“ఎంత సాధించావన్నది కాదు, ఎంత కోల్పోయావన్నదే ముఖ్యం”

మహమ్మద్ అలీ – ఈ పేరు వినగానే -“ప్రపంచం చూసిన అతి గొప్ప బాక్సర్” – అనే విషయం మీకు గుర్తొస్తే, మీకు అతని గురించి పూర్తిగా తెలీదని అర్థం. అతని గొప్పతనాన్ని – రింగ్ లో సాధించిన పతకాల ద్వారా కొలవలేం.

Continue reading ““ఎంత సాధించావన్నది కాదు, ఎంత కోల్పోయావన్నదే ముఖ్యం””

గాంధీ – అంబేద్కర్ – కాంగ్రెస్


ఇది అందరూ వినే ఉంటారు.. .. గాంధీ స్కూల్లో చదువుకునే రోజుల్లో, ఎగ్జాం రాస్తున్నప్పుడు.. డీఈవో ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు – స్కూల్ టీచర్ గాంధీని పక్కోడి పేపర్లో కాపీ కొట్టమని చెప్తే – గాంధీ కాపీ కొట్టకుండా, నాకు రాదని చెబితే – డీఈవో మెచ్చుకున్నాడనీ.. అంచేత, పిల్లలెవరూ పక్కోల్ల పేపర్లలో కాపీ కొట్టకూడదనీ… అలా మొదటిసారి గాంధీ గురించి విన్నట్లు గుర్తు.

ఆ తర్వాత , మా ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగే ప్రతీ ఆగస్టు 15, జనవరి 26 స్కూల్ ఫంక్షన్లలో, ఓ పక్క ఫక్షన్ తర్వాత పంచబోయే చాక్లెట్లను తలచుకుంటూనే, మరో పక్క ముసలి టీచర్లందరూ తన్మయత్వంతో గాంధీ,నెహ్రూ వంటీవారి స్వాతంత్ర్య పోరాటం గురించి చెప్తుంటే – ఆసక్తిగా వినడం – ప్రతీ సంవత్సరం జరిగిన రొటీన్ తంతు. ఆ రకంగా – గాంధీ,నెహ్రూ,సర్దార్ వల్లభాయ్ పటేల్,,భగత్ సింగ్, సరోజినీనాయుడు,మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్,టంగుటూరి ప్రకాశం పంతులు,చంద్రశేకర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు.. వీల్లల్లో ఎవరేం చేశారో ఎగ్జాక్ట్ గా తెలీకున్నా.. వీరందరూ మన తరుపున బ్రిటీషోల్లతో పోరాడి స్వాతంత్ర్యం సాధించారనీ, వీల్లందర్లోకి గాంధీ హీరోచితంగా పోరాడారు కాబట్టి ఆయన జాతిపిత అయ్యారనీ – నా పాఠశాల చదువు నాకు నేర్పించింది.

Continue reading “గాంధీ – అంబేద్కర్ – కాంగ్రెస్”

ముస్లింల బాధ – అనాధల బాధ!!

“కృష్ణశాస్త్రి బాధ – ప్రపంచం బాధ,
ప్రపంచంపు బాధ – శ్రీశ్రీ బాధ”

ఇది అప్పుడెప్పుడో చలం చెప్పిన మాట.
ప్రస్తుత కాలానికి మార్చి రాస్తే,

“ముస్లింల చేతిలో ఎవరైనా బాధలు అనుభవిస్తే – అది ప్రపంచపు బాధ,
ముస్లింలు ఎవరిచేతిలోనైనా బాధలకు గురైతే – అది అనాధల బాధ” – అని చెప్పాల్సి ఉంటుంది.

సద్దాం హుస్సేన్ – తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి, ఇరాక్ లోని కొన్ని తెగలపై అణచివేత చర్యలు చేపట్టాడు. నియంతలెవరైనా చేసేది అదే కదా. కానీ, ఆ బాధిత తెగల బాధ ప్రపంచం బాధైంది. సద్ధాం హుస్సేన్ చేసిన అకృత్యాలను పదింతలు చేసి, ప్రపంచ మీడియా పదే,పదే ప్రసారం చేసింది. అతని దగ్గర జనహనన ఆయుధాలున్నాయని నాటో దలాలు ఇరాక్ పై దండయాత్ర చేసి సద్దాం ను మట్టుపెట్టాయి. అంతా ఐపోయాక, అశ్వద్దామతహ కుంజరహా అన్నట్లు – ‘జనహనన ఆయుధాలు ‘ ప్రపంచజనాలను వెర్రోల్లను చేయడానికి వాడిన పాచిక మాత్రమే అని అగ్రరాజ్యాలు పళ్ళికిలిస్తూ చెప్పాయి.
ఇరాక్ పై వివిధ రకాల ఆంక్షలు విధించి – అక్కడ మందులు దొరక్కుండా చేసి, 5 లక్షల మంది చిన్నారులు చనిపోయిన విషయం మాత్రం, ప్రపంచం బాధ అవ్వదు.

Continue reading “ముస్లింల బాధ – అనాధల బాధ!!”

ఫెయిల్యూర్ స్టోరీ – జయప్రకాశ్ నారాయణ!!!

ప్రముఖ వ్యక్తుల సక్సెస్ స్టోరీ లకు కొదువలేదు.మీడియా వాటిని పదే,పదే గుర్తు చేస్తుంటుంది.యూటూబ్ లో, వందల కొద్దీ చిన్నా,చితకాఛానెల్లు, చివరికి  టివీల్లో కామెడీ వేషాలు వేసేవారిని కూడా ఇంటర్వ్యూలు చేసి,  వారిసోకాల్డ్  విజయగాధల్ని  జనాలకు తెలియజేస్తున్నాయి.  ఒకరి విజయ గాధలుమరొకరికి స్పూర్తిని కలిగిస్తాయి, కాబట్టి అలాంటి  ఇంటర్వ్యూలకు  వ్యూవర్షిప్ ఎక్కువగానే ఉంటుంది. కానీ,  తరచి చూస్తే,విజయం కంటే – పరాజయంలోనే,  నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది.  అలాంటి పరాజయగాధే ఇది.

Continue reading “ఫెయిల్యూర్ స్టోరీ – జయప్రకాశ్ నారాయణ!!!”

మంచి ముస్లిం పార్టీ – ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)

ముస్లింల హక్కుల్ని కాపాడాలనే లక్షంతో, 1906 లో ఓ పార్టీ స్థాపించబడింది. దానిపేరు ఆల్ ఇండియా ముస్లిం లీగ్. 1947 దేశ విభజన తర్వాత- పాకిస్తాన్లో, పాకిస్తాన్ ముస్లిం లీగ్ గానూ, ఇండియాలో – ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ గానూ ఈ పార్టీ విడిపోయింది. బంగ్లాదేశ్ విడిపోయాక, అక్కడి శాఖ అవామీ లీగ్ గా మారిపోయింది.

1948లో మద్రాస్ లో, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏర్పాటు నుండీ మొదలుకుని,ఇప్పటివరకూ ప్రతిసారీ, పార్లమెంటులో కనీసం ఒక్కరైనా ఆపార్టీ ఎం.పీ ఉంటున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ పార్టీ ప్రాబల్యం ఉంది. కేరళలో 1978లో, ఈ పార్టీ తరపున మహమ్మద్ కోయా అనే ఆయన ముఖ్యమంత్రిగా కూడా కొన్నాల్లు పనిచేశారు. 2004-2014 మధ్య ఈ పార్టీ యూపీయే లో భాగస్వామ్యులుగా ఉండి, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా నిర్వహించారు.
కుటుంబ పార్టీ కాదు:

Continue reading “మంచి ముస్లిం పార్టీ – ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)”

రేపటిని సూచిస్తున్న, నేటి వార్తలు!!

గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు,భారతదేశ భవిష్యత్తు ఎలాఉండబోతుందో సూచిస్తున్నాయి.

1. జైశ్రీరాం,హల్లేలూయా,అల్లాహుక్బర్ -ఇవి భక్తులు తమ,తమ దేవుల్లనుభక్తితో,పారవశ్యంతో  స్తుతించడానికివాడే నినాదాలు. కానీ, ఇటీవల కొందరికిముస్లింలను చూసినప్పుడల్లా  పూనకంవచ్చి ‘జై శ్రీరాం’  అని నినాదాలుచేస్తున్నారు. ఇది ఎక్కడో మారు మూలప్రదేశంలోనో, చాటు-మాటుగానో జరిగిందికాదు. సాక్షాత్తూ భారతదేశపార్లమెంటులో జరిగింది.
Continue reading “రేపటిని సూచిస్తున్న, నేటి వార్తలు!!”

వెల్డన్ బీజేపీ – గుడ్ లక్ సాధ్విప్రఞాసింగ్!!

వెల్డన్ బీజేపీ – గుడ్ లక్ సాధ్విప్రఞాసింగ్!!

==========================

  ఎన్నికల్లో గెలవాలనినేను  కోరుకున్నఅబ్యర్థులు ఇప్పటివరకూ ఇద్దరు– కణయకుమార్ప్రకాష్ రాజ్ఇప్పుడు మరోమూడో అబ్యర్థి కూడా గెలవాలనికోరుకుంటున్నాను – ఆమె – సాధ్వీ ప్రఞాసింగ్ఈమె బీజేపీ తరుపున భోపాల్నుండీ పోటీ చేస్తుందిమొదటి ఇద్దరూగెలిచే అవకాశాలు చాలా తక్కువకానీ మూడో అభ్యర్థి గెలిచే అవకాశంమాత్రం చాలా చాలా ఎక్కువ.

Continue reading “వెల్డన్ బీజేపీ – గుడ్ లక్ సాధ్విప్రఞాసింగ్!!”

గల్లీ ముస్లిం లీడర్లకు ఓ వినమ్రతాపూర్వక విన్నపం!!

గల్లీ ముస్లిం లీడర్లకు ఓ వినమ్రతాపూర్వక విన్నపం!!
============================

ఓటు అడగడానికి మీదగ్గరకొచ్చే ప్రతి లీడర్కీ తలపై టోపీ , భుజానికి ఎర్రటి చమ్కీల గుడ్డ పేలిక(అది ఎందుకు కడ్తారో నాకైతే తెలీదు) కట్టి, దానితో భీబత్సమైన మతసేవ+ దేశసేవ చేసినట్లు మీరు ఫీలైపోతున్నారు. ఆ వచ్చిన లీడర్ కూడా, కాసేపు అవి రెండూ ఒంటిపై ఉంచుకుని, ముస్లింల కోసం పెద్ద త్యాగం చేసినట్లు ఫీలైపోతున్నారు.

Continue reading “గల్లీ ముస్లిం లీడర్లకు ఓ వినమ్రతాపూర్వక విన్నపం!!”

కాంగ్రెస్ – సేఫ్టీ వాల్వ్ !!!

“బ్రిటీష్ వారికి కాంగ్రెస్ సేఫ్టీ వాల్వ్ లాగా ఉపయోగపడెను” – అను వాక్యాన్ని విశ్లేషింపుము.

ఈ ప్రశ్న సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 హిస్టరీ పేపర్లలో గానీ, ఇంటర్వ్యూలలో గానీ అడుగుతుంటారు.

కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో, దీనికి సమాధానం ఎలా రాయమని చెప్తారంటే –

“కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఎ.ఒ.హ్యూమ్ అనే బ్రిటీష్ వ్యక్తి ఐనప్పటికిన్నీ,
బ్రిటీష్ వారు ఎంత ఎదవలూ,క్రూరులూ ఐనా సరే, వారికి మాత్రం మనం ఎలాంటి హానీ తలపెట్టరాదని చెప్పినప్పటికిన్నీ,
1922లో, చౌరా-చోరీ హింసను సాకుగా చూపి, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సహాయనిరాకరణొద్యమాన్ని అర్థాంతరంగా ఆపేసినప్పటికిన్నీ,
కొట్టి-కొట్టి వాడే అలసిపోతాడు తప్ప, నువ్వు మాత్రం వాన్నేమీ అనబాక అనే అర్థంలేని అహింసా ఉద్యమాన్ని నడిపినప్పటికిన్నీ,

కాంగ్రెస్ బ్రిటీష్ వారికి సేఫ్టీ వాల్వ్ లాగా ఉపయోగపడింది అని చెప్పడం మాత్రం నిరాధారమైనది. కాంగ్రెసోల్లు మనకు స్వాతంత్రయ్మ్ తెచ్చిన వీరులు” – అని సమాధానం రాయాలంట.

ఎప్పుడు చూడు, అవే అరిగిపోయిన ప్రశ్నలు, అవే అరిగిపోయిన సమాధానాలు. అప్డేట్ అవ్వరా..?

సరే , ఇప్పుడు అప్డేటెడ్ ప్రశ్న అడుగుతా, చదూకోండి.

స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ చెడ్డీ బ్యాచ్ కి సేఫ్టీ వాల్వ్ లా ఉపయోగపడెను- అను వాక్యాన్ని విశ్లేషింపుము.

గాంధీ హత్యకు సంబంధించిన కేసులో, చెడ్డీ సంఘంపై విధించిన నిషేధాన్ని ఎత్తేసింది కాంగ్రెస్ పార్టీయే ఐనప్పటికిన్నీ,
బాబ్రీ మసీదు తలుపులు తెరిపించింది, దానిని కూల్చే ప్రయత్నాలకు పరోక్షంగా సహకరించిందీ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఐనప్పటికిన్నీ,
ముంబై అల్లర్లలో, ముస్లింలపై శివసేన చేసిన అరాచాకాలకు సంబంధించిన జస్టిస్ శ్రీక్రిష్ణ రిపోర్టును బుట్టదాఖలు చేసింది కాగ్రెస్ ప్రభుత్వాలే అయినప్పటికిన్నీ,
జగన్ లాంటి రాజకీయ ప్రత్యర్థుల కేసుల్లో ఆగమేహాలపై విచారణలు చేపించి జైలుకు పంపి, అద్వానీ,యోగీ,మోడీ లాంటి వారు ముద్దాయిలుగా ఉన్న తీవ్రమైన కేసుల్లో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించినప్పటికిన్నీ,
ఇన్నేల్లు అధికారంలో ఉండి కూడా, ద్వితీయ శ్రేణి పౌరులుగా, దిగజారిపోతున్న ముస్లింల బతుకుల్ని బాగుచేసే ఏ ఒక్క పధకాన్నీ ప్రవేశపెట్టకపోయినప్పటికిన్నీ,
మతహింసా నిరోధక బిల్లు లాంటి వాటిని సైలెంటుగా అటకెక్కించినప్పటికిన్నీ,

కాంగ్రెస్ ని చెడ్డీ బ్యాచ్ కి సేఫ్టీ వాల్వ్ అని చెప్పరాదు. ఆల్లు ఉత్తమోత్తములు, నిఖార్సైన సెక్యులరిస్టులు “- అని చెప్పాలి

బంగ్లాదేశ్ వెళ్ళిపోండి!!

పాకిస్తాన్ లో జరుగుతున్న ఆయిల్ నిక్షేపాల ఎక్స్ ప్లోరేషన్ గురించి ఆల్రెడీ రాసి ఉన్నా.

నిన్న ఇమ్రాన్ ఖాన్ అదే చెప్పాడు.
ఈ స్పెక్యులేషన్ నిజం ఐతే, సౌదీ,దుబాయ్,కువైట్ లాంటి సంపన్న దేశాల సరసన పాకిస్తాన్ నిలబడుతుంది.
అప్పుడు భారత్-పాక్ సంబంధాలు ఎలా ఉంటాయి. భారత సమాజంలో, భారత మీడియాలో పాకిస్తాన్ డెపిక్షన్ ఎలా ఉండబోతుంది? 
Continue reading “బంగ్లాదేశ్ వెళ్ళిపోండి!!”