“భార్యకు భర్త సర్వాధికారి కాడు” – సుప్రీం కోర్టు.

కొంచెం ఆలస్యమైనా, చివరికి మంచిమాటే చెప్పారు. ఇస్లాం ఈ విషయం 1400 ఏళ్ళ క్రితమే చెప్పింది. భార్య భర్తకో, భర్త భార్యకో సర్వాధికారి కారు. వీళ్ళిద్దరికీ సర్వాధికారి సృష్టికర్తే.

ఇస్లాం ప్రకారం పెళ్ళి అనేది – ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం. ఆ ఒప్పంద పత్రమే నికానామా. నికానామాలో స్త్రీ గానీ, పురుషుడు గానీ ఎలాంటి షరతులైనా పెట్టొచ్చు.

ఇరువురూ ఆ షరతులకు ఒప్పుకుంటేనే వివాహం అవుతుంది, లేకపోతే లేదు. ఇద్దరిలో ఎవరైనా ఆ షరతుల్ని అతిక్రమిస్తే, పార్ట్నర్ కి ఆటోమేటిక్ గా, దాని బేసిస్ మీద విడాకులు కోరే ఫెసిలిటీ ఉంది.

ఉదాహరణకు – అబ్బాయి రెండో పెళ్ళి చేసుకోకూడదని అమ్మాయి నికానామాలో షరతు పెట్టొచ్చు. ఒకవేల ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే, తాను విడాకులు తీసుకుంటాననీ, అప్పుడు తనకు ఇంత పరిహారం/భరణం ఇవ్వాలని కూడా షరతుపెట్టొచ్చు.

నికానామాతో సంబంధం లేకుండా, ‘ఇంక చాలు ‘ అనుకున్నప్పుడు గానీ, బయట ఇంకో మంచి ఆప్షన్ రెడీగా ఉందనుకున్నప్పుడు గానీ, స్త్రీ అయినా, పురుషుడైనా విడాకులు తీసుకుని ఎవరి ఆప్షన్లు వారు చూసుకోవచ్చు. ఈ రకంగా, స్త్రీ ఐనా, పురుషుడైనా పద్దతిగా ఎన్ని సార్లైనా పునర్వివాహం చేసుకోవచ్చు.
స్త్రీకి గానీ, పురుషుడికి గానీ మొదటివివాహం అయినా, పదో వివాహం అయినా, అగ్రిమెంట్ కి కట్టుబడి ఉన్నన్నాల్లూ అది పవిత్రబంధం కిందే లెక్క. పెళ్ళి నాటికి స్త్రీ కన్య అయి ఉండాలనే నియమమేదీ ఇస్లాంలో లేదు. ఒక స్త్రీ విధవరాలైందంటే దానర్థం, ఆమె భర్తకు అల్లా నుండీ పిలుపువచ్చిందనే తప్ప, ఆమె జాతకం బాగోలేక కాదు. కాబట్టి ఆమె నిరభ్యంతరంగా మరో పెళ్ళి చేసుకోవచ్చు.

ముస్లిం స్త్రీల బురఖాలపై పేజీలకొద్దీ సానుభూతి కురిపించేవారికి ఇవన్నీ ఆశ్చర్యకరంగా అనిపించొచ్చు గానీ, ఇస్లాం లో ఈ కాన్స్పెట్స్ అన్నీ 14శతాబ్ధాల క్రితం నుండే ఉన్నాయి.

నోట్: ఇస్లాం లో స్త్రీ,పురుషులు సరూపాలే గానీ సమానం కాదు. (Identical but Not Exact Equal ) . కాబట్టి కొన్ని అంశాల్లో పురుషులకూ,స్త్రీలకూ వేర్వేరు నియమాలుంటాయి. హారోన్లు సరిగా పనిచేస్తూ, స్త్రీ,పురుష ఆలోచనాసరలిపై అవగాహనతో ఆలోచిస్తే ఆ నియమాలవెనకున్న లాజిక్లు అర్థమవ్తాయి. ఉదాహరణకు, వంశపారంపర్య ఆస్తి వచ్చే మార్గాలు పురుషునికంటే, స్త్రీకే ఎక్కువ. పురుషాధిక్య సమాజంలో ముస్లిం పురుషులు ఇస్లామిక్ నియమాల్ని నిష్ఠగా పాటించకపోవడం వల్లా, మీడియా చెప్పకపోవడం వల్లా వీటి గురించి చాలా మందికి తెలీదు.

-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

 

Leave a Reply

Your email address will not be published.