Interesting Author: Wael Hallaq

“టాప్ 500 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ ముస్లింస్ ఇన్ వరల్డ్” – అని ఓ లిస్ట్ ఉంది. దాన్లో ఉన్నోల్లలో నాకు తెలిసిన వారు ఎవరెవరున్నారా అని స్క్రోల్ చేస్తూ ఉంటే – ఒక పేరు మాత్రం వెరైటీగా అనిపించింది. ఆ పేరు -Wael Hallaq.

ఇతని గురించి ఎప్పుడూ వినలేదు, ఎవరై ఉంటారా అని ఫర్దర్ సెర్చ్ చేస్తే, ఇతని గురించి తెలుసుకోవాల్సింది చాలానే ఉందని అర్థమైంది.అసలు ఆ లిస్ట్లో ఈయన పేరు ఎందుకు చేర్చారనే ప్రశ్న మాత్రం ఇంకా మిగిలేఉంది. ఎందుకంటే, ఇతను క్రైస్తవుడు. ఇస్లాం లోకి కన్వర్ట్ అవ్వలేదు. పుట్టింది పాలస్తీనాలోని నజ్రత్ అనే ప్రాంతంలో. ప్రస్తుతం ఈ ప్రాంతం ఇజ్రాయెల్ దురాక్రమణలో ఉంది.

1983లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుండీ పీహెచ్డీ చేసిన Wael Hallaq, 2009 నుండి కొలంబియా యూనివర్సిటీ(కెనడా) లో హ్యుమానిటీస్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఇస్లామిక్ లీగాలిటీస్ సబ్జెక్ట్ ని బోధిస్తాడు. ఇప్పటిదాకా 80 పుస్తకాల్ని,రీసెర్చ్ వ్యాసాల్ని రాశాడు. ఇతని ప్రధాన రీసెర్చ్ ఫీల్డ్ – మాడర్నిటీ, మాడరన్ గవర్నెన్స్, సెక్యులర్ స్టేట్, లిబరలిజం వంటి అంశాల చుట్టూ ఉంటుంది.

ఈయన రాసిన Impossible State అనే పుస్తకం వరుసగా రెండుసార్లు Columbia’s distinguished Book Award గెలుచుకుంది. నా ఫేవరేట్ యూటూబర్స్ లో ఇద్దరు Tom Facchine, Paul Williams. విరిద్దరూ అమెరిక,ఇంగ్లాండ్ లలో క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి, అనేక ఫిలాసఫీల్ని స్టడీ చేసి చివరికి ఇస్లాం లోకి కన్వర్ట్ అయ్యారు.

ఇస్లాం వైపుకు ఆకర్షితమయ్యేలా తమను ప్రేరేపించిన రచనల గురించి మాట్లాడుతూ వీరిద్దరూ Wael Hallaq ని ప్రస్తావించడం మరో ఆశ్చర్యకర అంశం.మానవ జాతికి ఇస్లామిక్ రాజ్యాలు అందించిన సుస్థిరత-నాగరికత, గత వందేళ్ళుగా జరుగుతున్న ప్రపంచ రాజకీయాలు, దురాక్రమణ ద్వారా ఇజ్రాయెల్ ఎదుగుతున్న తీరుతెన్నులు, ఆధునికత పేరుమీద జరుగుతున్న వింతపోకడలన్నిటినీ కంపెరెటివ్ గా అనలైజ్ చేసి- Wael Hallaq, చెప్పింది ఏమిటంటే – “ప్రస్తుత సోకాల్డ్ ఆధునిక దేశాల్లో కంటే, ఇస్లామిక్ షరియా అమలులో ఉన్నదేశాల్లో ఒక మైనారిటీగా బతకడం వెయ్యిరెట్లు మేలు”- అని. అఫ్కోర్స్ ఇది చాలా మందికి మింగుడుపడకపోవచ్చు గానీ, ఎందుకలా అన్నాడనే విషయాన్ని ఆయన తన పుస్తకాల్లోనే వివరించాడు. Wael Hallaq రచనలు ఏ విధంగా తమ ఆలోచనల్ని మార్చాయో Tom Facchine, Paul Williams – లు డీటైల్డ్ గా డిస్కస్ చేసిన వీడియోలు కూడా యూటూబ్ లో ఉన్నాయి.

www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.