సమాచార విప్లవం – రాజకీయ సవాల్లు!!

సమాచార విప్లవం – రాజకీయ సవాల్లు!!
============================
రేడియో అంటే ప్రస్తుత తరానికి పెద్దగా ఉపయోగకరమైన వస్తువేం కాదనిపించొచ్చు గానీ, 1895లో, మార్కోనీ దానిని కనుగొన్నప్పుడు ఆ కాలానికి అదోక గొప్ప విప్లవాత్మక ఆవిష్కరణే. అప్పటివరకూ సమాచారం ఓ చోటునుండీ మరో చోటుకి వెల్లాలంటే, ఎవరో ఒకరు వ్యక్తిగతంగానైనా వెళ్ళి చెప్పాలి, లేదా ఉత్తరాలు, వార్తాపత్రికల ద్వారా తెలుసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో, ఓ వ్యక్తి మాటల్ని అప్పటికప్పుడు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలోని లక్షలాది మంది ఒకేసారి వినగలగడం సమాచార ప్రసార వ్యవస్థలో ఓ తిరుగులేని మలుపనే చెప్పవచ్చు.

Continue reading “సమాచార విప్లవం – రాజకీయ సవాల్లు!!”

టిప్పు తిప్పలు!!

టిప్పు సుల్తాన్ గురించి గతంలో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఆర్టికల్.

టిప్పు తిప్పలు!!
==========
టిప్పు సుల్తాన్ మంచోడా, చెడ్డోడా? దేశభక్తుడా, దేశద్రోహియా?
రెండవ ప్రశ్న సులువుగా అనిపిస్తుంది కాబట్టి, అక్కడ నుండి మొదలుపెడదాం . టిప్పు దేశభక్తుడా?, దేశద్రోహా? లక్కీగా, దేశభక్తిని కొలవడానికి మనదగ్గర చాలా చిట్కాలు ఉన్నాయి.అవి- ‘ఏదేమైనా సరే కాశ్మీర్ ఎప్పటికైనా భారత్ లో అంతర్భాగమే ‘ అని వాదించేవాడు దేశభక్తుడు, మరో వాదన వినిపిస్తే దేశద్రోహి. కళ్ళు మూసుకుని గట్టిగా వందేమాతరం పాడేవాడు దేశభక్తుడు, అందులో అర్థాలూ,లాజిక్కులూ వెతికేవాడు దేశద్రోహి. పాకిస్తాన్, చైనాలు మనకు శత్రు దేశాలు కాబట్టి, వాటిని బండబూతులు తిడితే కొండంత దేశభక్తి ఉన్నట్లు, లేదంటే వాడు దేశద్రోహి అన్నట్లు. ఇవన్నీ ప్రస్తుతం వాడుకలో ఉన్న దేశభక్తి కొలమానాలు.

Continue reading “టిప్పు తిప్పలు!!”

నల్ల జాతి మేలిమి వజ్రం – మాల్కమ్-X

నల్ల జాతి మేలిమి వజ్రం – మాల్కమ్-X
============================

->”తనను తాను రక్షించుకునే క్రమంలో ఓ వ్యక్తి ఆయుధం పట్టుకుంటే, దానిని ‘హింస ‘ అనకూడదు. ‘బుద్దిని ఉపయోగించడం’ అనాలి”.
->”స్వేచ్చ ఒకరిస్తే వచ్చేది కాదు. నీకు సమానత్వం, న్యాయం ఎవ్వరూ ఇవ్వరు. మనిషివైతే, వాటిని నువ్వే సాధించుకోవాలి.”-
->”నీ వీపులో 9 అంగులాల లోతుకి కత్తి దింపి, ఓ 3 అంగులాలు వెనక్కి లాగితే – అది నీకు ఉపకారం చేసినట్లు కాదు, మొత్తం బయటికి లాగినా అది ఉపకారం కాదు. ఆ గాయం మానేలా దానికి వైద్యం చేస్తే అదీ – ఉపకారం. కానీ, నల్ల జాతివారి వీపులో దింపిన కత్తిని వెనక్కి లాగే పనే, అమెరికాలో ఇప్పటికీ మొదలవలేదు”

ఇలాంటి కొన్ని వందల కొటేషన్లు, స్టేట్మెంట్లు మాల్కమ్ నోటినుండి తూటాల్లా వెలువడ్డాయి.

20వ. శతాబ్ధంలో అమెరికాలోని నల్లజాతివారిని ప్రభావితం చేసిన వ్యక్తుల లిస్టు రాస్తే, దానిలోని అగ్రగణ్యుల్లో ఒకటిగా నిలిచే పేరు – మాల్కమ్-X.

Continue reading “నల్ల జాతి మేలిమి వజ్రం – మాల్కమ్-X”

ముస్లింలు-దళితబహుజనుల ఐక్యత

“ముస్లింలు-దళితబహుజనుల ఐక్యత” – ఇది కొందరు ముస్లింలు తరచుగా వాడుతుంటారు. వీరిని సూటిగా ఓ ప్రశ్న అడుగుతా, జవాబు చెప్పండి.

ఇస్లాం ప్రమాదకరమైంది, ముస్లింలు ఇలాంటివారు, అలాంటి వారు అనే విషప్రచారం, ఇస్లామోఫోబిక్ ప్రాపగాండా యుద్ధప్రాతిపదికన జరుగుతున్నప్పుడు, దళితులు,బహుజనులు,బి.సీలు కూడా దీనితో ప్రభావం కాకుండా ఉంటారని ఎలా అనుకుంటారు? ఎలా వచ్చి మీతో చేతులు కలుపుతారని ఆశిస్తారు. అఫ్కోర్స్ స్టేజిమీద ఉపన్యాసం ఇచ్చి,నాలుగు మంచి మాటలు చెప్పిపోవడానికి కొందరు దళిత,బహుజన మేధావులు దొరుకుతారనుకోండి. కానీ, గ్రౌండ్ లెవల్లో దళితులు,ముస్లింలతో కలిసి పనిచేస్తారని ఎలా ఆశిస్తారు?

ఇస్లామోఫోబియాను, యాంటీ-ముస్లిం ప్రాపగాండాను కూడా ముస్లింలు ఎఫెక్టివ్ గా తిప్పికొట్టాలి. ఇస్లాం అంటే ఏమిటో,దానిలోని వివిధ సూరాల అర్థమేమిటో, అది ముస్లిమేతరులకు ఎలా ప్రమాదకరం కాదో, అది ఎలాంటి విలువలకు కట్టుబడి ఉందో, సమాజంపై గత 1400 సం,గా దాని ప్రభావం ఏమిటో ఇవన్నీ అర్థం చేసుకుని, ఆచరణలో చేసి చూపాలి, ఇతరులకు అర్థమయ్యేలా చెప్పగలగాలి. అప్పుడే, ముస్లింలతో, దళితులైనా, వేరే ఎవరైనా కలుస్తారు. ఇవేమీ చేయకుండా కేవలం ఐక్యతారాగాలు ఆలపిస్తూ కూర్చుంటే ఏమీ జరగదు.
ఇస్లాం గురించి రాస్తే, నాస్తికులకు నచ్చదేమో, హిందూ అల్లరిమూక గురించి రాస్తే హిందువులకు నచ్చదేమో .. లాంటి ఎదవ మొహమాటాలు, కల్లబొల్లి కబుర్లు చెప్పే ముస్లింలందరూ ఇంట్లోకి వెల్లి తడిగుడ్డ వేస్కొని తొంగొండి. మీతోనే ముస్లింలకు మరింత ప్రమాదం.

చదువుకున్న ముస్లింల డైలమా!!

చదువుకున్న ముస్లింల డైలమా!!
========================
“రేయ్.. మసీద్ వాళ్ళు వచ్చారు, త్వరగా నిద్ర లేచి వెళ్ళు”!!
ఆదివారం పొద్దున, మాంచి నిద్దర్లో ఉండగా, ఈ మాటలు చెవిన పడ్డాయంటే, ఇక ఆరోజుకి మనం దొరికిపోయామని అర్థం. మా వూరి మసీదులో ప్రతి ఆదివారం ఉదయం ‘స్టూడెంట్స్ ఇజ్తిమా’ ఉంటుంది. మసీదు పక్కకి రాకుండా, బలాదూర్ గా తిరిగే ముస్లిం కుర్రాలందర్నీ ఇళ్ళిళ్ళూ తిరిగి పోగేసి, ఓ రెండు, మూడు గంటల పాటు ఇస్లాం గురించి, ప్రవక్త గురించీ బోధించే కార్యక్రమం అది. ఈ విషయం గుర్తున్న కుర్రోళ్ళు, మసీదువారు రాకముందే నిద్రలేచి పొలం గెట్లమీదికో, కాలేజీ గ్రౌండ్లోకో పారిపోయేవారు. గుర్తులేనోల్లు మాత్రం ఆరోజుకి వారికి సరెండర్ అయిపోవడమే తప్ప వేరే ఆప్షన్ లేదు. అలా వారికి నేను కూడా చాలా సార్లు పట్టుబడటం జరిగింది.

Continue reading “చదువుకున్న ముస్లింల డైలమా!!”

పులి – జింక!!!

పులి – జింక
కొన్నేళ్ళక్రితం మాట. ఓ రోజు బాగా బోర్ కొడుతుంటే, కాసేపు బయట తిరిగొద్దామని బయలుదేరాను.కోఠీలో ఫుట్పాత్ పై నడుస్తుండగా ఆ పక్కనే ఉన్న పుస్తకాల దుకాణంలోని ఓ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆ పోస్టర్ పై భాగంలో ఈ వాక్యం రాసి ఉంది – ” అడవిలో ప్రతి ఉదయం ఓ జింక నిద్రలేస్తూనే తన పరుగు మొదలుపెడుతుంది. అది పులి కన్నా వేగంగా పరిగెత్తాలి. లేకుంటే పులికి ఆహారమవుతుంది”.

Continue reading “పులి – జింక!!!”

సాతాను సామ్రాజ్యం!!

సాతాను సామ్రాజ్యం!!
===================

జాన్ యఫ్. కెన్నడీ అని ఒకప్పటి అమెరికన్ ప్రెసిడెంట్. 1963 లో, అతన్ని రోడ్డుపైనే కాల్చి చంపారు.అనేక విచారణా సంఘాలూ, కమీటీలూ వేశాక కెన్నడీ ని కాల్చింది ఇతనే అని ఓ క్యారెక్టర్ -Xని ప్రవేశ పెట్టారు. పైగా ఆ X ఒంటరిగానే ఇదంతా చేశాడనీ, అతని వెనుక ఇంకెవరూ లేరనీ కూడా తీర్మానించేశారు. అసలు ‘ఇంతకూ ఎందుకు చంపావయ్యా’ అని న్యాయస్థానం అతన్ని రేపో, మాపో ప్రశ్నిస్తుందనగా , ఆ Xని మరో Y అనే అతను చంపేశాడు. ‘ఆ Xని ఎందుకు చంపావ్ రా బై’ , అని అడుగుదామనుకుంటున్నంతలో, ఆ Y జైల్లోనే క్యాన్సర్ రోగంతో ‘హటాత్తుగా ‘ చనిపోయాడు. ఆ రకంగా కెన్నడీ ని ఎవరు ఎందుకు చంపారనే విషయం ఇప్పటికీ తేలలేదు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 దేశాల్లో సైనిక స్థావరాలు, భూమి మీద ఏక్కడ ఏ క్షిపణి లేచినా, దానిని ఠపీమని పసిగట్టే గూఢాచార వ్యవస్థ.. కానీ, తన సొంత దేశాధ్యక్షున్ని పట్టపగలు కాల్చి చంపితే,
ఆ చంపింది ఎవరో,ఎందుకు కాల్చాడో తెలుసుకోలేక పోయారు. అది మనం నమ్మాలి. Continue reading “సాతాను సామ్రాజ్యం!!”

Sidney Sheldon

Sidney Sheldon – ప్రపంచ ప్రఖ్యాత రచయిత. అతను చాలాకాలం డిప్రెషన్ తో, నిరాశతో బాధపడ్డాడు. 17 సం. వయసప్పుడు, ఈ జీవితం నాకొద్దనుకుని, సూసైడ్ చేసుకుందామని డిసైడ్ ఐపోయాడు. ఒకానొక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో విస్కీలో స్లీపింగ్ ట్యాబ్లెట్లు కలుపుకుని తాగుదామనుకున్నంతలో వాళ్ళ నాన్న ఇంట్లో కి వచ్చాడు. అతనికి విషయం అర్థమైంది. కాసేపు అలా నడిచొద్దాం రమ్మని సిడ్నీ షెల్డన్ ని తీసుకుని బయటికి వెళ్ళాడు. అక్కడ ఓ మాట చెప్పాడు. – “జీవితం అనేది పుస్తకం చదవడం లాంటిది. ఒక్కో పేజీలో ఒక్కోరకంగా ఉంటుంది. ఓ పేజీలో బాధ, ట్రాజెడీ,కష్టం, నష్టం లాంటివి ఉండొచ్చు మరో పేజీలో ఆనందం, ఆహ్లాదం, ఉత్సాహం లాంటివి ఉంటాయి. ఇప్పుడు చదువుతున్న పేజీ బాగాలేదని, పుస్తకం చదవడం ఆపేసి పక్కనపడేయకూడదు. అలా చేస్తే, రాబోయే పేజీల్లోని అనేక మంచి విషయాల్ని మిస్ అవుతాం. కాబట్టి, చదువుకుంటూ వెల్లడమే మనం చేయవలసింది. దానిని మాత్రం ఎప్పటికీ ఆపకూడదు. జీవితం అనే పుస్తకం నీచేతిలో ఉంది. చదవుతూ వెల్లడమా, లేక పుస్తకాన్ని పక్కనపడేయడమా అనేది నీ ఇష్టం”

ఈ చిన్న సంభాషణ జరగకపోయి ఉంటే, Sidney Sheldon అనే ప్రఖ్యాత రచయిత, అతను రాసిన అనేక పుస్తకాలు, వాటి ఆధారంగా తీసిన అనేక విజయవంతమైన హాలీవుడ్ సినిమాలూ ఉండేవి కావు.

ఆర్జీవీ Vs సగటు జీవి

ఆర్జీవీ Vs సగటు జీవి
================
“I inherit nothing. I stand at the end of no tradition. I may, perhaps, stand at the beginning of one” -ఇది అయాన్ ర్యాండ్ రాసిన ఫౌటెన్ హెడ్ పుస్తకంలోని ఓ వాక్యం. తాను అయాన్ ర్యాండ్ రచనల్తో ప్రభావితమయ్యానని ఆర్జీవీ అనేక సార్లు చెప్పి ఉన్నాడు. ఈ ప్రభావితం అనేది ఆర్జీవీ ప్రతి మాటలోనూ, అతని లైఫ్ స్టైల్ లోనూ మనకు కనిపిస్తుంటుంది.

మానవత్వం, మంచి,చెడు – ఇవి సగటు జనం అత్యంత విరివిగా వాడే పదాలు. ఈ పదాల అర్థాన్ని తెలుసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి.

Continue reading “ఆర్జీవీ Vs సగటు జీవి”

సత్యాన్వేషి షాహిద్.

సత్యాన్వేషి షాహిద్.

=============

ఓ మనిషి జీవిత సాఫల్యాన్ని కొలవడానికి ప్రామానికం ఏమిటి? అతనుకూడబెట్టిన డబ్బా? అనుభవించిన హోదా,అధికారమా? అతనుపొందిన బిరుదులూ,సన్మానాలా? లేక, జీవించిన మొత్తం సంవత్సరాలా? కొంత మంది వీటిలో ఏదో ఒకటి తమ జీవిత లక్ష్యంగా బతికేస్తుంటారు. మతగ్రంధాలు, ప్రవక్తల ప్రవచనాల ఆధారంగాచూస్తే, సత్యాన్నికనుగొని దానిని నిష్టగా ఆచరించడంలోనే నిజమైనజీవిత సాఫల్యం ఉందనే విషయంబోధపడుతుంది. కానీ,అసలు సత్యం అంటే ఏమిటి? చాలా మంది, తమ తల్లిదండ్రులు, చుట్టుపక్కల వాళ్ళు నమ్మేదీ, ఆచరించేదే సత్యమని ఫిక్సైపోతారు. కానీ,కొందరితో మాత్రం సత్యం దోబూచులాడుతుంది. తనేమిటో కనుగొనమని రెచ్చగొడుతుంది. కొందరిని వెంబడిస్తుంది. చివరికి కొందరికి పట్టుబడుతుంది. అలాంటి ఓవ్యక్తే షాహిద్ ఆజ్మీ.

Continue reading “సత్యాన్వేషి షాహిద్.”