పాలస్తీనాలో నెత్తురోడుతున్న పిల్లలఫోటోలు,వీడియోలూ చూసి, “దేవుడేగనక ఉంటే, ఆ పిల్లల్ని ఎందుకు కాపాడటం లేదు, కాబట్టి దేవుడు లేడు” అని డిక్లేర్ చేయొచ్చు. తుఫానులు,భూకంపాలు, రోడ్డుప్రమాదాల్లో చనిపోయిన పిల్లల్ని చూసి కూడా ఇలాగే కన్‌క్లూడ్ చేయొచ్చు.
మనం ఎక్కడ, ఎప్పుడు పుట్టాలనేది మనచేతుల్లో ఉన్న విషయం కాదు. ఆ పసిపిల్లల స్థానంలో మనం కూడా ఉండి ఉండొచ్చు. మనం (లేక) మన తల్లిదండ్రులు గొప్పోల్లు కాబట్టో, ఏదో బీభత్సమైన ప్లానింగ్ చేయబట్టో మనకు ఆ పరిస్థితి రాలేదని చెప్పడానికి లేదు. మనకు ఆ కష్టాలు రానందుకు “అల్-హందులిల్లాహ్”(Thanks to Creator) అని కూడా కన్‌క్లూడ్ చేయొచ్చు.
ఎవరి ఛాయిస్ వారిదే.
కూలిపోయిన తన ఇంటి శిధిలాల మీద కూర్చుని “వలనబ్లువన్నకుమ్”అని ఖురాన్ లోని వాక్యాల్ని ఎంతో ఆర్థంగా పాడుతున్న పాలస్తీనా బాలుని వీడియో దాదాపు అందరూ చూసే ఉంటారు. వలనబ్లువన్నకుమ్ – అంటే – “మేము నిన్ను తప్పక పరీక్షిస్తాం” అని.