అప్పుడు..అక్కడ దళితులు అగ్రవర్ణాల వారికన్నా 64 అడుగులు వెనక నడవాలి..అదీ అత్యంత అవసరమైతేనే..లేదంటే ఎప్పుడూ వీధిలోకి రాకూడదు..ప్రతీ నాలుగు అడుగులకు దళితుడు తాను వెనక వస్తున్న విషయాన్ని తెలియపరచాలి.అతని గాలి సోకి ముందు నడుస్తున్న అగ్రవర్ణ మనిషి మైలపడకుండా..
అదే దళిత స్త్రీ అయితే శరీరపు పై భాగం కప్పుకోకూడదు..జుట్టు కత్తిరించుకోకూడదు..తలెత్తి ఎవర్నీ చూడకూడదు.yes.. నేను చెప్తున్నది కేరళ..God’s Own Country ..గురించే..
అలాంటి దౌర్భాగ్య కాలంలో ..అక్కడ అట్టడుగు ‘పులయ’ కులంలో …1912 లో పుట్టిన అమ్మాయి భారత రాజ్యాంగ రూప కల్పనలో పాలుపంచుకుంది.అంబెడ్కర్ చైర్మన్ గా ఉన్న రాజ్యాంగ పరిషత్ లో ఉన్న ఏకైక దళిత మహిళ.
ఆమె పేరు ..”దాక్షాయిని వేలాయుధన్”.ఎర్నాకులం లోని ఒక మూలన ఉన్న ద్వీపం లోని మారుమూల గ్రామం ‘ములవుక్కడ్ ‘లో పుట్టింది.అప్పుడు పెరియార్ పోరాటాలు జరుగుతున్న కాలం.ఆమె అన్న , బాబాయిలు చురుకుగా సభల్లో , సమావేశాల్లో పాల్గొంటున్నారు.
అగ్రవర్ణాల వారు..అక్కడి పాలకులు..కలిసి .ఆ గ్రామ నేల పై..ఎక్కడా సమావేశాలు నిర్వహించకూడదని నిషేధాజ్ఞలు విధించారు
.అప్పుడు ఆ గ్రామ యువకులంతా..వెంబనాడ్ సరస్సు..నలువైపులా కర్రలు పాతి…చుట్టూ వలలు కట్టి..నీటిలోనే సమావేశం జరిపారు..దీన్ని ప్రఖ్యాత
“కాయల్ సమ్మేళనం” అంటారు.
అంతటి పోరాట పటిమ ఉన్న కుటుంబం నుండి వచ్చిన దాక్షాయిని మొట్టమొదటి సారిగా పై దుస్తులు ధరించి స్కూల్ కి వెళ్ళింది.సైన్సు గ్రాడ్యుయేట్ అయిన మొట్టమొదటి ఎర్నాకులం దళిత అమ్మాయి.టీచర్ ట్రైనింగ్ చేసి..అనతి కాలంలోనే కొచ్చిన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి ఎన్నికయ్యారు.
రామన్ వేలాయుధన్ ని..సబర్మతి ఆశ్రమం లో..రిజిస్టర్ పద్దతిలో వివాహం చేసుకున్నారు..రామన్ వేలాయుధన్ మేనల్లుడు. భారత రాష్ట్రపతి గా తర్వాతికాలం లో ఎన్నికైన కె. ఆర్.నారాయణన్.
1947 లో రాజ్యాంగ పరిషత్ లో ఎన్నికయ్యారు.రాజ్యాంగం లో “moral safeguards” ఉండాలని..అంటరానితం కూడదని ..స్వేచ్చ హక్కుల లో ప్రత్యేకంగా ప్రస్తావించాలని పట్టుబట్టారు.
. రాజ్యాంగ పరిషత్ లో వెట్టిచాకిరీ పై..అంటరానితనం పై దాక్షాయిని గారు చేసిన ప్రఖ్యాత ప్రసంగాన్ని అగ్రవర్ణ సభ్యులు హెచ్.సి.మొఖేర్జీ అడ్డుకున్నారు.అయినా ఆమె తన ప్రసంగాన్ని ఆపలేదు..కులవివక్ష ప్రసక్తి లేని హక్కులు హక్కులు కాదని..అంటరానితం అమానుషం అని నినదించారు..
భారత దళిత జాతి యావత్తూ దాక్షాయిని ముందు మొకరిల్లాల్సిన0త గొప్ప కంట్రిబ్యూషన్ ఆమె రాజ్యాంగం లో ఉండాల్సిందేనని పట్టుబట్టిన “Right to Liberties” మరియు “Constitutional Safeguards’ ..నేటికీ అన్యాయానికి అండగా నిలుస్తున్నవి అవే..
“దాక్షాయిని వేలాయుధన్”.. భారత రాజ్యాంగం లో ఆత్మగౌరవ సంతకం.
Written By,
Smt. Rajitha kommu,
Principal, Govt.Junior College,Peddemu.Ranga Reddy