ఇదో టైపు ఫోబియా, ఆత్మ న్యూనత

ఎక్కడైనా తీవ్రవాద దాడి జరగగానే ముస్లింలే చేశారని ముందుగా అనౌన్స్ చేయడం -> అది బాగా వైరల్ అవ్వడం -> తర్వాత అది చేసింది ముస్లింలు కాదని తెలియగానే, సైలెంట్ గా దానిని కప్పెట్టేయడం -> ఇదో రొటీన్ తంతు, ప్రపంచ వ్యాప్తంగా. మన దేశంలో ఇలాంటి మరో ప్యాటర్న్ : సో కాల్డ్ సెక్యులర్ పార్టీలు ఓడిపోగానే, MIM పార్టీని బ్లేమ్ చేయడం -> దానిని వైరల్ చేయడం -> నియోజకవర్గాల వారీ డేటా ప్రకారం MIM పార్టీని నిందించడానికేం లేదని తెలియగానే ముఖానికి నల్లరంగేసుకుని సైలెంటైపోవడం – ఇది ప్రతి ఎన్నికల్లోనూ జరిగే రొటిన్ తంతు.

— ఈ క్రింది డాటా , నేను ఎలక్షన్ కమీషన్ వెబ్సైట్ నుండీ స్వయంగా తీసి, లెక్కలేసింది. అణుమాణమున్నోల్లు ఈజీగా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. -MIM 20 స్థానాల్లో పోటీ చేసింది. మొత్తం 520000 ఓట్లు సాధించింది. ఐదు లక్షల ఇరవై వేల ఓట్లు – నోట్ చేసుకోండి. -ఫలానా స్థానంలో – పోటీ చేయకుంటే, ఆ వోట్లు కాంగ్రెస్/ఆర్జేడీ కి కలిపితే వారు గెలిచేవారు, MIM పోటీ చేసింది కాబట్టీ NDA గెలిచిందని చెప్పే స్థానం ఒక్కటీ కూడా లేదు. ఇది క్లియర్. – కిషన్ గంజ్ నియోజక వర్గంలో, స్వీటీ సింగ్ అనే బీజేపీ అభ్యర్థి 500 ఓట్ల ఆధిక్యంతో గెలవబోతున్నట్లూ,ఇది MIM కారణంగానే అన్నట్లూ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ ఐంది.ఇంకా అవుతుంది. అక్కడ ఫైనల్ గా గెలిచింది కాంగ్రెస్ అబ్యర్థి – ఇఝారుల్ హుసైన్. మీకా పాత పోస్టు ఎవరైనా షేర్ చేస్తే, వారికి ఇది చెప్పి గడ్డిపెట్టండి. ఇప్పుడు అసలు విషయానికి రండి – MIM కి ఇది బీహార్ లో మూడో అటెంప్ట్. మొదటి అటెంప్ట్ లో జీరో స్థానాలు గెలిచింది. విశ్లేషకులు – “MIM పోటీ చేయడం ఎందుకు అన్నారు.బీజేపీ బి-టీమ్ అన్నారు.”రెండో అటెంప్ట్ లో ఒక బై-ఎలెక్షన్ గెలిచింది.విశ్లేషకులు – “MIM పోటీ చేయడం ఎందుకు అన్నారు.బీజేపీ బి-టీమ్ అన్నారు”ఈ మూడో అటెంప్ట్ లో ఇరవై స్థానల్లో పోటీచేసి, 5 గెలిచింది. విశ్లేషకులు – “MIM పోటీ చేయడం ఎందుకు అన్నారు.బీజేపీ బి-టీమ్ అంటున్నారు. “కాంగ్రెస్/ఆరెజేడీ ఇంకో నాలుగు స్థానాలు గెలిచి ఉంటే – MIM కింగ్ మేకర్ అయ్యుండేది. హంగ్ వస్తే, NDA కి మద్దతిచ్చే ప్రసక్తే లేదని, కౌంటింగ్ మధ్యలో ఉండగానే ఓవైసీ ప్రకటించాడు. విశ్లేషకుల ముఖాన నల్లగుడ్డ ఈ పాటికే పడిపోయుండాల్సింది. కానీ తుడిచేసుకున్నారు. బీహార్లో ని సెక్యులర్ పార్టీలన్నిటీతో పొత్తుకోసం తాము చాలా ప్రయత్నించామనీ, కానీ ఆ పార్టీలే ముందుకు రాలేదనీ ఆజ్తక్ ఇంటర్వ్యూలో ఓవైసీ చెప్పాడు. దీనిని ఖండిస్తూ ఏ పార్టీకూడా వ్యాఖ్యానించినట్లు లేదు. అలాగ్గానీ జరిగి ఉంటే కామెంట్లలో రాయండి. *********ఇక్కడ కీలకమైన విషయం – 520000 మంది బీహారీలు MIM కి ఓటేశారు. విషయం ఇంత స్పష్టంగా ఉన్నా – ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న ఓవైసీకి బీహార్తో ఏం పని అని సద్ధి కామెంట్లు చేయడం వేస్ట్. సో కాల్డ్ సెక్యులర్ పార్టీలపై ముస్లింలకు క్రమంగా నమ్మకం సడలుతోంది. ఆ గ్యాప్ ఓవైసీ పూడుస్తున్నాడు. ఈ గ్యాప్ పూడ్చే అవకాశం నాయకులుగా ఎదగాలనుకుంటున్న ముస్లిం లందరికీ ఉంది. చేయాల్సిందల్లా – ఆత్మన్యూనతనూ, బానిస మనస్తత్వాన్నీ వదులుకోవడమే. కేరళకు చెందిన IUML(ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ) కూడా ముస్లింలకు ఓ మంచి ఆల్టర్నేటివ్. నా దృష్టిలో, ఒన్ మ్యాన్ ఆర్మీ గా నడిచే MIM కంటే , డెమోక్రటిక్ లక్షణాలున్న IUML నే బెటర్. రేపు IUML ఆంధ్రాలో కొంచెం ఎదగగానే, దాన్ని కూడా ఓట్ కటర్, టీడీపీ-బీ టీమ్ అని వైసీపీ వాళ్ళూ, వైసీపీ బీ-టీం అని టీడీపీ వాల్లూ, కేరలలో ఉండకుండా, ఇక్కడెందుకు అని – కొందరు ముస్లిం విశ్లేషకులూ అంటారు. అప్పుడు కూడా నా అనలైసిస్ ఇలాగే, ప్రో-IUML, ప్రో-MIM గానే ఉంటది. ఆ పార్టీలు రాజ్యాంగ వ్యతిరేక, ఇస్లాం/ముస్లిం వ్యతిరేక పనులేమైనా చేస్తే తప్ప.

-శుక్రవారం.ఇన్

Leave a Reply

Your email address will not be published.