మీడియా – మైండ్ కంట్రోల్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ “సన్నీఫాజ్” నిన్న ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. అది –
ర్యాండమ్ గా జనాల దగ్గరకెళ్ళి “ఆండ్రూ టేట్” గురించి మీ అభిప్రాయం ఏమిటని అడగడం.

అతను మాట్లాడిన పది మందిలో, తొమ్మిది మంది ఆండ్రూ టేట్ పేరు వినగానే – అతను – చెడ్డోడనీ, స్త్రీ ద్వేషి అనీ, అలాంటోడు సమాజంలో బతకడానికి అర్హుడు కాదనీ- ఇలా అతని పట్ల తీవ్రంగా ద్వేషాన్ని వెల్లగక్కారు.

ఆండ్రూ టేట్ చేసిన ఏ పని కారణంగా, లేదా, అతను చెప్పిన ఏ మాట కారణంగా వారు అతని పట్ల ఈ అభిప్రాయానికి వచ్చారని అడిగితే మాత్రం – ఏ ఒక్కరి దగ్గరా సరైన సమాధానం లేదు.

“అతనేం చెప్పాడో ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు”,
“నేను ప్రత్యక్షంగా వినలేదు”,
“నాకు పెద్దగా తెలీదు”,
“చెడు పని చేయకుంటే అందరూ ఎందుకు అతని గురించి చెడుగా మాట్లాడతారు”,

ఇవీ.. వారు చెప్పిన సమాధానాలు..

అంటే- అతనేం చెప్పాడో, ఏం చేశాడో తమకు తెలీదని చెప్తూనే- అతని పట్ల విపరీత ద్వేశాన్ని, నెగెటివ్ అభిప్రాయాల్నీ కలిగి ఉన్నామని మాత్రం బాహాటంగానే ఒప్పుకుంటున్నారు.

ఇండియాలో- ఇదే ఎక్స్పెరిమెంట్ చేస్తే –
ఉమర్ ఖాలీద్, జకీర్ నాయక్, ఇస్లాం వంటి అంశాల గురించి కూడా – ప్రతి పదిమందిలో తొమ్మిది మంది ఇలాగే నెగెటివ్ అభిప్రాయాల్ని కలిగి ఉంటారనడంలో సందేహం లేదు.. వాళ్ళేం చేశారో, ఏ మాట్లాడారో తమకు ఏమాత్రం తెలియనప్పటికీ.
అదే సమయంలో, మోడీ, బీజేపీ, గుజరాత్ మాడల్, నోట్ల రద్దు వంటి అంశాల గురించి మాత్రం పాజిటివ్ ఒపీనియన్ ని కలిగి ఉంటారు. ఆ పాజిటివ్ ఒపీనియన్ ఎందుకనే విషయాన్ని లాజికల్ గా ఒక్కరూ కూడా వివరించలేరు.

మెయిన్ స్ట్రీమ్ మీడియా- సోషల్ మీడియాలు – అకారణంగా కొందర్ని ద్వేషించేలా చేయగలవు. అకారణంగా కొందరిని అక్కున చేర్చుకునేలా చేయగలవు. లాజికల్ గా, క్రిటికల్ గా, ఆబ్జెక్టివ్ గా అనలైజ్ చేయగలిగేవారికి దీనికి ఆధారాలు కళ్ళముందే లెక్కకు మించి కనిపిస్తాయి. ఇస్లాం లోకి కన్వర్ట్ అయి, నిజాలు మాట్లాడడం మొదలుపెట్టగానే, ఆండ్రూ టేట్ ని అరెస్టు చేసి జైల్లో పడేయడం, దానికి జనాలు మద్దతివ్వడం, “మీడియా మైండ్ కంట్రోలింగ్” కి తాజా ఉదాహరణ.

కింద లింక్ : ఆండ్రూ టేట్ సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియో.
https://www.youtube.com/watch?v=FVLKBXhFOOc

శుక్రవారం.ఇన్

Leave a Reply

Your email address will not be published.