రేప్ కి అర్థం మారింది-మీ స్త్రీలకు ఈ భరోసా ఇస్తున్నారా?

“వాల్లు ఒక్కొక్కరు రెజ్లింగ్ లో శిక్షణ తీసుకుని ఉన్న బాడీ బిల్డర్లు, అలాంటోల్లను 60 ఏళ్ళ వ్యక్తి రేప్ ఎలా చేయగలడు.. ఇది పాపులారిటీ కోసమో,పైసల కోసమో, మోడి ప్రభుత్వంపై విమర్శల కోసమో వేసిన స్కెచ్” – అని చెప్పే వివిధ చెత్తపోస్టులను నా ఫ్రెండ్ లిస్ట్ లో కొందరు షేర్ చేశారు.

కౌంటర్ వ్యూస్ కూడా తెలియాలనే ఉద్దేశ్యంతో కొందరు చెడ్డీగాల్లను ఫ్రెండ్-లిస్ట్ లో ఉంచుకుని వారి వ్యూస్ ని భరిస్తూ వస్తున్నాగానీ, ఈ పోస్టులు మాత్రం మరీ దారుణంగా అనిపించి, వారిని అన్-ఫ్రెండ్ చేసేశా. మిక్స్డ్ ఫ్రెండ్స్ ఉన్న ఫేస్-బుక్ లోనే వారి పైత్యపు లాజిక్ ఈ రకంగా ఉంటే, ఇక క్లోజ్డ్ వాట్సప్ గ్రూపుల్లో వారి లాజిక్ లు ఏ లెవల్లో ఉంటాయో ఊహించలేం.

హార్డ్ కోర్ చెడ్డీ గాల్ల సంగతి సరేగానీ, పైన చెప్పిన “బాడీ-బిల్డర్ అమ్మాయి Vs 60 ఏళ్ళ ముసలాడు” లాజిక్ చాలా మంది తటస్థులకు కూడా, “కరెక్టే కదా” అనిపించి ఉండే అవకాశం ఉంది. ఆ కాన్‌ఫిడెన్స్ తోనే వారు అలాంటివి షేర్ చేస్తుంటారు.

పాత సినిమాల్లోలా, అమ్మాయిని రూంలోకి పిలిచి, ఎంటరవ్వగానే తలుపేసి, ఆమెనోటిని మూసేసి కనడప్రభాకర్ లా మీదపడిపోవడమే రేప్ కాదు. అలాంటి సినిమాలు చూసి రేపిస్ట్ లెప్పుడో అప్డేట్ అయిపోయారు.

మ్యూచువల్ కన్సెంట్(పరస్పర అంగీకారం) తో స్త్రీ-పురుషుడు ఏం చేసుకున్నా అది తప్పుకాదనే సిద్ధాంతాన్ని మాడరన్,లిబరల్ సొసైటీ,న్యాయవ్యవస్థా.. ఇప్పటికే accept చేసేశాయి కాబట్టి – “కన్సెంట్ ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేని స్థితిలోకి ఓ మహిళను నెట్టేయడం” అనే టెక్నిక్ ని మాడరన్ రేపిస్టులు ఇప్పుడు ఫాలో అవుతున్నారు.

రెజ్లింగ్ ఫెడెరేషన్ అద్యక్షుడైన ఆ బ్రిజ్ భూషన్ గాడు, సరిగ్గా ఈ టెక్నిక్ నే ఫాలో అవుతున్నట్లు, ఆ బాధిత అమ్మాయిల స్టేట్మెంట్లను బట్టి అర్థమవుతుంది. శ్వాస చెక్ చేస్తానని చెప్పి స్థనాలపై చేతులేయడం, అందరూ గ్రూప్ ఫోటో కు నిలబడితే వెనకాల చేతులేసి తడమటం, ఫిట్నెస్ చూడటానికి టీషర్ట్ లు తీసేయమని చెప్పడం,నైట్ డిన్నర్లకు రమ్మని పిలవడం.. ఇవన్నీ – ఆ బాధిత మహిళల టాలరెన్స్ లెవెల్స్ ని చెక్ చేయడానికి, మరియూ నాకు మీ మీద “ఇది” ఉందని చెప్పడం అనే రెండు ప్రయోజనాల్ని ఆశించి చేశాడు.

ఇవి జరిగినప్పుడు ఆ అమ్మాయిల మానసిక సంఘర్షణ ఎలా ఉండి ఉండే చాన్స్ ఉంది?
నా అంచనా ప్రకారం – ఓ అపరిచిత వ్యక్తి అలా చేయగానే ఏ అమ్మాయికైనా జుగుప్స,భయం కలుగుతాయి. బస్టాండ్లోనో, రైల్లో నో అలా చేస్తే – “ఏరా కళ్ళు నెత్తికెక్కాయా” అనే ఒక్క మాటతోనో, ఒక్క సూటి చూపుతోనో తమ నిరసనను ప్రకటించవచ్చు గానీ, ఇక్కడ అతను ఫెడరేషన్ అధ్యక్షుడు. కాబట్టి, అతను కావాలనే తమను తడిమాడా లేక పొరపాటున అతని చెయ్యి తగిలిందా అనేది నిర్ధారించుకోకుండా రియాక్ట్ అయితే తమ కెరీర్ నాశనమవుతుందేమోననే భయం ఒకటి ఉంటుంది.

ఇలాంటివి రిపీటెడ్ గా జరిగి, అతను కావాలనే చేస్తున్నాడనే విషయం నిర్ధారించుకునేటప్పటికి, అతను మరింత అడ్వాన్స్ అయ్యుంటాడు. “నేను ఇలా చాన్నాల్లనుండీ చేస్తున్న విషయం నీకు తెలుసు. నీకు ఇష్టం లెకపోతే మొదట్లోనే కంప్లైంట్ చేసేదానివి.. ఎలాగూ ఇన్నాల్లూ ఓర్చుకున్నావు కదా, ఇంకొంచెం ఓర్చుకుంటే నిన్ను సెలెక్ట్ చేస్తా, ఫారెన్ టూర్లకు పంపిస్తా.. గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తా, లేదంటే నువ్వు జీవితంలో ఏ టోర్నమెంటూ ఆడకుండా చేస్తా..” ఈ టైపు మెసేజింగ్ ఆల్రెడీ రకరకాలుగా ఇస్తుంటాడు. అది రావుగోపాల్రావ్ డైలాగ్ లాగా స్పష్టంగా ఉండదు, రికార్డ్ చేసి నలుగురికీ చూపించడానికి.

అన్ని సంవత్సరాల కఠోర శ్రమ, ప్రాక్టీస్ కోసం వెచ్చించిన తల్లిదండ్రుల డబ్బులు,వారి ఆశలు…. ఇవన్నీ ఓ వైపు – మరోవైపు ఈ కీచకుడు , వీటి మధ్య ఆ అమ్మాయిలు ఎంత నరకం అనుభవించి ఉంటారో మనం ఊహించలేం.

ఆ బ్రిజ్ భూషన్ గాడి బ్యాక్గ్రౌండ్, అతను ఎదిగిన తీరు చూస్తే, అతన్ని టచ్ చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. “నేను ఓ హత్య చేశా” అని మీడియా ఇంటర్యూలో ఓపెన్ గా చెప్పికూడా ఆస్థాయికి వెళ్ళిన ఓ కిరాతకుడికి వ్యతిరేకంగా, కొంతమంది అమ్మాయిలు ధైర్యం కూడగట్టుకుని, తమ కెరీర్ నీ, గౌరవమర్యాదల్నీ పణంగా పెట్టి మాట్లాడమే ఓ అద్భుతం.

వారు కంప్లైంట్ చేసిన మరుక్షణం , అతన్ని ఆ పదవి నుండీ తొలగించి, FIR ఫైల్ చేసి ఫాస్ట్-ట్రాక్ విచారణ చేయకుండా, దిక్కుమాలిన లాజిక్ లతో ఆ అమ్మాయిల్నీ, ప్రతిపక్షాల్నీ నిందించడం, మన రాజకీయాలు,మీడియా,మొత్తంగా సమాజపు దివాలాకోరుతనానికి నిలువెత్తు నిదర్శనం.

మరీ ముఖ్యంగా, ఆడపిల్లల తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు ఒక విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. గతంలో అంటే పాతకాలంలో ఇంటిపట్టునే ఉండే స్త్రీకి ఒక్కడే భర్త- మంచి గానీ చెడు గానీ అతని ద్వారానే… కానీ, ఇప్పటి ఆధునిక కాలంలో, పురుషులతో సమానంగా బయట అడుగుపెట్టిన స్త్రీలపై ఎటువైపునుండీ ఆపదొస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అమ్మాయిలు-మహిళలు తిరిగే,పనిచేసే అన్ని చోట్లా అత్యంత ఏమరుపాటుతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇంట్లో ఆడబిడ్డ ఎవరైనా తాను అసౌకర్యానికి గురవుతున్నాననే ఏ చిన్న హింట్ ఇచ్చినా, కుటుంబ సభ్యులు అలర్ట్ అయ్యి ఆమెకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. “నీ క్షేమమూ,నువ్వు హ్యాపీగా,సుఖంగా ఉండటమే మాకు కావలసింది, నీ ఉద్యోగమూ, నీ సంపాదనా, నువ్వు గెలిచే కప్పులూ.. ఇవన్నీ తర్వాతే.. కాబట్టి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటన్నిటినీ వదిలేసి వచ్చినా, నిన్ను మహారాణిలా చూసుకుంటాననే భరోసా “- ప్రతి తల్లి-తండ్రి/అన్న/భర్త తమ,తమ జీవితాల్లోని మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వారికి దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం కలుగుతుంది.

-మహమ్మద్ హనీఫ్

Leave a Reply

Your email address will not be published.