ప్రవక్త నడిచిన నేల!!
Some facts are more stranger than fiction – అని ఓ ఫ్రెంచ్ కొటేషన్ ఉంది.
ఈ పోస్ట్ చదివాక, ఇదంతా నిజమేనా అని ఎవరైనా ఆశ్చర్యపోతే, వారికి దీనిని గుర్తుచేయడం మినహా చేయగలిగిందేమీ లేదు.
2016 -అక్టోబర్ నెల.
"చార్లెస్ డార్విన్- రామ్ గోపాల్ వర్మ-ఓ ముస్లిం" – ఈ ముగ్గురి ఆలోచనలనూ, సమాజంపై వీరి ప్రభావాన్ని ఆవిష్కరించిన పుస్తకం.అమెజాన్.ఇన్ లో అందుబాటులో ఉంది.
ప్రవక్త నడిచిన నేల!!
Some facts are more stranger than fiction – అని ఓ ఫ్రెంచ్ కొటేషన్ ఉంది.
ఈ పోస్ట్ చదివాక, ఇదంతా నిజమేనా అని ఎవరైనా ఆశ్చర్యపోతే, వారికి దీనిని గుర్తుచేయడం మినహా చేయగలిగిందేమీ లేదు.
2016 -అక్టోబర్ నెల.
మసీదు కుర్చీ!!
=============
కుర్చీ మీద కూర్చున్నోడు గొప్ప, దాని పక్కన నిలుచున్నోడి కంటే, దాని వెనకాల నేలపై కూర్చున్నోడి కంటే.
అందుకే కుర్చీకి డిమాండ్. ప్రతి వ్యక్తికీ ఎలాగోలా చేసి కుర్చీమీద కూర్చోడమే టార్గెట్.
కుర్చీ పెద్దరికానికి ప్రతీక, హోదాకి ప్రతీక, అధికారానికి ప్రతీక, డబ్బూ-దర్పానికి ప్రతీక, సౌకర్యానికి ప్రతీక. పది మంది జనాలుండి, కేవలం రెండో-మూడో కుర్చీలుంటే, ఇక ఆ కుర్చీలకుండే డిమాండ్ చూడాలి. వాటికోసం అడ్వాన్స్ రిజర్వేషన్లు, రెకమెండేషన్లు,పోటీలు, గొడవలు, అలకలూ, ‘నేనేంటో-నా లెవలేంటో తెలుసా ‘ టైపు డైలాగులు… ఇదంతా హ్యూమన్ టెండేన్సీ, మానవ నైజం.
చివరకు మిగలనిది!!
==============
“మనిషి జీవితానికి అస్సలు విలువ లేదు. అది గడ్డిపోచతో సమానం”- అని ఎవరైనా మతపెద్ద చెప్తే, మనోల్లు పళ్ళికలిస్తారు, ఎగతాలి చేస్తారు. కానీ ఇదే మాట కొన్ని దశాబ్దాలక్రితం బుచ్చిబాబు అనే రచయిత, తన ‘చివరకు మిగిలేది’ అనే నవలలో చెబితే, మనోల్లు, దానిని తెలుగులో వచ్చిన సీరియస్,గొప్పనవలల్లో ఒకటిగా నిలబెట్టారు.
సమానత్వం – ప్రివిలైజెస్!!
===================
“కూలీ కావాలా సార్!!”
ఈ మాట ఇప్పటికి ఎన్నిసార్లు విన్నానోలెక్కలేదు.
టోలీచౌకి, రుమాన్ హోటల్ కి చాయ్తాగడానికి ఉదయంపూట వెళ్ళి, ఫై ఓవర్కింద బైక్ పార్క్ చేయగానే, అక్కడిఅడ్డాకూలీల కళ్ళన్నీ ఆశగా మనవైపేచూస్తుంటాయి, కూలీల కోసంవచ్చామేమోననుకుని.
వెల్డన్ బీజేపీ – గుడ్ లక్ సాధ్విప్రఞాసింగ్!!
==========================
ఈ ఎన్నికల్లో గెలవాలని, నేను కోరుకున్నఅబ్యర్థులు ఇప్పటివరకూ ఇద్దరు– కణయకుమార్, ప్రకాష్ రాజ్. ఇప్పుడు మరోమూడో అబ్యర్థి కూడా గెలవాలనికోరుకుంటున్నాను – ఆమె – సాధ్వీ ప్రఞాసింగ్. ఈమె బీజేపీ తరుపున భోపాల్నుండీ పోటీ చేస్తుంది. మొదటి ఇద్దరూగెలిచే అవకాశాలు చాలా తక్కువ. కానీఈ మూడో అభ్యర్థి గెలిచే అవకాశంమాత్రం చాలా చాలా ఎక్కువ.
Continue reading “వెల్డన్ బీజేపీ – గుడ్ లక్ సాధ్విప్రఞాసింగ్!!”
గల్లీ ముస్లిం లీడర్లకు ఓ వినమ్రతాపూర్వక విన్నపం!!
============================
ఓటు అడగడానికి మీదగ్గరకొచ్చే ప్రతి లీడర్కీ తలపై టోపీ , భుజానికి ఎర్రటి చమ్కీల గుడ్డ పేలిక(అది ఎందుకు కడ్తారో నాకైతే తెలీదు) కట్టి, దానితో భీబత్సమైన మతసేవ+ దేశసేవ చేసినట్లు మీరు ఫీలైపోతున్నారు. ఆ వచ్చిన లీడర్ కూడా, కాసేపు అవి రెండూ ఒంటిపై ఉంచుకుని, ముస్లింల కోసం పెద్ద త్యాగం చేసినట్లు ఫీలైపోతున్నారు.
Continue reading “గల్లీ ముస్లిం లీడర్లకు ఓ వినమ్రతాపూర్వక విన్నపం!!”
“బ్రిటీష్ వారికి కాంగ్రెస్ సేఫ్టీ వాల్వ్ లాగా ఉపయోగపడెను” – అను వాక్యాన్ని విశ్లేషింపుము.
ఈ ప్రశ్న సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 హిస్టరీ పేపర్లలో గానీ, ఇంటర్వ్యూలలో గానీ అడుగుతుంటారు.
కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో, దీనికి సమాధానం ఎలా రాయమని చెప్తారంటే –
“కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఎ.ఒ.హ్యూమ్ అనే బ్రిటీష్ వ్యక్తి ఐనప్పటికిన్నీ,
బ్రిటీష్ వారు ఎంత ఎదవలూ,క్రూరులూ ఐనా సరే, వారికి మాత్రం మనం ఎలాంటి హానీ తలపెట్టరాదని చెప్పినప్పటికిన్నీ,
1922లో, చౌరా-చోరీ హింసను సాకుగా చూపి, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సహాయనిరాకరణొద్యమాన్ని అర్థాంతరంగా ఆపేసినప్పటికిన్నీ,
కొట్టి-కొట్టి వాడే అలసిపోతాడు తప్ప, నువ్వు మాత్రం వాన్నేమీ అనబాక అనే అర్థంలేని అహింసా ఉద్యమాన్ని నడిపినప్పటికిన్నీ,
కాంగ్రెస్ బ్రిటీష్ వారికి సేఫ్టీ వాల్వ్ లాగా ఉపయోగపడింది అని చెప్పడం మాత్రం నిరాధారమైనది. కాంగ్రెసోల్లు మనకు స్వాతంత్రయ్మ్ తెచ్చిన వీరులు” – అని సమాధానం రాయాలంట.
ఎప్పుడు చూడు, అవే అరిగిపోయిన ప్రశ్నలు, అవే అరిగిపోయిన సమాధానాలు. అప్డేట్ అవ్వరా..?
సరే , ఇప్పుడు అప్డేటెడ్ ప్రశ్న అడుగుతా, చదూకోండి.
స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ చెడ్డీ బ్యాచ్ కి సేఫ్టీ వాల్వ్ లా ఉపయోగపడెను- అను వాక్యాన్ని విశ్లేషింపుము.
గాంధీ హత్యకు సంబంధించిన కేసులో, చెడ్డీ సంఘంపై విధించిన నిషేధాన్ని ఎత్తేసింది కాంగ్రెస్ పార్టీయే ఐనప్పటికిన్నీ,
బాబ్రీ మసీదు తలుపులు తెరిపించింది, దానిని కూల్చే ప్రయత్నాలకు పరోక్షంగా సహకరించిందీ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఐనప్పటికిన్నీ,
ముంబై అల్లర్లలో, ముస్లింలపై శివసేన చేసిన అరాచాకాలకు సంబంధించిన జస్టిస్ శ్రీక్రిష్ణ రిపోర్టును బుట్టదాఖలు చేసింది కాగ్రెస్ ప్రభుత్వాలే అయినప్పటికిన్నీ,
జగన్ లాంటి రాజకీయ ప్రత్యర్థుల కేసుల్లో ఆగమేహాలపై విచారణలు చేపించి జైలుకు పంపి, అద్వానీ,యోగీ,మోడీ లాంటి వారు ముద్దాయిలుగా ఉన్న తీవ్రమైన కేసుల్లో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించినప్పటికిన్నీ,
ఇన్నేల్లు అధికారంలో ఉండి కూడా, ద్వితీయ శ్రేణి పౌరులుగా, దిగజారిపోతున్న ముస్లింల బతుకుల్ని బాగుచేసే ఏ ఒక్క పధకాన్నీ ప్రవేశపెట్టకపోయినప్పటికిన్నీ,
మతహింసా నిరోధక బిల్లు లాంటి వాటిని సైలెంటుగా అటకెక్కించినప్పటికిన్నీ,
కాంగ్రెస్ ని చెడ్డీ బ్యాచ్ కి సేఫ్టీ వాల్వ్ అని చెప్పరాదు. ఆల్లు ఉత్తమోత్తములు, నిఖార్సైన సెక్యులరిస్టులు “- అని చెప్పాలి
పాకిస్తాన్ లో జరుగుతున్న ఆయిల్ నిక్షేపాల ఎక్స్ ప్లోరేషన్ గురించి ఆల్రెడీ రాసి ఉన్నా.
నిన్న ఇమ్రాన్ ఖాన్ అదే చెప్పాడు.
ఈ స్పెక్యులేషన్ నిజం ఐతే, సౌదీ,దుబాయ్,కువైట్ లాంటి సంపన్న దేశాల సరసన పాకిస్తాన్ నిలబడుతుంది.
అప్పుడు భారత్-పాక్ సంబంధాలు ఎలా ఉంటాయి. భారత సమాజంలో, భారత మీడియాలో పాకిస్తాన్ డెపిక్షన్ ఎలా ఉండబోతుంది? Continue reading “బంగ్లాదేశ్ వెళ్ళిపోండి!!”
పుట్టుక లాగే, చావు కూడా ఓ అనివార్యమైన లాంఛనం. Its Just a Procedure. కళ్ళముందు నుండీ ఓ తెర తొలగిపోయే ప్రక్రియ. అందుకే చావు వార్తలేవీ నన్ను పెద్దగా బాధించవు. కానీ, ఆ చావు ఎలా వచ్చింది, దానికి సంబంధించిన పరిణామాలు వివిధ ఆలోచనలను, ఆవేశాలను కలిగిస్తుంటాయి.
టెర్రరిస్ట్ దాడులు, బాంబు పేలుల్లు జరిగినప్పుడల్లా, ఇస్లాం,అల్లాహు అక్బర్, జీహాద్.. ఇవి కాకుంటే, ఇంకేవో అరబిక్ పదాలు వార్తల్లోకి రావడం, ఇస్లాం ని ఉద్దరించడం కోసం తామే ఇది చేశామని ప్రకటించడం, లేదా, మీడియా ఆ విధంగా డిక్లేర్ చేసేయడం ప్రతిసారీ జరిగేదే. అలాంటివి చూసినప్పుడల్లా, చాలా బాధ,ఆవేశం కలుగుతుంది. ఇస్లాం పేరు మీద చిమ్మే ప్రతి రక్తపు బొట్టూ, ఇస్లాం శాంతియుతమని నమ్మి,దానిని ఆచరించే కోట్లమంది ముస్లింలను బోనులో నిలబెట్టేదే.
భగవంతునికి-భక్తునికి అనుసంధానకర్తలు !!
============================“అమ్మాయిలు ఇల్లొదిలి బయటికి వెళ్లారంటే, ఇక వారు చేయి జారిపోయినట్లే లెక్క. వాళ్ళని అస్సలు బయటికి పంపించకండి. ఈ చదువులు, స్కూళ్ళు,కాలేజీలు. అమ్మాయిలకు అస్సలు పనికి రావు. పూర్తి పరదా పాటించడం మన సాంప్రదాయం “
“అల్లా ముస్లింల కోసమే స్వర్గాన్ని సృష్టించాడు. దానిలో కేవలం ముస్లింలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ముస్లిమేతరులు ఎన్ని మంచిపనులు చేసినా, వారికి ప్రవేశం ఉండదు. ముస్లింలు మాత్రం, ఏమైనా పాపాలు చేసిఉంటే, దానికి తగ్గట్లు వారికి కొంతకాలం నరకంలో శిక్షలుంటాయి, కానీ , అంతిమంగా వారికి స్వర్గంలో ప్రవేశం ఉంటుంది”