మహమ్మద్ అలీ – వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ టైటిల్ గెలిచాడు. ఆ మరుసటి ఏడాది – వియత్నాం యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు. తాను ఎన్నో ఏళ్ళు ప్రాణం పెట్టి నేర్చుకున్న బాక్సింగ్ కెరీర్ వదులుకోవడానికీ,జైలుకెళ్ళడానికీ కూడా సిద్ధపడ్డాడు. ఎందుకు..? దానికి అతను చెప్పిన కారణం – నేను నమ్మిన ఇస్లాం, నా అంతరాత్మ – వియత్నాం ప్రజలపై బాంబులేయడానికి నన్ను అనుమతించదు.
Continue reading “ఎందుకు..?”ఆయన ప్రవక్తే అని గ్యారెంటీ ఏమిటి?
చరిత్రలో కొన్ని ఊహాత్మక,కల్పిత పాత్రలుంటాయి. కొన్ని చారిత్రక, నిజజీవిత పాత్రలుంటాయి. ఉదాహరణకు ఏసుక్రీస్తు,బుద్దుడు,అశోకుడు.. వీరు చారిత్రక వ్యక్తులు. అంటే, ఈ భూమిపై ఓ పర్టికులర్ కాలంలో జీవించి, కొన్ని పనులు చేసి, అనంతరం మరణించిన వ్యక్తులు. అట్లే కొన్ని కల్పిత,ఊహాజనిత పాత్రలు కూడా మనకు తెలుసు. మహమ్మద్ ప్రవక్త(స), పైన చెప్పిన ఏసుక్రీస్తు, బుద్ధుడు, అశోకులలాగానే నిజంగా జీవించిన, వారి తరువాతి కాలానికి చెందిన వ్యక్తి.
ఇస్లామోఫ్రాన్సియా!!!
ఫ్రాన్స్ లో టీచర్ హత్య దారుణమైన విషయం. ఈ మాట చెప్పడంలో ఎలాంటి ఇఫ్(if),బట్స్(but) ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే, ఈ క్రైం ని మొత్తం ముస్లిం సమాజానికి ఆపాదించి అటు ఫ్రాన్స్ ప్రభుత్వం,ఇటు కొందరు ఇస్లామోఫోబిక్ విశ్లేషకులూ తమ రహస్య అజెండాల్ని అమలుపరిచే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఫ్రాన్స్ కపట రాజకీయాల్ని,దాని ఇస్లామోఫోబిక్ చరిత్రనీ అర్థం చేసుకోవాల్సి ఉంది. ముందుగా, మనోభావాల గురించి ఇటీవల ఫ్రాన్స్ లోనే జరిగిన ఓ గమ్మత్తైన విషయం చూద్దాం.
Continue reading “ఇస్లామోఫ్రాన్సియా!!!”మొన్న జైరా వసీమ్ – నిన్న సనాఖాన్!!!
సనాఖాన్ – హిందీ,తమిల్,తెలుగు,కన్నడ కలిపి 15 సినిమాలూ, హిందీ బిగ్-బాస్, ఝలక్ దిఖ్లాజా వంటి కొన్ని టీవీ షోలూ చేసింది. రెండు రోజుల ముందు – సడెన్ గా తాను టీవీ/సినిమాలకూ, మొత్తంగా మోడలింగ్/ఎంటర్టైన్మెంట్ రంగానికీ స్వస్తి చెప్తున్నట్లు ప్రకటించింది. తన ట్విట్టర్,ఇన్స్టాగ్రాం అకౌంట్ల నుండీ, తాను గతంలో పోస్ట్ చేసిన అన్ని గ్లామరస్ ఫోటోలనూ డిలీట్ చేసేసింది. హిజాబ్ తో ఉన్న లేటెస్ట్ ఫోటోను పోస్ట్ చేసింది. ఇదంతా చేయడం వెనక తన మైండ్లో నడిచిన థాట్ ప్రాసెస్ ని ఓ చక్కని పోస్టులో రాసింది.
ఇలా చేయటానికి ఈమె చెప్పిన ప్రధాన కారణాలు రెండు.
షేక్ అహ్మద్ దీదాద్ – ద లెజెండ్!!
నెల్సన్ మండేలా – 1994 మే నెలలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అదే నెల చివర్లో సౌదీ అరేబియా పర్యటనకు వెళ్ళారు. అక్కడ మండేలాను కలిసిన సౌదీ మంత్రులు,అధికారులూ అందరూ ఓ ప్రశ్న మాత్రం కశ్చితంగా అడుగుతున్నారు. అది – “మీదేశంలో మా అహ్మద్ దీదాద్ ఎలా ఉన్నారు, మీరు ఆయన్ని కలిశారా” అని. తమ దేశంలో పెట్టుబడులు పెట్టమని అడగటానికి ఈ సంపన్న అరబ్ దేశానికి వస్తే, ఇక్కడి అరబ్బులందరూ ఓ సౌత్ ఆఫ్రికన్ వ్యక్తి పేరును కలవరిస్తుండటం నెల్సన్ మండేలాకు వింతగా అనిపించింది. వెంటనే అక్కడి నుండీ సౌత్ ఆఫ్రికాలోని అహ్మద్ దీదాద్ ఇంటికి ఫోన్ చేసి, “మిస్టర్ దీదాద్, ఇక్కడ ఎవర్ని కదిపినా, మీపేరునే కలవరిస్తున్నారు. మీరెంత గొప్పవారో ఇక్కడకొచ్చాకే తెలిసింది. నేను మన దేశానికి రాగానే అర్జంటుగా మనం ఓ సారి కలుద్దాం” అని చెప్పారు.
Continue reading “షేక్ అహ్మద్ దీదాద్ – ద లెజెండ్!!”