అవును.. వాళ్ళు బాంబులు పేల్చారు!!

ఈ విషయం గురించి రాయాలంటే చాంతాడంత రాయొచ్చు. కానీ, ఏదైనా ఉపయోగముంటుందా అనేది ప్రశ్న. ఓ పక్క వివిధ ప్రభుత్వ సంస్థలు, మెయిన్ స్ట్రీమ్ మీడియా, సినిమాలూ, టీవీలూ, చివరికి జబర్దస్త్ లాంటి కామెడీ ప్రోగ్రామ్ లు కూడా, “టెర్రరిజం అంటే ఆ మతమే”, “టెర్రరిస్టులంటే వాళ్ళే” అనే బ్రెయిన్ వాష్ ప్రాపగాండాని సమాజంలో యుద్దప్రాతిపదకన Day in Day Out ప్రాపగేట్ చేస్తున్నప్పుడు, కొందరు వ్యక్తులు ఎన్ని వ్యాసాలు రాస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది..?

ఈ దేశంలో చెడ్డీగాల్ల అకృత్యాల గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎప్పటికీ రాదు. అలాగని, అదేమంత నిఘూడమైన విషయమూ కాదు. నిజాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే, ఓ అరగంట గూగుల్ సెర్చ్ చేస్తే ఎవరు ఏ విషయామైనా ఈజీగానే తెలుసుకోవచ్చు. కాకపోతే, బానిసత్వానికి అలవాటుపడిన వారికి నిజాలపై అంతగా ఇంట్రెస్ట్ ఉండదు.

ఆ బానిసత్వంలో నుండీ బయటకు వచ్చిన ఓ వ్యక్తి ఏమంటున్నాడో ఈ కింది లింక్స్ లో చదవవచ్చు.

https://scroll.in/article/1031927/they-are-polarising-india-ex-rss-worker-on-why-he-filed-affidavit-claiming-vhp-rss-set-off-bombs

https://thewire.in/communalism/rss-worker-affidavit-right-wing-leaders-involved-maharashtra-blasts

ఇలా అనేక సంవత్సరాలు అందులో పని చేసి, చివరికి తమ అంతరాత్మ ఒప్పుకోక బయటికి వచ్చి, దానిమీద పుస్తకాలు రాసినవారు కూడా చాలామంది ఉన్నారు.
అలాంటి మరిన్ని లింక్స్ ఇక్కడ –

బ్రాడర్ కాంటెక్ట్స్ లో చూస్తే –

కుక్కను చంపాలనుకున్నప్పుడు, దానికి పిచ్చి ఉందని ప్రచారం చేయాలి – అనే విషయం అందరికీ తెలిసిందే.

ముస్లింలను, ఇస్లాం నీ కౄరులుగా ప్రొజెక్ట్ చేయడం, పాలస్తీనాని అన్యాయంగా ఆక్రమించిన/ఆక్రమిస్తున్న ఇజ్రాయెల్-యూదు లాబీకి చాలా అవసరం.
ముస్లింలను, ఇస్లాం నీ కౄరులుగా ప్రొజెక్ట్ చేయడం – తమమాట వినని గల్ఫ్ దేశాలపై యుద్ధం ప్రకటించి, ఆ దేశాలని నాశనం చేసి, అక్కడి పాలకుల్ని తమ చెప్పుచేతుల్లో ఉంచుకుని, అక్కడి చమురు సంపదను కొల్లగొట్టే నాటో దేశాలకు కూడా చాలా అవసరం.
ముస్లింలను, ఇస్లాం నీ కౄరులుగా ప్రొజెక్ట్ చేయడం – ఎన్నికలను గెలవడానికి బీజేపీ లాంటి పార్టీలకు చాలా అవసరం.

మొత్తానికి, “ముస్లింలను, ఇస్లాం నీ కౄరులుగా ప్రొజెక్ట్ చేయడం” అనేది, ఇంతమందికి ఇన్ని రకాలుగా అవసరం. అందుకే అది ప్రపంచవ్యాప్తంగా, అప్రతిహంగా కొనసాగుతుంది.
ఈ న్యారేషన్ కి కౌంటర్ ఫ్యాక్ట్స్ ఎప్పటికీ హైలైట్ అవ్వవు. కానీ, ఆబ్జెక్టివ్ అనలసిస్ చేయగల కెపాసిటీ ఉన్నోల్లు నిజానిజాల్ని శోధించి తెలుసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published.