలిపోయిన మూడో టవర్ గురించి.
మూడో టవర్ ఏంది, అక్కడ కూలిపోయింది రెండే కదా?
9/11 నాడు, అమెరికాలో నాలుగు విమానాల్ని కొందరు హైజాక్ చేశారు. రెండు విమానాలు ఒక్కొక్కటి 90+ అంతస్తుల ఎత్తున్న రెండు పెద్ద బిల్డింగుల్ని ఢీకొట్టాయి. ఓ గంట తర్వాత, రెండు బిల్డింగులూ నేరుగా, అలాగే కిందికి కుప్పకూలాయి. సుమారు రెండు వేలమంది చనిపోయారు.
మూడవ విమానం – అమెరికన్ రక్షణ వ్యవహారాల హెడ్ క్వార్టర్ పెంటగాన్(పంచ భుజి) బిల్డింగ్ ని ఓ భుజంవైపున ఢీకొట్టింది. మరేం పర్లేదు, సరిగ్గా ఆ వైపునే, పాత ఫైల్లూ, పనికిరాని చెత్తలాంటివి స్టోర్ చేస్తారు, కాబట్టి పెద్దగా నష్టం లేదు.
ఇక నాలుగో విమానం – క్రాష్ ల్యాండింగ్ అయింది.
ఇది జరిగిన వారం రోజులకల్లా, హైజాక్ చేసినోల్ల పూర్తి డీటైల్స్ బయటికి వచ్చేశాయి. వారి గురించి వారు సొంతంగా ఆటోబయాగ్రఫీ రాసుకుని చనిపోయి ఉన్నా, వారి గురించి మీడియాకు ఇన్ని డీటైల్స్ తెలిసేవి కావేమో. మొత్తానికి దీనికి ప్లానింగ్ చేసింది తాలిబాన్/లాడెన్లేనని తేలడమూ, అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడమూ చక,చకా జరిగిపోయాయి. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే.
ఇప్పుడు మూడో టవర్ సంగతి చూద్దాం. WTC అనేది మొత్తం ఏడు టవర్ల సముదాయం. చాలా మందికి వీటిలో రెండు టవర్లే కూలిపోయాయని తెలుసు. కానీ, ఆ రోజు మొత్తం మూడు టవర్లు కూలిపోయాయి. ఏ విమానమూ ఢీకొట్టనప్పటికీ, 47 అంతస్తుల మూడో టవర్, దాని పేరు ( టవర్-7) కూడా కూలిపోయింది. రెండు పెద్ద టవర్లు కూలిపోవడం వల్ల వచ్చిన వేడివల్ల మంటలు లేచి, మూడో టవర్ కూలిపోయిందని అమెరికన్ ప్రభుత్వం ప్రకటించింది. విమానం ఢీకొట్టని టవర్ గురించి అస్సలు రాయడమే దండగనుకుని మీడియా కూడా ఈ వార్తని భూస్థాపితం చేసింది.
ఈ మూడవ బిల్డింగ్ కూలిపోయిన విధానం కూడా భలే గమ్మత్తుగా ఉంటుంది. అప్పటిదాకా నిక్షేపంగా ఉన్న భవనం కాస్తా, కేవలం ఐదే ఐదు సెకన్లలో అలా భూమిలోకి వెళ్ళిపోయింది.
ఇంతకీ నువ్వేమంటావ్?
ఏవో నాలుగు ప్రోగ్రాములు రాసుకుని బతికే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ని నేను. బిల్డింగ్ ల గురించీ, ఆర్కిటెక్చర్ ల గురించీ నాకేమీ తెలీదు కాబట్టి, నేనేమీ చెప్పను.
కాకపోతే..
3280 మంది, అమెరికాలోని ఆర్కిటెక్ట్లు, సివిల్ ఇంజినీర్లు, ప్రముఖ యూనివర్సిటీల్లో సివిల్ ఇంజినీరింగ్ బోధించే అధ్యాపకులూ( వాల్ల పేర్లు, యూనివర్సిటీ, కంపెనీ తదితర డీటైల్స్ ఈ లింకు లో – https://www.ae911truth.org/signatures/#/AE/ ) … వీల్లందరూ చెప్పేదేమంటే, ఎక్కడో పైన ఓ విమానం ఢీకొడితే, అంత ఎత్తైన, దృఢమైన బిల్డింగ్లు, కేవలం గంటలో భూమిలోకి ఒదిగిపోవడమూ, ఇది చూసి సిగ్గుపడి ఆ పక్కనున్న మూడో బిల్డింగ్ కూడా అలా భూమిలోకి ముడుచుకోవడమూ- ఇదంతా స్పీల్ బర్గు సినిమాల్లో చూడ్డానికి బాగుంటుంది తప్ప, రియల్ గా ఎప్పుడూ జరగదూ అని. అలా జరగాలంటే, బిల్డింగుల పిల్లర్ల దగ్గర అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలు పెట్టి, కంట్రోల్డ్ డెమాలిషన్ చేసినప్పుడే అలా సాధ్యమవుతుందని, నేను కాదు, పైన చెప్పిన 3000+ మంది సబ్జెక్ట్ ఎక్స్ పర్టులు చెప్తున్నారు.
ఈ మూడువేలమందీ కలిసి, ఓ సంఘంగా ఏర్పడి(వారి సంఘం పేరు – Architects and Engineers for 9/11 Truth) , ఈ మొత్తం వ్యవహారాన్ని మళ్ళీ పునర్విచారణ చేయాలని ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్ ఎప్పటికీ నెరవేరకపోవచ్చు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలో యుద్ధం కారణంగా కొన్ని లక్షల మంది మాత్రం మృత్యువాతపడ్డారు, అవిటివారయ్యారు.
దీని గురించి ఇంకా తెలుస్కోవాలనే ఆసక్తి ఉన్నోల్లు – ఈ లింక్ చూడొచ్చు – https://www.ae911truth.org/
ఇప్పటికే బాగా తెలుసనుకుని ఫీలైపోతున్నదానికీ, ఈ కొత్త ఇన్‌ఫర్మేషన్ కీ మధ్య సింక్ అవ్వదేమో, రియాక్షన్ అవుద్దేమో, ఎందుకొచ్చిన గొడవలే అనుకునేవాల్లు లైట్ తీస్కోండి.
మీరు ఇంకా ఏం చేయొచ్చంటే, ర్యాంబో-3 అని సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన 1998 సినిమా ఉంటుంది. అది వేసుకుని చూడండి. దానిలో, అమెరికన్లు,ఆఫ్ఘన్లు(అప్పట్లో వీల్లని ముజాహిదీన్లు, అంటే స్వాతంత్ర్య సమరయోధులు అని మీడియా గౌరవంగా పిలిచేది) కలిసి రష్యన్లతో వీరోచితంగా పోరడటాన్ని చాలా చక్కగా చూపించారు. ఇంకా లేదంటే, ‘తాలిబాన్లని మేమే సృష్టించామని’ హిల్లరీ క్లింటన్ గ్రాఫిక్ డీటైల్స్ తో వివరించే ఇంటర్వ్యూల్ని చూసినా సరిపోతుంది.