యాండ్ర్యు టటె(Andrew Tate) – అమెరికన్ కిక్ బాక్సింగ్ క్రీడాకారుడు. కిక్ బాక్సింగ్ లో మూడు సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచాడు. ఇతని నెట్ వర్త్: 100 మిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో దాదాపు 750కోట్లు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, ఇస్లాం గురించి,ముస్లిం దేశాల గురించి ఇతను చెప్పిన విషయాలు మీడియాలో వైరల్ అయ్యాయి. Link –
Continue reading “ప్రవక్త గురించి ఆయేషా గారు చెప్పిన విషయం#1”ప్రవక్త గురించి ఆయేషా గారు చెప్పిన విషయం#1
ప్రవక్తకు అవమానం – వివిధ స్పందనలు
మా పాత టీమ్‌లో ఒకడుండేవాడు. అతన్ని ఒక్కమాటలో “టెక్నికల్ తోపు” అనొచ్చు. మిగతా వాళ్ళు సాల్వ్ చేయలేమని చేతులెత్తేసిన కాంప్లికేటెడ్ ఇష్యూస్ ని కూడా, అతను ఓ గంట లో సాల్వ్ చేయగలడు, అంత మేధావి. ‘360 డిగ్రీ అనాలిసిస్’ అనే పదానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అతను.
Continue reading “ప్రవక్తకు అవమానం – వివిధ స్పందనలు”అద్భుతమైన సంభాషణ
ప్రముఖ కెనడియన్ మేధావి – జోర్డాన్ పీటర్సన్, మరియు ముస్లిం ప్రొఫెసర్ – హమ్‌జా యూసుఫ్ మధ్య జరిగిన 1.5 గంటల చర్చ, ఒక్క ముక్కలో చెప్పాలంటే – మెదడుకు జంబో బిర్యానీ(మేత టైపులో) లాంటిది.
దాన్లో హమ్‌జా యూసుఫ్ ప్రస్తావించిన వ్యక్తులు/అంశాలు :-
Continue reading “అద్భుతమైన సంభాషణ”“ఫిత్రాహ్” ని వివరించిన Oxford పరిశోధన
1.9 మిలియన్ బ్రిటీష్ పౌండ్లు,
57 మంది రీసెర్చర్స్,
20 దేశాల్లో,
40 ప్రత్యేక పరిశోధనలు..
వీటన్నిటి వల్లా.. చివరికి తేలిందేమంటే – మనిషి పుట్టుకతోనే సృష్టికర్తపైన, మరణానంతర జీవితంపైన నమ్మకంతో పుడతాడని.
హలీమా ఏడెన్: శరణార్థి శిబిరం నుండి – సెలెబ్రిటీ దాకా
1997 కెన్యా-సోమాలియాలలో అధికారంకోసం, వివిధ తెగలకు చెందిన సాయుధ దళాల మధ్య అంతర్యుద్ధం జరిగింది. దీనిలో వేలాది మంది చనిపోయారు, లక్షలాది మంది తమ సొంత ఇండ్లనూ,ఊర్లనూ వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళారు.
అలాంటి హింసాత్మక పరిస్థితుల్లో, ఓ మహిళ తన పసిబిడ్డను సంకలో మోస్తూ, మిగతా ఇద్దరు కూతుర్లతో కలిసి 12రోజులపాటు నడుస్తూ, కెన్యా-సోమాలియా బార్డర్ లోని, ఐక్యరాజ్యసమితి వారు నిర్వహిస్తున్న కకుమా శరణార్థి శిబిరానికి చేరుకుంది.
Continue reading “హలీమా ఏడెన్: శరణార్థి శిబిరం నుండి – సెలెబ్రిటీ దాకా”ఇస్లామిక్ సెన్స్- కామన్ సెన్స్
ఇటీవల ఉర్లోని ఓ ఫ్రెండ్ కి కాల్ చేశాను. మాటల మధ్యలో,దేశ రాజకీయాల గురించి చర్చ వచ్చింది. “తెలుగు రాష్ట్రాలు ఇప్పటికిప్పుడు ప్రశాంతంగానే ఉన్నాయిగానీ, చెడ్డీగాల్లు బ్యాక్గ్రౌండ్ లో ఏమేం స్కెచ్చు లేస్తున్నారో తెలీదు, వారికొచ్చే ఫండ్స్, వారి ప్రాబల్యం క్రమంగా పెరిగిపోతున్నట్లు మాత్రం క్లియర్ గానే కనిపిస్తుంది” – అన్నాడు. మరో కామెంట్ కూడా చేశాడు. అది – “మనోళ్ళు కూడా ఏమీ తగ్గట్లేదు. పొద్దున 4 గంటలనుండీ మొదలు పెడ్తారు, ప్రతి ఐదు-పది నిమిషాలకీ, “రోజ్ దారో ఉఠో.. సహర్ కరో.. వక్థ్ హోజారా…” – అంటూ, లౌడ్ స్పీకర్ లో అరుస్తున్నారు. చుట్టూ ముస్లిమేతరులు చాలా మంది ఉన్నారు.అసలే వేసవి కాలం, పైన డాబాలమీద పడుకుంటుంటారు, వారికి డిస్టర్బెన్స్ ఎందుకు అనే ఆలోచనలేమీ లేవు. వీళ్ళు చేసే ఇలాంటి పనులే, చెడ్డీ గాల్లు వారి మీటింగ్ లలో హైలెట్ చేస్తుంటారు.. ఈ విషయం మనోళ్ళకు ఎప్పటికి అర్థం కావాలో ఏమో” -అన్నాడు.
Continue reading “ఇస్లామిక్ సెన్స్- కామన్ సెన్స్”సమాజంపై “కాశ్మీర్ ఫైల్స్” సినిమా ప్రభావం
రాధేశ్యామ్ సినిమా తో పాటుగా రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ కాశ్మీరీ ఫైల్స్ చాలాపెద్ద విజయం సాధించింది.ఇది నిశ్శబ్ద విప్లవం …అని మన హిందూత్వ మూకలు చెప్పుకోవచ్చు.ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది అని మీడియా ప్రచారం చేస్తోంది.చాలా ట్యూబులు ఇదే చెప్తున్నాయ్.స్వామీజీలు … హిందూ సంస్థలూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు తప్ప …
Continue reading “సమాజంపై “కాశ్మీర్ ఫైల్స్” సినిమా ప్రభావం”శోకాలు పెట్టొద్దు!!!
“కనపడినోళ్ళందరికీ నీ బాధలు చెప్పుకుని శోకాలు పెట్టకు. సగం మంది పట్టించుకోరు. మిగతా సగం లోలోపల ఆనందిస్తారు. నీ బాధలపట్ల కన్సర్న్ ఉన్న ఒకరిద్దరికి నీవు అదేపనిగా చెప్పాల్సిన అవసరం లేకుండానే తెలుసుకుంటారు.” -ఇది వ్యక్తిగత స్థాయిలోనే కాక, ఓ సమూహంగా ముస్లిం సమాజం మొత్తానికి వర్తిస్తుంది.
Continue reading “శోకాలు పెట్టొద్దు!!!”యూపీ ఎన్నికలు – MIM ప్రభావం
BJP- 42%
SP- 32%
BSP- 13%
INC- 2.4%
MIM – 0.46% (2% for 100 seats, which AIMIM contested)
ఇదీ లెక్క. దీని ఆధారంగా కొన్ని కన్‌క్లూజన్లు డెరైవ్ చేయొచ్చు.
నియోజకవర్గాల వారీగా డాటా తీసి, ఇక్కడ ఫలానా పార్టీ పోటీ చేయకపోయి ఉంటే, ఆ వోట్లు ఫలానా పార్టీకి పడి ఉంటే, ఈ పార్టీ కాకుండా- ఆ పార్టీ గెలిచి ఉండేది – అని మరో టైపు కన్‌క్లూజన్ లు కూడ డెరైవ్ చేయొచ్చు. అలా MIM పోటీ చేసిన కారణంగానే SP ఓడిపోయిందని చెప్పగల స్థానాలేవైనా ఉంటే, ఆ డీటైల్స్ కామెంట్స్ లో రాయమని మనవి. ఆధారాలు లేకుండా, కేవలం ఊహాగానాలు చేయడం టైమ్ వేస్ట్.
Continue reading “యూపీ ఎన్నికలు – MIM ప్రభావం”