ఆలోచించేవారికి….

విలియం షేక్స్పియర్ – పరిచయం అవసరం లేని పేరు. 1564-1616 మధ్య కాలంలో జీవించిన షేక్స్పియర్ రచనల్లో ఒకానొక పాపులర్ రచన – కింగ్ డమ్ ఆఫ్ బీస్(Kingdom of Bees) అనేది. తేనెటీగల గురించి వివరిస్తూ, ఇండైరెక్ట్ గా మానవ సమాజ నిర్మానంతో తేనెటిగల జీవితానికి గల సారూప్యతల్ని వివరిస్తుందీ కవిత. తేనెటీగల్లో జరిగే పనివిభజననూ, హైరార్కియల్ స్ట్రక్చర్ నీ చక్కగా వివరిస్తుంది. కాకపోతే, ఈ కవితలో ఒక టెక్నికల్ ఎర్రర్ ఉంది – అది – తేనె తెట్టుకు ఒక రాజు ఉంటాడనీ, అన్ని ఈగలూ ఆ కింగ్-బీ అదుపాగ్నల్లో పనిచేస్తుంటాయనీ రాశాడు. తేనెటీగలు ఆర్థోపోడా వర్గానికి చెందినవి. ఈ వర్గం జీవుల్లో, పై,పైన చూడ్డానికి స్త్రీ-పురుష జీవులు ఒకేరకమైన శారీరక నిర్మాణాన్ని కలిగిఉంటాయి. అంటే, ఓ జీవిని అలా కళ్ళతో చూసి, అది ఆడదో,మగదో చెప్పడం సాధ్యం కాదు.

మైక్రోస్కోప్ టెక్నాలజీ డెవెలప్ అయ్యాక – తేనె తెట్టుల చుట్టూ వివిధ కెమెరాల్ని అమర్చి, రోజులతరబడి వచ్చిన వీడియో ఫూటేజ్లను అనలైజ్ చేసీ – పరిశోధకులు తేల్చిన విషయమేమంటే – తేనె తెట్టు కు అధిపతి – కింగ్-బీ కాదు, క్వీన్-బీ అని. అట్లే, ఆ తేనె తెట్టు నిర్మాణం, తేనె సేకరణ, ఇవన్నీ ఆడ తేనె టీగలు మాత్రమే చేస్తాయి. ఈ పనుల్లో మగతేనెటిగ రోల్ ఏమీ ఉండదు. కేవలం క్వీన్-బీ తో సంపర్కం చేయడం మాత్రమే మగ తేనేటీగ పని. షేక్స్పియర్ కాలానికి ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి, సాధారణంగా ఏదైనా, నిర్మాణం,పరిపాలన వంటి విషయాలు మగాల్లే చేస్తుంటారు కాబట్టి – షేక్స్పియర్ క్యాజువల్గా కింగ్-బీ అని వాడి ఉంటారనుకోవచ్చు. ఇప్పుడు షేక్స్పియర్ కంటే, ఇంకో 1000 ఏళ్ళు వెనక్కి వెల్దాం. అరబిక్ ల్యాంగ్వేజ్ లో ప్రతి వెర్బ్ కీ లింగ స్వభావం ఉంది. తెలుగులో కూడా కొంతవరకూ ఉంటుంది. ఉదాహరణకు : తాగింది/తాగాడు, వచ్చింది/వచ్చాడు లాంటి పదాల్ని బట్టి అది స్త్రీ గురించి మాట్లాడుతుందో,పురుషుడి గురించి మాట్లాడుతుందో చెప్పేయొచ్చు. అరబిక్ లో కూడా, ఇలా దాదాపు ప్రతి పదానికి మేల్/ఫిమేల్ ఫామ్‌స్ ఉంటాయి. డీఫాల్ట్ ఫామ్ మాత్రం మస్కులినే. అరబిక్ లో తేనెటీగను నహ్ల్ అంటారు. “సురాహ్ నహ్ల్” అనే టైటిల్ తో ఖురాన్ లో ఒక చాప్టర్ ఉంది. దీనిలో రెండు వాక్యాలు డైరెక్ట్ గా తేనెటీగల గురించి ఉన్నాయి. And your Lord inspired to the bee, “Take for yourself among the mountains, houses, and among the trees and [in] that which they construct. 16:68Then eat from all the fruits and follow the ways of your Lord laid down [for you].” There emerges from their bellies a drink, varying in colors, in which there is healing for people. Indeed in that is a sign for a people who give thought.16:69 దీన్లో తేనెటీగలకు సంబంధించిన 4 words – Construct, eat, follow, bellies – వీటన్నిటికీ స్త్రీలంగ పదాలు వాడబడ్డాయి. ( ittakhidi, kuli , fausluki, butuniha) .తేనె తుట్ట లోని గడుల నిర్మాణం – హెక్సగనల్(షడ్భుజి) ఆకారంలో ఉంటుంది. ఒక్కో గడి, ఒక్కో షడ్భుజి ఆకారంలో ఉంటుంది. ఈ గడుల్ని తేనెటీగలు ప్రొడ్యూజ్ చేసే వ్యాక్స్ ఆధారంగా నిర్మించబడతాయి. దీనివెనకో సైంటిఫిక్ స్టడీ జరిగింది. వృత్తం,త్రిభుజం,చతురస్రం – వంటి అన్ని ఆకారాలకన్నా , ఒక ఏరియాని షడ్భుజులుగా విడదీస్తే, అతి తక్కువ వ్యాక్స్ ని ఉపయోగించి, అత్యధిక షడ్భుజుల్ని క్రియేట్ చేయొచ్చు. దీనిని Honeycomb conjecture Theory అంటారు. ఈ విషయం తేనెటీగలకు ఎలా తెలుసనేది ఎవరిదగ్గరా సమాధానం లేని ప్రశ్న.. ఎవొల్యూషనిస్టులు దీనిని సింపుల్ గా ‘Instinctive behavior’ అని తేల్చేశారు. అలాగే, తేనెటీగలు ప్రయాణిస్తూ, గాలిలో వృత్తాకార గింగురాలు తిరగడం వెనక కూడా, ఓ రకమైన ప్యాటర్న్ ఉంటుందని మాడరన్ స్టడీస్ నిర్ధారించాయి. వీటినే ఖురాన్ “your Lord inspired to the bee”, “follow the ways of your Lord” అని వ్యాఖ్యానిస్తుంది. ఆడ తేనెటీగల్లో 16 జతల క్రోమోజోములు ఉంటాయి. మగ తేనెటీగల్లో 16 క్రోమోజోములుంటాయి. ఖురాన్ లో మొత్తం 114 చాప్టర్స్ ఉన్నాయి. వాటిలో సూరా నహ్ల్ ఎన్నో చాప్టరో గెస్ చేయండి. ఈ చాప్టర్ నంబర్ కూడా 14 శతాబ్ధాలకు ముందే, మహమ్మద్ ప్రవక్త(pbh) నిర్ధారించారు. ఇవన్నీ కేవలం కాకతాలీయంగా, యాక్సిడెంటల్గా మ్యాచ్ అయిన విషయాలు మాత్రమే తప్ప, దీన్లో పెద్దగా వింతేమీ లేదని ఎవరైనా అనొచ్చు. అలాంటి వారితో ఆర్గ్యూ చేయడానికేమీ లేదు. కాకపోతే ఖురాన్ లో ఇలాంటి ‘యాక్సిడెంటల్’ విషయాలు చాలా ఉన్నాయి. -“Indeed in that is a sign for a people who give thought.”

Leave a Reply

Your email address will not be published.