In search of PURPOSE#1
నాస్తికుడిగా మార్చిన ప్రశ్న!! – మహాత్మా గాంధీ,మదర్ తెరీస్సాలు స్వర్గానికి వెళ్తారా, వెళ్ళరా?
=================================
దాదాపు ఇరవై ఏళ్ళు వచ్చేవరకూ, నాకు ఇస్లాం గురించి తెలిసినదానికంటే రామాయణం,మహాభారతం వంటి వాటి గురించే ఎక్కువగా తెలుసు. ఇంటర్నెట్ అందుబాటులోకి రాకముందు, ఇస్లాం గురించి తెలుసుకోవడానికి ఉన్న ఒకేఒక సోర్స్- మసీదులో ఇచ్చే ప్రసంగాలు. కానీ రామాయణం,భారతాల గురించి బోలెడన్ని సినిమాల ద్వారా, తెలుగు వాచకం పాఠాల ద్వారానూ చిన్నప్పట్నుండీ తెలుసుకుంటూనే ఉన్నాను.
మసీదుల్లో ప్రసంగాలు ఇచ్చే పెద్ద మనుషులు జనరల్గా మదరసాల్లో చదువుకుని ఉంటారు. ఈ మదరసాల్లో చాలావరకూ పేదవారు, అనాధల పిల్లలు మాత్రమే చదువుతుంటారు. బయట డిగ్రీ,పి.జీ, పీహెచ్ డీ లు ఉన్నట్లే మదరసా చదువుల్లో కూడా వివిధ దశలు ఉంటాయి. హఫీజ్,ఆలిం, ముఫ్తీ ఇలా ఉంటాయి. మసీదుల్లో ఐదు పూటలా నమాజు చదివించడానికి ఒకరిని, చాలా తక్కువ నెలజీతం తో నియమిస్తారు. వీరిని ఇమాం లంటారు. దీనికి కావలసిన కనీస అర్హత – ఖురాన్ ని మొదటినుండీ, చివరి వరకూ బట్టీ పట్టి ఉండటం.వీరిని హఫీజ్ లంటారు. వీరికి ఖురాన్ ఇంటర్ప్రెటేషన్ గురించి Expertise ఉండాలనేం లేదు. ఇస్లాం కి సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఉన్నవారిని ముఫ్తీ అంటారు. ఇది మదరసాల్లో పి.హెచ్.డీ లాంటిది. ఇప్పుడు ఒక పీ.హెచ్.డీ చేసిన వ్యక్తి, ఓ మారు మూల గ్రామంలోని పిల్లలకి A,B,C,Dలు నేర్పే పని చేయడానికి ఒప్పుకోరు కదా, అలాగే ఓ మారుమూల పల్లెల్లోని చిన్న సైజు మసీదుకి ముఫ్తీ లాంటి వారు రారు. ఇమాం లు నమాజు చదివించడంతో పాటు, మసీదుకు రాని ముస్లింలను అప్పుడప్పుడు పోగేసి, వారిని నమాజ్ చదివేలా ఇన్స్పైర్ చేయడానికి ఖురాన్,ప్రవక్త గొప్పదనం గురించి స్పీచ్ లు(ఇజ్తెమా) కూడా ఇస్తుంటారు. Continue reading “నాస్తికుడిగా మార్చిన ప్రశ్న!! – మహాత్మా గాంధీ,మదర్ తెరీస్సాలు స్వర్గానికి వెళ్తారా, వెళ్ళరా?”