Sidney Sheldon

Sidney Sheldon – ప్రపంచ ప్రఖ్యాత రచయిత. అతను చాలాకాలం డిప్రెషన్ తో, నిరాశతో బాధపడ్డాడు. 17 సం. వయసప్పుడు, ఈ జీవితం నాకొద్దనుకుని, సూసైడ్ చేసుకుందామని డిసైడ్ ఐపోయాడు. ఒకానొక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో విస్కీలో స్లీపింగ్ ట్యాబ్లెట్లు కలుపుకుని తాగుదామనుకున్నంతలో వాళ్ళ నాన్న ఇంట్లో కి వచ్చాడు. అతనికి విషయం అర్థమైంది. కాసేపు అలా నడిచొద్దాం రమ్మని సిడ్నీ షెల్డన్ ని తీసుకుని బయటికి వెళ్ళాడు. అక్కడ ఓ మాట చెప్పాడు. – “జీవితం అనేది పుస్తకం చదవడం లాంటిది. ఒక్కో పేజీలో ఒక్కోరకంగా ఉంటుంది. ఓ పేజీలో బాధ, ట్రాజెడీ,కష్టం, నష్టం లాంటివి ఉండొచ్చు మరో పేజీలో ఆనందం, ఆహ్లాదం, ఉత్సాహం లాంటివి ఉంటాయి. ఇప్పుడు చదువుతున్న పేజీ బాగాలేదని, పుస్తకం చదవడం ఆపేసి పక్కనపడేయకూడదు. అలా చేస్తే, రాబోయే పేజీల్లోని అనేక మంచి విషయాల్ని మిస్ అవుతాం. కాబట్టి, చదువుకుంటూ వెల్లడమే మనం చేయవలసింది. దానిని మాత్రం ఎప్పటికీ ఆపకూడదు. జీవితం అనే పుస్తకం నీచేతిలో ఉంది. చదవుతూ వెల్లడమా, లేక పుస్తకాన్ని పక్కనపడేయడమా అనేది నీ ఇష్టం”

ఈ చిన్న సంభాషణ జరగకపోయి ఉంటే, Sidney Sheldon అనే ప్రఖ్యాత రచయిత, అతను రాసిన అనేక పుస్తకాలు, వాటి ఆధారంగా తీసిన అనేక విజయవంతమైన హాలీవుడ్ సినిమాలూ ఉండేవి కావు.

Leave a Reply

Your email address will not be published.