ఏవరైనా ఒక ముస్లిం తప్పుచేస్తే, దానిని మొత్తం ముస్లిం సమాజానికి,ఇస్లాం కి ఆపాదించి కొన్ని తరాలపాటు జనం దానిని జనం గుర్తుపెట్టుకునేలా చేయడం- అనేది కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్.కానీ, ముస్లిం లు చేసే మంచిపనులేవీ ఎక్కడా చర్చకు రావు. దీనికి మరో ఉదాహరణే ఇది.
Continue reading “ఐర్లాండ్ కరువుకు తల్లడిల్లిన సుల్తాన్”ముస్లిం గా ఉండటం అంటే ఇదే..(అంత వీజీ కాదు)
ముహమ్మద్ రిజ్వాన్ – విజయవంతమైన పాకిస్తాన్ క్రికెట్ ఓపెనర్ గా అందరికీ పరిచయమే.
చాలా మందికి తెలియని విషయం- అతను కేవలం నామమాత్రపు ముస్లిం కాకుండా, ఇస్లామిక్ జీవన విధానాన్ని చాలా నిష్ఠగా ఆచరించే వ్యక్తి.ఈ విషయానికి సంబంధించిన ఓ వీడియో, నెట్లో గత కొన్ని రోజులుగా తెగ వైరల్ అయ్యింది.
అవును.. వాళ్ళు బాంబులు పేల్చారు!!
ఈ విషయం గురించి రాయాలంటే చాంతాడంత రాయొచ్చు. కానీ, ఏదైనా ఉపయోగముంటుందా అనేది ప్రశ్న. ఓ పక్క వివిధ ప్రభుత్వ సంస్థలు, మెయిన్ స్ట్రీమ్ మీడియా, సినిమాలూ, టీవీలూ, చివరికి జబర్దస్త్ లాంటి కామెడీ ప్రోగ్రామ్ లు కూడా, “టెర్రరిజం అంటే ఆ మతమే”, “టెర్రరిస్టులంటే వాళ్ళే” అనే బ్రెయిన్ వాష్ ప్రాపగాండాని సమాజంలో యుద్దప్రాతిపదకన Day in Day Out ప్రాపగేట్ చేస్తున్నప్పుడు, కొందరు వ్యక్తులు ఎన్ని వ్యాసాలు రాస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది..?
Continue reading “అవును.. వాళ్ళు బాంబులు పేల్చారు!!”