కత్తి మహేశ్

కత్తి మహేశ్
=========

నేను పెరియార్, అంబేద్కర్, రంగనాయకమ్మల రచనలు చదివి ఉన్నాను. వారు చేసిన విమర్శలు,కామెంట్లతో పోల్చితే కత్తి మహేశ్ చేసిన విమర్శలు 1% కూడా ఉండవు.

పోనీ, పుస్తకాలు ఎవరూ చదవరు, టీవీలు అందరూ చూస్తారు కాబట్టి ఈ వివాదం అనుకున్నా – రాంగోపాల్ వర్మ ఇదే టివీ స్టూడియోల్లో చేసిన కామెంట్లతో పోల్చితే, కత్తి మహేశ్ కామెంట్లు అస్సలు లెక్కలోకే రావు.

Continue reading “కత్తి మహేశ్”

ఆసియా బీబీ కేసు – ఇస్లాం – వివిధ స్పందనలు!!!

ఆసియా బీబీ కేసు – ఇస్లాం – వివిధ స్పందనలు!!!
===========================

2009లో, పాకిస్తాన్ లో ఆసియా బీబీ అనే ఓ క్రైస్తవ మహిళ, ఇతర ముస్లిం మహిళలతో కలిసి పొలం పనులు చేసుకుంటున్నప్పుడు – ఓ ముంతలో నీరు తాగడం గురించి వారి మధ్య గొడవ జరిగింది. క్రైస్తవురాలైన ఆమె ముస్లిం లు తాగే ముంతతో నీళ్ళు తాగొద్దని ఆమెను వారించారనీ,అప్పుడు, మీ ప్రవక్త మీకు చెప్పింది ఇదేనా అని ఆమె వీరిని ప్రశ్నించిందనీ, దీనితో మాటా,మాటా పెరిగి గొడవ జరిగిందనీ, ఆ గొడవలో ఆమె ప్రవక్తని తిట్టిందనీ, ఆ ముస్లిం మహిళలందరూ ఆమెపై కేసు వేశారు.

తాను తిట్టలేదనీ, ఆ మహిళల్లో ఒకామె తన పక్కింట్లోనే ఉంటుందనీ, ఆమెతో తమకు స్థలం సరిహద్దు విషయంలో తగాదాలు ఉన్నాయనీ, ఆ పాతగొడవల్ని మనసులో పెట్టుకుని, తనని ఇలా ఇరికించిందనీ ఆమె వాపోతుంది.

Continue reading “ఆసియా బీబీ కేసు – ఇస్లాం – వివిధ స్పందనలు!!!”

అమ్ముల పొదిలోని ఆఖరు ప్రశ్న!!

అమ్ముల పొదిలోని ఆఖరు ప్రశ్న!!
======================== 

పోస్ట్ గురించి – బ్రీఫ్ గా..

—————–

కత్తి మహేష్, బాబూ గోగినేని, కంచ ఐలయ్యా, .. మొదలగువారు.. మీరు హిందూ మతాన్ని విమర్శించినంతగా ఇస్లాం, క్రిష్టియానిటీలను ఎందుకు విమర్శించరు అనే ప్రశ్నకు తడబడతారు, డిఫెన్సివ్ ఆన్సర్ ఇస్తారు.

ఈ స్టేట్మెంట్ తప్పనిపిస్తే, ఇక్కడితో చదవడం ఆపేయండి. . మీతో పెద్దగా డిస్కషన్ అవసరం లేదు.(So, that you won’t be wasting your time, my time too).

Continue reading “అమ్ముల పొదిలోని ఆఖరు ప్రశ్న!!”

కాంగ్రెస్ మార్కు సెక్యులరిజం!!

కాంగ్రెస్ మార్కు సెక్యులరిజం!!
=====================

ఎన్నికల్లో గెలవడానికి నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, తీరా గెలిచాక ఆ హామీల్ని గాలికొదిలేయడం- ఇది అన్ని పార్టీలు చేసేదే. ఈ విషయం జనాలకు కూడా బాగా తెలుసు కాబట్టి, ఈ హామీలు నెరవేర్చకపోవడం అనే అంశాన్ని అంత తీవ్రమైన విషయంగా పరిగనించకుండా, ఓ సారి ఈ పార్టీకి, ఇంకో సారి మరో పార్టీకి ఓట్లేసి గెలిపిస్తుంటారు. ఇది గత 60 ఏళ్ళుగా అందరికీ తెలిసిన రాజకీయమే.

కానీ, అంతకు ముందెన్నడూ జరగని, కేవలం గత నాలుగేళ్ళలోనే జరిగిన,జరుగుతున్న ఓ పరిణామమేటి?

Continue reading “కాంగ్రెస్ మార్కు సెక్యులరిజం!!”

అల్లా ఏం చేయట్లేదా..? – పార్ట్-2

అల్లా ఏం చేయట్లేదా..? – పార్ట్-2
==================

గత పోస్ట్ లో రాసినట్లు – “ఇన్ని జరుగుతుంటే అల్లా ఏం చేస్తున్నాడు” , అనేది చాలా మంది ఫేవరైట్ డైలాగ్. ఇదో ఫిక్షనల్, ఊహాజనిత కొచెన్. కాబట్టి దీనికి ఫిక్షనల్, ఊహాజనిత ఆన్సర్ మాత్రమే ఎవరైనా ఇవ్వగలరు. అదేంటో చూద్దాం.

Continue reading “అల్లా ఏం చేయట్లేదా..? – పార్ట్-2”

ఇంతకీ అల్లా ఏం చేస్తున్నట్లు!!!

ఇంతకీ అల్లా ఏం చేస్తున్నట్లు!!!
===================

“ఇన్ని జరుగుతుంటే – అల్లా ఏం చేస్తున్నట్లు!!”
“ముస్లింలు అన్ని కష్టాలు పడుతుంటే – అల్లా ఎందుకు కాపాడట్లేదు!!”
“యూదులు అంతగా బలపడి పాలస్తీనియుల్ని చంపేస్తుంటే అల్లా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు!!.”
“ముస్లిం లను కాపాడలేనప్పుడు – ఇక అల్లా ఉండి ఏం లాభం!!”

ఇవీ రొటీన్ గా చాలా మంది అడిగే ప్రశ్నలు. ఇలా అడిగేవారిలో ముస్లింల సంఖ్య కూడా తక్కువేం కాదు.

Continue reading “ఇంతకీ అల్లా ఏం చేస్తున్నట్లు!!!”

మొదటిసారి ఖురాన్ చదివాక…

మొదటిసారి ఖురాన్ చదివాక…
====================
గోడకు కొట్టిన బంతి వెనక్కు రావడమనేది, ఆ బంతి ఎలాంటిది అనే అంశంపై,దానిని కొట్టే శక్తిపైనే కాకుండా, ‘ఆ గోడ ఎలాంటిదీ’ అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. గోడ గట్టిగా ఉంటే ఒకలా, అప్పుడే పూతపూసి పచ్చిగా ఉంటే ఇంకోలా, దానిపై గడ్డి మొలిచి ఉంటే మరోలా, ఆ బంతి వెనక్కు వస్తుంది.

Continue reading “మొదటిసారి ఖురాన్ చదివాక…”

ఇల్లివ్వని ఓనర్లందరికీ థ్యాంక్స్!!

సెలెబ్రేషన్స్ ఆర్ ఇన్  ఏఇర్ “(Celebrations are in the Air)  –గాలిలో సెలెబ్రేషన్స్ ఉంటాయా?  రంజాన్నెల రాత్రుల్లో  సారి టోలిచౌకి కి రండి.ఇక్కడి గాలిలో సెలెబ్రేషన్స్ కనిపిస్తాయి.

 ఏరియా సంవత్సరంలో 11 నెలలూమిగతా ప్రాంతాల్లాగనే మామూలుగాఉంటుందిరంజాన్ నెల రాగానే ఇక్కడివెలుతురు నిద్దరోయిచీకటి కొత్తవెలుగుల్ని సంతరించుకుంటుందిఇక్కడిజనజీవనం మొత్తం పగటి జీవనం నుండిరాత్రి జీవనానికి షిఫ్ట్ అవుతుంది.హోటల్లుఅంగల్లు అన్నీ రాత్రంతాపనిచేస్తుంటాయిపగలు మాత్రం విశ్రాంతితీసుకుంటాయిఉపవాసాలుండే ఇక్కడిముస్లింలలాగే.

Continue reading “ఇల్లివ్వని ఓనర్లందరికీ థ్యాంక్స్!!”

స్త్రీ జనోద్ధారకులారా, ఇది చూడండి!!

స్త్రీ జనోద్ధారకులారా, ఇది చూడండి!!
=========================
ఇస్లాం స్త్రీలను అణచివేస్తుందని, కించపరుస్తుందనీ, ఇంకా ఏదేదో చేస్తుందనీ అస్తమానం తెగ గింజుకునే, ఫెమినిస్టులు ఉరఫ్ స్త్రీ జనోద్ధారకులకు ఈ క్రింది సమాచారం మెదడుకు మేత లాంటిది.
ఇది 2013లో, ప్రముఖ బ్రిటన్ పత్రిక – దగార్డియన్ లో వచ్చిన కథనం.

Continue reading “స్త్రీ జనోద్ధారకులారా, ఇది చూడండి!!”

పురుషుల్ని తీవ్రంగా అణగదొక్కిన మతం!!!

పురుషుల్ని తీవ్రంగా అణగదొక్కిన మతం!!!
=========================

“మతాలన్నీ మహిళల్ని అణగదొక్కాయి. ఇస్లాం ఐతే మరీనూ” – ఈ మాట ఫెమినిస్టులూ ఉరఫ్ స్త్రీ జనోద్ధారకులందరూ ఏకగ్రీవంగా తీర్మానించేయడమే కాక, కనీసం వారానికోసారైనా రిమైండర్ పెట్టుకుని మరీ దీనిని స్మరించుకుంటుంటారు. సరే, దీని సంగతి తర్వాత చూద్దాం.

మహిళల సంగతి ఏమోగానీ, పురుషుల్ని అత్యధికంగా అణగదొక్కిన మతం మాత్రం -ఇస్లామే. ఇది 100% ఫ్యాక్టు. అదెలాగంటే..

Continue reading “పురుషుల్ని తీవ్రంగా అణగదొక్కిన మతం!!!”