ఓ ముస్లిం ఎవరైనా పది కోట్లు ఖర్చుపెట్టి మసీదును కట్టించినా, అతనికి ఆ మసీదులో ఎలాంటి స్పెషల్ ప్రివిలైజెస్ ఉండవు.ఆ మసీదులో కనీసం అతని ఫోటో కూడా పెట్టరు. ముందుగా డిక్లేర్ చేసిన టైం లలో 5 పూటలా నమాజ్ లు చేయబడతాయి. ముందుగా వచ్చినోల్లే ముందు వరసలో నిలబడతారు. తరువాత వచ్చినోల్లు, తరువాతి వరసల్లో. ఆ పదికోట్లు పెట్టి మసీదు కట్టించిన వ్యక్తి కూడా ఆలస్యంగా వస్తే, చివరి వరసల్లో నిలబడాల్సిందే తప్ప, అతనికోసం స్పెషల్ ప్లేస్ లు ఉండవు. అట్లే, అప్పటిదాకా ఓ రిక్షాతొక్కి చమటతో తడిసిపోయిన వ్యక్తి కూడా, రిక్షా మసీదు బయట నిలబెట్టి, ఆ పదికోట్ల వ్యక్తి పక్కనే సరిసమానంగా నిలబడి నమాజ్ చేస్తాడు.ఇది దాదాపుగా ప్రపంచంలోని అన్ని మసీదుల్లోనూ జరిగే రొటీన్ తంతు. సోషల్/ఫిజికల్ స్టేటస్ తో సంబంధం లేకుండా – ‘మనుషులందరూ సమానమే’ అనే సిద్ధాంతం యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ మసీదుల్లో చూడొచ్చు. ఈ విషయమే పోస్టులో రాశాను. ఎగ్జాంపుల్ గా, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న జకీర్ నాయక్, ఓ సాధారణ వ్యక్తిలా మసీదులో నమాజ్ చేస్తున్న ఫోటోను యాడ్ చేశాను.ముస్లింలలో మహా,మహా రాజులు, సామ్రాజ్యాధినేతలు ఎంతమంది వచ్చినా, ఈ సిస్టం మాత్రం గత 1400 సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉంది. అందుకే దానిని ‘మిరకిల్’ అన్నాను.ఇంతే రాసింది.ఇప్పుడు దీనికి కౌంటర్ రాయాలంటే – నేను ఫలానా మసీదులో వీఐపీ లైన్స్ సపరేట్ గా ఉండటం చూశాననిగానీ, ఫలానా మసీదులో కేవలం డబ్బున్నోల్లనీ,డాక్టర్లు,ఇంజనీర్లనే రానిస్తారనిగానీ చెప్పొచ్చు.అది చేయకుండా, ఏమేమో లాజిక్కులూ, ఎవేవో లా పాయింట్లు..ఇస్లాం లో నెగెటివ్స్ అనిపించిన వాటి గురించి మీరు రాయండి. రాయాల్సిందే. నాబోటోల్లు.. మహా ఐతే, “అన్నా,దీనికి ఆధారం ఏంటన్నా” అని అడుగుతాం.అంతే తప్ప, ఇస్లాం లో ఏ మాత్రం పాజిటివ్నెస్ లేదన్నట్లూ, ఇస్లాం లోని పాజిటివ్ గురించి ఎవరు ఏ ముక్క రాసినా – రాసినదాంతో సంబంధంలేకుండా – రొటీన్ కామెంట్లు రాసుకుంటూ కూర్చోవడం వల్ల టైం వేస్టు తప్ప, ఉపయోగం లేదు.
మస్జిద్ – ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈక్వాలిటీ
మసీదులోనికి ఎంటరయ్యేటప్పుడు చెప్పులు బయట వదలాలి.
చెప్పులు మాత్రమే కాదు –
వ్యక్తిగత హోదా,సంపద,సెలెబ్రిటీ స్టేటస్,మిలియన్ల ఫాలోయింగ్, షీల్డులు,శాలువాలూ …
అన్నీ బయటే వదలాలి –
అక్కడ కేవలం నువ్వొక మనిషివి,
కేవలం నువ్వొక ఆత్మవి,
ఆత్మల్లో ఎక్కువ,తక్కువలుండవు!!!
గత 1400 సంవత్సరాలుగా, ఆత్మలనన్నిటినీ ఒకేతాటిపైకి తెచ్చి క్యూలో నిలబెడుతున్న సిస్టమ్ అది –
అర్థమైనోల్లకు దానికదే ఓ మిరకిల్.
ఆత్మల సృష్టికర్త మాత్రమే చేయగలిగిన మిరకిల్!!!

రియల్ ఛాంపియన్ – ఖబీబ్ నర్మగొమదెవ్!!!
“ఈ రోజు నేను ఛాంపియన్ ని. రేపు ఇంకొకరు కావొచ్చు. ఎల్లుండి మరొకరు. ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు. మన కంటి చూపు, మన వినికిడి ఙానం, మన ప్రతిభ,సామర్థ్యం అన్నీ సృష్టికర్త పరీక్షలో భాగంగా మనకు ప్రసాదించబడినవే. ఈ విజయాలూ,పతకాలూ,బిరుదులూ,టైటిల్లూ ఇవేవీ నాకు ముఖ్యం కాదు. సృష్టికర్తతో నా రిలేషన్ ఎలా ఉందనేదే నాకు అత్యంతముఖ్యమైంది. దీని తర్వాతే వేరే ఏదైనా” – ఈ మాటలన్నది ఎవరో అనామకుడు కాదు. MMA ( మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) లో, 28 మ్యాచులు ఆడి, ఏ ఒక్కదానిలోనూ ఓడిపోకుండా, 28 మ్యాచులూ గెలిచిన అన్‌డిఫీటబుల్ వరల్డ్ ఛాంపియన్ – ఖబీబ్ నర్మగొమదెవ్. (MMA బాక్సింగ్ లాంటిదే కానీ, బాక్సింగ్ కంటే చాలా కష్టమైంది,ప్రమాదకరమైంది.
Continue reading “రియల్ ఛాంపియన్ – ఖబీబ్ నర్మగొమదెవ్!!!”బెంగులూరు – ఫేస్ బుక్ పోస్ట్ వివాదం
నాలాంటి ఓ ముస్లిం, ప్రవక్తను కీర్తిస్తూ నాలుగు వ్యాసాలు రాయగానే ప్రవక్త గౌరవం పెరగిపోయిందనుకోవడం ఎంత హాస్యాస్పదమో, ఓ ముస్లిమేతరుడు ప్రవక్తను దూషిస్తూ/విమర్శిస్తూ ఏదో రాయగానే ఆయన గౌరవానికి భంగం కలుగుతుందనుకోవడం కూడా అంతే హాస్యాస్పదం. దేవదూత నుండీ సందేశం రావడం.. అనేవిషయాన్ని పక్కన పెట్టి,
Continue reading “బెంగులూరు – ఫేస్ బుక్ పోస్ట్ వివాదం”అప్పట్లో తాత – ఇప్పుడు కొడుకు: ఓ ఆసక్తికర రీసెర్చ్!!
Brian Longden – లండన్ లో లారీ డ్రైవర్. గూడ్స్ డెలివరీ చేసే క్రమంలో, ఇంగ్లాండ్ లోని వివిధ ప్రదేశాలు తిరుగుతుంటాడు. ఓ సారి, అలా StalyBridge అనే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. Brian Longden కి ఓ హాబీ ఉంది. అది తన పూర్వీకుల చరిత్రల్ని,వారి జీవన విధానాల్ని సేకరించడం. అలా రెండు తరాల సమాచారం మొత్తం సేకరించాడు. మూడో తరం నాటి వ్యక్తులు, StalyBridge ఏరియాలో నివసించినట్లు అతనిదగ్గర సమాచారం ఉంది. అంతకు మించి మరేమీ తెలీదు. దీనితో అక్కడి లోకల్ ప్రభుత్వాఫీసుకు వెళ్ళి, సర్ నేమ్ Stanley కి సంబంధించిన పాత సమాచారం ఏదైనా ఉందేమో కావాలని అడిగాడు. అక్కడ ఉన్న ఓ పెద్దాయన, పాత రికార్డ్స్ అనీ వెతికి కొన్ని డాక్యుమెంట్లు తెచ్చి ఆయన ముందు పడేశాడు. అవి -1828-1911 మధ్య ఆ టౌన్ లో జీవించిన Robert Reschid Stanley అనే వ్యక్తికి సంబంధించిన రికార్డ్స్. ఆ రికార్డ్ ని బట్టి, ఆయన ఆ ప్రాంత మేయర్ గా పనిచేశారని అర్థమైంది. ఇక రెండో పేపర్లో ఆయన ఫోటో ఉంది. అది చూడగానే, బ్రయాన్ లాంగ్డన్ కి షాక్ కొట్టినట్లైంది. దానికి కారణం – ఫోటోలో ఆయన తలపై ఉన్న టోపీ.
Continue reading “అప్పట్లో తాత – ఇప్పుడు కొడుకు: ఓ ఆసక్తికర రీసెర్చ్!!”హయ సోఫియా – ఎర్డోగాన్ రివర్స్ కమాలిజం!!!
ప్రస్తుతం మ్యూజియం గా ఉన్న హాయ సోఫియా నిర్మాణాన్ని మసీదుగా మార్చడం సరైందా,కాదా?1935 లో, అప్పటివరకూ నమాజులు చదువుతున్న మసీదును, ముస్తఫా కమాల్ అటాటుర్క్ మ్యూజియం గా మార్చడం సరైందా,కాదా?1453లో, కాన్స్టాంటినోపుల్ ని జయించిన టుర్కులు, అప్పటిదాకా ఉన్న చర్చిని మసీదుగా మార్చడం సరైందా? కాదా? 1204 లో, నాలుగవ క్రూసేడ్ సంధర్భంగా, రోమన్ కేథలిక్ క్రిష్టియన్లు, అప్పటిదాకా ఈస్ట్రన్ ఆర్థోడాక్స్ చర్చ్ గా ఉన్న ఈ నిర్మాణంపై దాడి చేసి, దానిని రోమన్ కేధలిక్ చర్చ్ గా మార్చడం సరైందా,కాదా?వీటన్నిటికీ అవుననిగానీ,కాదని గానీ ఏదో ఓ సమాధానం ఇవ్వొచ్చు.
Continue reading “హయ సోఫియా – ఎర్డోగాన్ రివర్స్ కమాలిజం!!!”Islam అండ్ Sex
“శారీరక కోర్కెలు చాలా నీచమైనవి. మానవుడు వాటిని త్యజించి పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా బతకాలి” – అని ఇస్లాం చెప్తుందనుకుంటే – మీరు ముద్దపప్పులో కాలేసినట్టే.నిజానికి, పురుషుడికి అత్యంత ఆకర్షనీయమైనది స్త్రీ యే నని ఖురాన్ నిర్ధారిస్తుంది.(అక్నాలెడ్జ్ చేస్తుంది) “పురుషుడు వాంఛించేవి – స్త్రీలు, కుమారులు, బంగారు సంపద, సారవంతమైన భూములు, మేలిమి గుర్రాలు( ప్రస్తుత కాలంలో కార్లు..?). ఇవన్నీ ఇహలోక సౌఖ్యాలు మాత్రమే.”ఖురాన్ 3:14, (ఇంచుమించు అనువాదం)లిస్ట్ లో మొట్ట మొదటిది – స్త్రీ. అందంగా ఉన్న స్త్రీ పట్ల ఆకర్షితులవ్వడం, వారితో శారీరకంగా ఇదవ్వాలని కోరుకోవడం – ఇవన్నీ పార్ట్ ఆఫ్ హ్యూమన్ డిజైన్. ఆ డిజైనర్ నుండీ వచ్చిన ఇస్లాం/ఖురాన్, మగాడి ఆ బేసిక్ ఫీచర్ ని తప్పుపట్టడమో, దానిని వదులుకుని, బ్రహ్మచారి లా బతకమనో చెప్పదు. బట్.. అయితే.. కానీ..
ఈ జడ్జ్ ని చూసి, ఆ జడ్జ్ లు ఏమంటారో..? ముస్లిం పురుషులు కూడా చెత్త ఆర్గ్యుమెంట్లు చెయ్యకుంటే మంచిది.!!

గత వారం, రఫీయా అర్షద్ అనే హిజాబ్ ధరించే మహిళ, ఇంగ్లాండ్ లో జడ్జ్ గా సెలెక్ట్ అయింది. దీనిలో పెద్ద వింతేమీలేదు. కాకపోతే, ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, “నేను ఇంటర్వ్యూకి వెల్తున్నప్పుడు, హిజాబ్ తో వెలితే సెలెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువనీ, ఆ హిజాబ్ తీసేసి వెలితే మంచిదని, మా ఫ్యామిలీ మెంబర్ సలహా ఇచ్చాడు. సెలెక్ట్ ఐనా కాకున్నా, నేను,నేనుగానే ఉంటాను తప్ప, హిజాబ్ తీసేస్తే వచ్చే సెలెక్షన్ నాకక్కర్లేదని, హిజాబ్ తోనే ఇంటర్వ్యూకు వెళ్ళాను. సెలెక్ట్ అయ్యాను” – అని ఆమె చెప్పింది.ఇది ఆసక్తికరం.ఇప్పుడు మరో రకం జడ్జిల గురించి మాట్లాడదాం.
వీరు – “ముస్లిం పురుషులు, ముస్లిం స్త్రీలతో బలవంతంగా బురఖా/హిజాబ్ ధరింపచేస్తారనీ, ఆ రకంగా వారి స్వేచ్చను హరించి వేసి వారిని అణిచేస్తారనీ,తొక్కేస్తారనీ.. ” – ఇలా ఏవేవో జడ్జిమెంట్లను యదేచ్చగా ఇచ్చేస్తుంటారు.ఇలాంటి జడ్జిలు, పైన రఫియా అర్షద్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటారో. అఫ్కోర్స్ , ఎవరో ఒక్క మహిళ చెప్పిన విషయాన్ని బట్టి కన్‌క్లూడ్ చేయకూడదు. కరెక్టే. మరి – బురఖాకు వ్యతిరేకంగా మాట్లాడే ముస్లిం మహిళలు కూడా ఎక్కడో, ఒకరిద్దరు ఉంటారు తప్ప, తండోపతండాలుగా ముస్లిం మహిళందరూ బురఖాకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడంలేదు కదా. అప్పుడెప్పుడో తస్లీమా నస్రీన్ అనే ఆవిడ ఓ పుస్తకం రాసింది. ఇక అడపాదడపా కొందరు ముస్లింలు ఏవో కామెంట్లు చేస్తుంటారు. వీరందరూ బురఖా ధరించే కోట్లాది ముస్లిం మహిళలకు రెప్రెజెంటేటివ్ లు కాదుకదా. అది వీరి వ్యక్తిగత అభిప్రాయమే తప్ప, ముస్లింల ఇళ్ళిల్లూ తిరిగి, ముస్లిం మహిళలతో మాట్లాడి, సర్వే చేసి చెప్పిన విషయాలు కావు కదా. బేసికల్ గా ఇలా జడ్జిమెంట్లు ఇచ్చేవారి మనసులో ఓ ఇమాజినరీ సీన్ నడుస్తుంటుంది. అదేమంటే- ఓ టినేజీ ముస్లిం అమ్మాయి, జీన్స్ ప్యాంటూ,టీషర్టూ వేసుకుని కాలెజ్ కి వెల్తుంటే, ఆమె ఇంట్లోనుండీ అడుగు బయటపెట్టే టయానికి, ఆమె నాన్నో ,అన్నో వచ్చి- ఆగు..ఆగు..ఆగు.. అని సాయికుమార్ లెవల్లో అరిచి- బలవంతంగా ఆమెచేత బురఖా తొడిగించి -“ఇప్పుడు వెళ్ళు” అని బయటికి పంపించినట్లు,
ఓ ముస్లిం మహిళ చక్కగా శారీ కట్టుకుని ఆఫీసుకో, షాపింగు కో వెల్తుంటే – ఆమె భర్తో, అత్తింటివారో ఆమెను అటకాయించి, ఆమెను బురఖాలో చుట్టేసి బయటికి పంపించినట్లు.. పాపం ఈ బాధల్ని భరించలేక, వారు బురఖాలోనే కుమిలి,కుమిలి ఏడుస్తున్నట్లూ.. వీరు ఓ పిక్చరైజేషన్ ని ఇమాజిన్ చేస్కుంటుంటారు.******
సరే – రఫియా అర్షద్ కాకుండా ఇంకొందరు మహిళల గురించి చూద్దాం.
Ibtihaj Muhammad – ఈమె హిజాబ్ తోనే అమెరికా తరుపున ఫెన్సింగ్ ఆటలో, ఏకంగా ఒలింపిక్స్ లో పాల్గొన్నది.
Kubra Dagli – టర్కీ కి చెందిన ఈమె, హిజాబ్ తోనే , టేక్వొండో(కరాటే లాంటిది) ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించింది.
Kulsoom Abdullah – ఈ పాకిస్తానీ అమెరికన్ – ఎలెక్ట్రికల్ అండ్ కంప్యూటర్స్ ఇంజినీరింగ్ లో పీహెచ్డీ చేసింది. అంతే కాకుండా- వెయిట్ లిఫ్టింగ్ లో, అమెరికా దేశవాలీ పోటీల్లో అనేక పథకాలు సాధించి, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అమెరికాకు ప్రాతినిధ్యం వహించే ప్రయత్నాల్లో ఉంది. – ఇదంతా హిజాబ్ ధరించే సాధించింది.
Majiziya Bhanu – మన కేరల అమ్మాయి. హిజాబ్ ధరించే, ప్రపంచ రెజ్లింగ్ పోటీల్లో డబుల్ గోల్డ్ సాధించింది.
Dr Tahani Amer – నాసాలో సీనియర్ సైంటిస్ట్, ప్రోజెక్ట్ డైరెక్టర్. ఈమె పేరుమీద కొన్ని పేటెంట్లు కూడా ఉన్నాయి. సృష్టికర్తతో నీ ఈక్వేషన్ కరెక్ట్ గా ఉంటే, ఆ తర్వాత అందరు వ్యక్తులతో నీ ఈక్వేషన్ ఆటోమేటిక్ గా సెట్ అవుతుందని చెప్పే, ఈ హిజాబీ సైంటిస్ట్ మాటలు వింటే, పాపం నాస్తికులు కన్‌ఫ్యూజ్ ఐపోవలసిందే.
Şule Yüksel Şenler : 1930 లో అట్టోమన్ సామ్ర్యాజ్యం నేలకూలి, ఆధునిక టర్కీ ఏర్పడ్డాక, టర్కీ నుండీ హిజాబ్ లాంటి ఇస్లామిక్ చిహ్నాలని తుడిచేసి దానిని మరో యూరోపియన్ దేశంగా మార్చాలని కంకణం కట్టుకున్న అప్పటి, టర్కీ అధ్యక్షుడు ముస్తఫాకమాల్ అటాటుర్క్ ప్రయత్నాలను ఈ మహిళ ఒంటిచేత్తో ఎదుర్కొంది. ప్రభుత్వ నిషేధాన్ని వ్యతిరేకించి హెడ్ స్క్రాఫ్ ధరించడమే కాక, దాన్నో ఫ్యాషన్ సింబల్ గా తీర్చిదిద్దింది. ప్రభుత్వం ఈమెను అరెస్టు చేసినప్పుడు, హిజాబ్ ధరించిన ముస్లిం మహిళలు టర్కీ వీధుల్లోకి వచ్చి ఈమెకు మద్ధతుగా ర్యాలీలు చేశారు. ప్రభుత్వం దిగొచ్చి, ఈమె శిక్షాకాలాన్ని తగ్గించినా, ఈమె మాత్రం పూర్తి శిక్షాకాలం తర్వాతే బయటికివచ్చింది. బోడి క్షమాభిక్ష ఎవరిక్కావాలని, అలాకూడా మళ్ళీ ప్రభుత్వాన్ని ధిక్కరించింది. గత సంవత్సరం, ఈమె మరణించినప్పుడు, ప్రస్తుత అధ్యక్షుడు ఎర్డోగాన్, స్వయంగా ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
మొన్నటికి మొన్న – ఫ్రాన్స్ ప్రభుత్వం బురఖాను నిషేధిస్తే, చాలా మంది ముస్లిం మహిళలు ఈ నిషేధాన్ని ధిక్కరించి మరీ బురఖా ధరించి వీధుల్లోకి వచ్చారు.ఇవన్నీ, ఒక్క పది నిమిషాలు గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసిన విషయాలు. వీల్లందరి చేతా వారి నాన్నలు,అన్నలూ,భర్తలూ బలవంతంగా హిజాబ్/బురఖా ధరింపజేస్తున్నారని బుద్దున్నోల్లెవరూ అనరు. దీనిని బట్టి అర్థమయ్యేదేమంటే, కొందరు ప్రొజెక్ట్ చేస్తున్నట్లు, ముస్లిం మహిళలు బురఖాను గుదిబండలా భావించేంత సీన్ లేదు. ప్రతిఒక్కరూ తమ మతాల్ని,సంసృతినీ ఓన్ చేసుకున్నట్లుగానే, ముస్లిం మహిళలు కూడా దీనిని ఓన్ చేసుకుంటారు.******
బురఖా విషయం చర్చకు వచ్చినప్పుడల్లా కొందరు ముస్లింలు కొన్ని చెత్త ఆర్గ్యుమెంట్లు చేస్తుంటారు. “చాక్లెట్ ని కవర్ లో చుట్టి ఉంచాలి, లేకుంటే దానికి చీమలు పడ్తాయి. కేక్ బయట ఉంటే చెడిపోతుంది. బంగారం బయటుంటే దొంగలు ఎత్తుకుపోతారు, కాబట్టి భద్రంగా దాచుకోవాలి” — ఈ టైపు దేడ్ దిమాక్ లాజిక్ లతో, తాము బురఖాను భీబత్సంగా డిఫెండ్ చేస్తున్నామనుకుంటుంటారు. నిజానికి ఇవన్నీ సెల్ఫ్ డిఫీటింగ్ ఆర్గ్యుమెంట్లు. ” అంటే నీ దృష్ఠిలో, స్త్రీ కూడా ఓ ప్రాణం లేని చాక్లెట్టు, కేకు, బంగారు లాంటిదేనా ” అని ఎవరైన ఓ కౌంటర్ ఆర్గ్య్మెంట్ గానీ చేశారంటే ఖేల్ ఖతం, దుక్నం బంద్. కాబట్టి అలాంటి ఆర్గ్యుమెంట్లకు దూరంగా ఉండాలి.
“ఎక్కువబట్టలైనా,తక్కువబట్టలైనా… ఓ స్త్రీకి తనకు నచ్చిన బట్టలు ధరించే స్వేచ్చ ఆమెకుండాలి. దీని గురించి ఇతరులు తెగ ఇదై పోవాల్సిన అవసరం లేదు” – మన ఆర్గ్యుమెంట్ ఇంత వరకే ఉండాలి.
ఇక ఖురాన్,హదీస్ లు – బట్టలు,నడవడిక,జీవన విధానం వంటివాటిలో స్త్రీ-పురుషులకు ఎలాంటి నియమాలు,సలహాలూ ఇచ్చాయనేది ఇస్లామిక్ స్కాలర్స్ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్. వారు చెప్పేదాన్ని బట్టి, ఏ నియమాన్ని ఎంతవరకూ ఫాలో కావాలనే విషయాన్ని మహిళలు స్వంతంగా డిసైడ్ చేసుకుంటారు.
అలాగని, ముస్లిం మహిళలందరూ పూర్తి సుఖసంతోషాలతో, ఇస్లాం ప్రకారం వారికి ఇవ్వబడిన హక్కులన్నీ అనుభవిస్తూ జీవిస్తున్నారని చెప్పడానికి కూడా లేదు.
పెళ్ళిలో పురుషుడే స్త్రీకి మహర్ చెల్లించాలి. వధువు కుటుంబం నుండీ ఎలాంటి ఖర్చులూ పెట్టించకూడదు. కానీ, చాలా మంది ముస్లిం పురుషులు యదేచ్చగా దీనిని ఉల్లంఘించి, ముస్లిం స్త్రీలనుండీ కట్నాలు తీసుకుంటున్నారు. వారితో విందులు,లాంచనాలని లక్షలకు లక్షలు ఖర్చుపెట్టిస్తున్నారు. చాలాసార్లు తలాక్ నియమాలను ఏకపక్షంగా ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి అన్-ఇస్లామిక్ ఆచారాలకు వ్యతిరేకంగా ముస్లిం పురుషులే ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అందరం ప్రయత్నిద్దాం.ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం , ఈ పేజ్ ని లైక్ చేయండి,ఛానెల్ ని సబ్స్రైబ్ చేయండి.
యూటూబ్ లింక్ https://youtu.be/0R2o3XXrVgQ
shukravaram FaceBook Page link : https://www.facebook.com/Shukravaram-1561547220726260/?eid=ARDRXqqrtdLY0C7XDKlgN3BVmbg6uW1eRh2YvV982ifEpGcZUSu1mLlUDn6tOkwPPdghq2QGfoGFgVpmఖుదా హఫీజ్.
ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టింది.. చివరికి..

Rosie Gabrielle – 1986 లో కెనడాలోని, వాంకోవర్ లో పుట్టింది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, సింగర్ కూడా. 19 సంవత్సరాల వయసప్పుడు, ఓ టూరిస్ట్ బృందంతో కలిసి -థాయిల్యాండ్, బర్మా, వియత్నాం, కాంబోడియా, లాఓస్ దేశాల టూర్ కి వెళ్ళింది. థాయిల్యాండ్ లో, ఓ సారి, ఆమె బృందం వారు వెల్తున్న టూరిస్ట్ బస్ మిస్ అయ్యింది. తరువాత, వేరే వ్యక్తి సహాయంతో బైక్ పై ఆ బస్ వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళింది. బైక్ లో వెళ్ళడానికీ, బస్సులో వెళ్ళడానికీ ఉన్న తేడా అప్పుడే ఆమెకి అర్థమైంది. ఓ ప్రదేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నా, అక్కడి ప్రజల్ని, సంస్కృతులనీ అర్థం చేసుకోవాలన్నా బైక్ పై వెళ్ళడమే కరెక్ట్ అని అప్పుడే అర్థమైంది. వెంటనే థాయిల్యాండ్ లో, ఓ యమహా బండి కొని ఈ మూడు దేశాల్లో 2000 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణం చేసింది.
అనంతరం, కెనడాకి తిరుగు ప్రయాణమైంది. ఓ సింగింగ్ బ్యాండ్ లో, సింగర్ ఆడిషన్స్ కి అటెండ్ అయింది, సెలెక్ట్ కూడా అయింది. కాకపోతే, ఒక కండీషన్. రెండు వారాల్లో ఒమన్ కి వెళ్ళాల్సి ఉంటుందనీ,అక్కడే 6 నెలలు ఉండాల్సి ఉంటుందనీ, దానికి ఓకే అంటేనే కాంట్రాక్ట్ సైన్ చేయొచ్చనేది – ఆ కండీషన్.
అక్కడ గ్రాండ్ హయత్ లో కొన్ని ప్రోగ్రాంస్ చేయడం, ఆమెకు ఇచ్చిన టాస్క్.
అది ముస్లిం కంట్రీ అని, అక్కడికి వెళ్ళడం శ్రేయస్కరం కాదనీ కెనడాలో కొందరు సలహా ఇచ్చారు. కానీ, ఏది భయమనిపిస్తే ముందది చేసేయాలనే డేర్ డెవిల్ యాటిట్యూడ్ ఉన్న Rosie Gabrielle, ఆ జాబ్ కి ఓకే చెప్పింది.
ఆరు నెలల కాంట్రాక్ట్ తర్వాత, ఒమన్ లోనే ఓ, ఫోటోగ్రఫీ కంపెనీ పెట్టింది. అది మంచి లాభాలు గడించింది కానీ, రొటీన్ వర్క్ చేయడం ఈమెకే బోర్ అనిపించేసి, ఆ కంపెనీని అమ్మేసింది. ఆమెకు క్లోజ్ గా ఉన్న ఓ ఫ్రెండ్ చనిపోవడంతో, ఆమె డిప్రెషన్ కి గురైంది. అప్పుడే ఆమెకు క్రానిక్ లైమ్ అనే ఓ రకమైన నొప్పికలిగించే జబ్బుకూడా మొదలైంది. ఇదంతా ఆమె జీవితంలో అనేక డిస్టర్బెన్సెస్ కలిగించాయి. ఈ అనుభవాలన్నిటివల్లా ఆమెకు జీవితం పై విరక్తి కలిగి, ఇలా భాధలతో చచ్చేకంటే, బతికిన కొన్నిరోజులూ తాను అత్యంత ఇష్టపడే ప్రపంచ యాత్ర చేస్తూ చావడమే మేలనుకుని ఆమె బైక్ పై ప్రపంచయాత్రకు బయలు దేరింది. మొదటి సారిగా, ఆఫ్రికా టూర్ కి బయలు దేరింది.
ఆఫ్రికాలో పది దేశాలు తిరిగింది. అప్పుడే ఆమె ట్రావెల్ బ్లాగ్ రాయడం మొదలు పెట్టింది. ఆమె పోస్టులు, వీడియోలూ విపరీతంగా పాపులర్ అయ్యాయి. అనంతరం ఆమె కెనడా-అమెరికాల మధ్య కూడా బైక్ ప్రయాణం చేసి మొత్తం అణుభవాలను వీడియో రికార్డ్ చేసింది.
ఆరోగ్యం కాస్తా కుదుటపడటంతో, తన మకాం మళ్ళీ ఒమన్ కి మార్చింది. అక్కడి నుండీ యూఏఈ,ఈజిప్ట్ లాంటి ముస్లిం మెజారిటీ దేశాల్లో సోలోగా బైక్ పై తిరిగింది. చివరికి గతేడాది పాకిస్తాన్ లోకి అడుగుపెట్టింది. సూమారు మూడు నెలలు, బలూచిస్తాన్ లాంటి పాకిస్తాన్ గ్రామీణ ప్రాంతాల్లో తిరిగింది.
ఆమె తిరిగిన ముస్లిం మెజారిటీ దేశాల్లో, ఆమెకు ఎదురైన అనుభవాలు, అక్కడి ప్రజలు ఆమె పట్ల చూపించిన ప్రేమాభిమానాలు, ఒంటరిమహిళ అని తెలిసి కూడా అక్కడి పురుషులు ఆమెతో గౌరవంగా మెలిగిన విధానం, ఎంత పేదవారైనా, తమ దగ్గర ఉన్నది ఆమెతో షేర్ చేసుకోవాలనే ప్రయత్నం, ఇవన్నీ ఆమెకు ఇస్లాం పై ఆసక్తి కలిగేలా చేశాయి. మొత్తానికి, జనవరి 5, 2020 న ఆమె తనను తాను ముస్లిం గా ప్రకటించుకుంది.
“I feel its so important to share the truth that is Islam, which is peace, love and oneness. It is one of the most critized, osterzied, and misunderstood religions worldwide from both non Muslims AND Muslims !!! As in any religion, there are many interpretations and personal views/sects, which is not the true teachings of God, this is Human flaw. And its taking away from the true essence of God and Humanity, which is oneness and equality for all, instead its creating division. I’ve been on a deep spiritual path now for many years, and after spending so many years in a Muslim country, especially after traveling Pakistan, I learnt so much. So much about my own self, God and what Islam really is- FROM THE FIRST HAND PERSPECTIVE.” -ఇలా తాను ఎందుకు ఇస్లాం లోకి మారిందో వివరిస్తూ ఓ సుదీర్ఘ వ్యాసం రాసింది. ఆమె పేరుమీదున్న యూటూబ్ చానెల్ లో, ఆ వ్యాసాన్ని, ఆమె రికార్డ్ చేసిన జర్నీ యొక్క వీడియోలనూ చూడొచ్చు.
************
ఇదేదో ఒక్క రోజీ గాబ్రెయిల్ అనుభవమే కాదు. ఇస్లాం గురించి తెలుసుకుని, దానికి అట్రాక్ట్ ఐన, ఇంకా అవుతున్న వెస్ట్రన్ మహిళల సంఖ్య లక్షల్లోనే ఉంది. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు, ఇస్లాం గురించిన నెగెటివ్ వార్తలు వైరల్ అయినంతగా, పాజిటివ్ వార్తలు ఎప్పటికీ వైరల్ అవ్వవు. అందుకే వీటి గురించి ఎవరికీ తెలీదు. ఎవరో కొందరికి తెలీనంత మాత్రాన నిజం నిజం కాకపోదు.
ఇస్లాం గురించి కొందరు చెప్పే కాకమ్మ కథల ఆధారంగా అభిప్రాయాలు ఏర్పరచుకుంటారో, ఇలాంటి ముస్లిమేతరులు, తమ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ల ద్వారా చెప్పే విషయాల ఆధారంగా అభిప్రాయాలు ఏర్పరచుకుంటారో, ఎవరి ఛాయిస్ వారిదే.
పరిచయం :Sinéad O’Connor

పేరు : Sinéad O’Connor
పుట్టింది : 1966, ఐర్ల్యాండ్ లోని డబ్లిన్ లో.వృత్తి : సింగర్+ లిరిక్ రైటర్.మ్యూజిక్ కెరీర్ :ఆమె స్వయంగా రాసి, పాడిన, 1987 లో రిలీజైన “The Lion and Cobra” Album ఓ సంచలనం. పాతిక లక్షల ట్రాక్స్ అమ్ముడుపోయింది.మరో ప్రముఖ సింగర్ ప్రిన్స్ తో కలిసి చేసిన, 1990లో రిలీజైన – Nothing Compares 2 U. కోటి కాపీల కంటే ఎక్కువ అమ్ముడుపోయి, అనేక యూరోపియన్ దేశాల బ్లాక్ బస్టర్ లిస్టుల్లో ఒకటిగా నిలిచింది.-అనేక MTV అవార్డులు, గ్రామీ అవార్డు, Billboard అవార్డులు, లెక్కలేనన్ని నామినేషన్లు సాధించింది.
రెలిజియస్ యాక్టివిటీస్: టీనేజ్లో ఉన్నప్పుడు Irish Orthodox Catholic and Apostolic Church కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది.అనంతరం ఆమెకు కలిగిన అణుమానాలను నివృత్తిచేసుకునే క్రమంలో, వివిధ మతాలను అధ్యయనం చేయడం, చివరికి 2018లో ఇస్లాం లోకి మారడం జరిగింది.
ఇస్లాం లోకి ఎందుకంటే ఆమె ఇచ్చిన సమాధానం – “Islam is the natural conclusion of any intelligent theologian’s journey”.
ఇప్పుడు కూడా ఆమె, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో పర్యటించి ప్రదర్శనలిస్తుంది. హెడ్స్క్రాఫ్ తోనే పాడతారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం -“నాకు అప్పుడు వేసుకోవాలంటే వేసుకుంటా, లేదంటే లేదు. అదేమంత సీరియస్ విషయం కాదు,ఎవరో ఫోర్స్ చేసే విషయం కాదు.”
Sinéad O’Connor – తన పాటల ద్వారా, స్టేట్మెంట్స్ ద్వారా, మహిళల హక్కులు,బాలల హక్కులకోసం బలంగా తన గొంతు వినిపించింది. 1992లో, న్యూయార్క్ లో ప్రదర్శన ఇస్తున్నప్పుడు, చైల్డ్ అబ్యూస్ కి నిరసనగా, పోప్ ఫోటోను చించివేసి- సంచలనం సృష్టించింది.మరోమారు, గ్రామీ అవార్డుల సంధర్భంగా, అమెరికా యుద్ద రాజకీయాలకు వ్యతిరేకంగా, ఆ దేశ జాతీయ గీతం గానీ ప్లే చేస్తే, నేను అవార్డ్ తీసుకోవడానికి రానని తెగేసి చెప్పింది.
ఇలాంటి డేర్ డెవిల్, ఇండిపెండెంట్ థింకర్ – ఇస్లాం మతాన్ని ఓన్ చేసుకోవడం, కొందరికి ఆశ్చర్యం కలిగించొచ్చు గానీ, ఇస్లాం గురించి తెలిసిన వారికి అదేమంత ఆశ్చర్యం అనిపించదు.