Dalit Dairies-1

ఈ క్రింది ఫోటో లు చూసారా..ఏప్రిల్ నెలలో వార్తల్లోని వ్యక్తి.గుర్తుపట్టారా.పేరు” సంజయి జాటవ్ “.ఉత్తరప్రదేశ్ లోని నిజా0పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి.ఆ గ్రామం లో కాసగంజ్ … తరతరాలుగా అగ్రవర్ణ ‘ఠాకూర్లు’ , దళిత ఉపకులానికి చెందిన ‘జాటవ్’ ల పై ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రాంతం.ఠాకూర్లు జాటవ్ ల పై హుకుం చేస్తూ వారిని అత్యంత వివక్షకు గురిచేస్తారు.

దళితుడూ..నిరుపేద కుటుంబం లోని ‘లా’ చదువుకున్న సంజయ్ పెళ్లి పక్క ఊర్లోని శీతల్ అనే అమ్మాయితో ఏప్రిల్ లో పెట్టుకున్నారు.కాసగంజ్ లో దళితుల పెళ్లి ఊరేగింపు నిషేధం.

ఠాకూర్లు జాటావ్ లను ” వాళ్ళు తక్కువ కులం వాళ్ళు.మా ఇళ్ల ముందు నుండి ఊరేగింపు పోతే మా ఇంటి ఆడవాళ్లు ఆ స0బరాల ను బయట నిలబడి చూస్తారా..మా ఇళ్ల ముందు నుండి ఊరేగింపు జరగనివ్వం .మా వీధులు మైల పడతాయి” అంటారు.

సంజయ్ తన పెళ్లి లో ఊరేగింపు జరపాలని అనుకున్నాడు.ఊరిపెద్దలూ..కుటుంబసభ్యులు.. బీసీ మహిళ అయిన సర్పంచ్ వారించారు..అనవసరంగా ఠాకూర్లను రెచ్చగొట్టొద్దన్నారు.గ్రామం లో కాకుండా వేరే టౌన్ లో పెళ్లి చేసుకోమన్నారు..సంజయ్ …శీతల్ పట్టుబట్టారు.జనవరి లో జిల్లా మేజిస్ట్రేట్ ని కలిశారు..ఎస్పీ ని..ఐజీ ని కలిశారు.
.చివరగా తన పెళ్లికి.. తనకు నచ్చిన విధంగా ఊళ్ళో ఊరేగింపు కు అనుమతినివ్వాలని ‘అలహాబాద్ హై కోర్ట్’ ని ఆశ్రయించారు.

.ఈ విషయం తెలిసిన ఠాకూర్లు జాటవ్ ల ఇళ్ల పై దాడులు చేయించారు..అనేకమందిని కుళ్లబొడిచారు. నిజా0పూర్ గ్రామం మొత్తం నెల రోజులు 144 సెక్షన్ విధించారు..సంజయ్ దీన్ని ఆత్మగౌరవ ఛాలెంజ్ గా తీసుకున్నాడు.శీతల్ సోదరుడు బిట్టూ తో కలిసి దళిత సంఘాలను కలిసాడు.CMO దృష్టికి తీసుకెళ్లారు..
చివరికి హై కోర్ట్ అనుమతితో..పోలీసులు పెళ్లి ఊరేగింపుకు ఒప్పుకున్నారు..వారే స్వయంగా ఒక రూట్ మాప్ తయారు చేశారు.ఠాకూర్ల ఇళ్ల వైపు పోకుండా జరుపుకోవాలని సూచించారు..ఆ మ్యాప్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన సంజయ్ తిరిగి కోర్ట్ కి వెళ్ళాడు.
కోర్టు ..పోలీసులు, ఊరేగింపులో ఎవరూ ఎలాంటి మారణాయుధాలు కలిగి ఉండరాదని., ఎవరూ మద్యం తాగకూడదని..రెచ్చగొట్టే ప్రసంగాలు మాటలూ ఉండరాదని….ఇన్ని షరతులతో అంగీకరించారు.

ఫైనల్ గా ఆ రోజు రానే వచ్చింది.అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 నాడు.. అనేక బెదిరింపులు..దాడులు.. ఉత్కంఠ ల మధ్య..100 మంది స్టేట్ ఆర్మీ పోలీసులు..35 మంది హెడ్ కానిస్టేబుళ్ళూ..22 మంది ఎస్సై ల తో కట్టుదిట్టమైన భద్రత మధ్య దళితుడైన సంజయ్ పెళ్లి ఊరేగింపు 80 ఏళ్ళలో మొదటి సారి ఠాకూర్ల ఇళ్ళ మీదుగా జరిగింది ఆ ఘట్టం చూడడానికి .చుట్టుపక్కల గ్రామాలనుండి వందలాది మంది ప్రజలు వచ్చారు..మీడియా ..టీవీ రిపొర్టర్లు.. ఒక యుద్ధ రంగాన్ని తలపించాయి..జీర్ణించుకోలేని చాలామంది ఠాకూర్ల కుటుంబాలు ఆ రోజు ఇళ్లకు తాళాలు వేసుకుని పక్క ఊర్లకు వెళ్లిపోయారు..నిర్విఘ్నంగా పెళ్లి ఊరేగింపు జరిగింది.

దళిత వాడల్లో ఆ సంతోషం నింపిన సంజయ్ ని ఒక కాబినెట్ మంత్రి లా చూసారు జనం..అక్కడి తరతరాల వివక్షకు ఆత్మగౌరవ పతాక అతని పెళ్లి..

సంజయ్ గర్వంగా “మనం ఇంత చదువుకుని ఈ వివక్షను ఆపకుంటే ఏం లాభం..సమాజం మారాలి.దళితుల పై వారి జీవితాల పై చిన్నచూపు ఇంకా తగదు.ఇప్పటికైనా వారు ఆలోచించాలి..అందుకే ఇంత పట్టుబట్టాను’ ..అన్నాడు

.ఇంత ఘనమైన పెళ్ళి ఊరేగింపు లో కొత్త తరం ఠాకూర్ల వారసులు కొందరు పాల్గొని నృత్యం చేయడం కొసమెరుపు..ఈ ఆత్మగౌరవ కథ అక్కడి అందరిలో పోరాట స్ఫూర్తిని .తలెత్తుకు తిరిగే ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చింది.

Written By,
Smt. Rajitha Kommu,
Principal, Govt.Junior College,Peddemu.Ranga Reddy

Leave a Reply

Your email address will not be published.