ఇల్లివ్వని ఓనర్లందరికీ థ్యాంక్స్!!

సెలెబ్రేషన్స్ ఆర్ ఇన్  ఏఇర్ “(Celebrations are in the Air)  –గాలిలో సెలెబ్రేషన్స్ ఉంటాయా?  రంజాన్నెల రాత్రుల్లో  సారి టోలిచౌకి కి రండి.ఇక్కడి గాలిలో సెలెబ్రేషన్స్ కనిపిస్తాయి.

 ఏరియా సంవత్సరంలో 11 నెలలూమిగతా ప్రాంతాల్లాగనే మామూలుగాఉంటుందిరంజాన్ నెల రాగానే ఇక్కడివెలుతురు నిద్దరోయిచీకటి కొత్తవెలుగుల్ని సంతరించుకుంటుందిఇక్కడిజనజీవనం మొత్తం పగటి జీవనం నుండిరాత్రి జీవనానికి షిఫ్ట్ అవుతుంది.హోటల్లుఅంగల్లు అన్నీ రాత్రంతాపనిచేస్తుంటాయిపగలు మాత్రం విశ్రాంతితీసుకుంటాయిఉపవాసాలుండే ఇక్కడిముస్లింలలాగే.

టోలిచౌకి ఫ్లై ఓవర్ కిందదానికి అడ్డంగాదాదాపు 3 కిమీ లు ఉన్న 7 టూంబ్స్హకీం పేట్ రోడ్ లోని షాపులన్నీ డెకరేషన్లైట్ లతోఅక్కడక్కడా ఖవ్వాలీపాటలతో కొత్త శోభనుసంతరించుకుంటాయిఉదయం నుండీ5.30PM వరకూ స్తబ్దుగా ఉన్న రోడ్లన్నీ,అసర్ నమాజు తర్వాతఇఫ్తార్ కికావలసిన తినుబండారాలు కొనడానికిబయటికి వచ్చిన జనాలతోకొద్దినిమిషాల్లోనే కిక్కిరిసి పోతాయివీరికోసంమిర్చి బజ్జీలుదహి వడాచికెన్ రోల్స్,సమోసా వంటివి అప్పటికప్పుడు ఫ్రెష్ గాతయారు చేసి అమ్మే తోపుడుబండ్లు,టెంట్లుహలీం బట్టీలు రోడ్డుకుఇరువైపులా రంజాన్ నెలలో ప్రత్యక్షమవుతాయిఇఫ్తార్ కి అరగంట ముందుచూడాలి ఇక్కడి హడావుడిపుట్టలోనుండీ బయటికి వచ్చిన చీమల్లాగాటూవీలర్లపై బయటికి వచ్చిన పురుషులు,మగపిల్లల అందరి టార్గెట్ ఒక్కటే –ఇఫ్తార్సైరన్ మోగక ముందేకావలసినతినుబండారాలు తీసుకుని ఇల్లుచేరుకోవాలివీరి రాకకోసంపొద్దున్నుండీఉపవాసం ఉన్న భార్య/అమ్మ/వదిన/అక్కాచెల్లెల్లు/ఆడ కూతుర్లు ఇంట్లో వెయిటింగ్ కదా – అందుకని.  

ఇక ఇఫ్తార్ సమయానికి మసీదుకి వెళ్ళీనపురుషులకి రకరకాలపండ్లు,తినుబండారాలు పేపర్ ఫ్లేట్ లలోఅందిస్తారుఅవన్నీ పుణ్యం కోసం ఎవరోఒకరు పంచి పెట్టినవిఎవరు ఇచ్చారనేది,ఇచ్చినవారెవరూ చెప్పరుఎవరూ విషయాన్ని పట్టించుకోరుఅట్లేఅక్కడఇది నీ ప్లేటుఇది నా ప్లేటు అనేపట్టింపులేమీ ఉండవుఎవరు ఎవరి ప్లేట్నుండీ అయినా కావలసినవి తీసుకునితింటుంటారుపక్కోల్లు మన ప్లేట్ నుండీతీసుకోవడం అఫెన్సివ్ కాదు కదాఅదొకప్రివిలేజ్ గా ఫీల్ అవుతారుఎందుకంటే –ఉపవాసి నోటికి  చిన్న ఖర్జూరం పండుఅందించినా ఎంతో పుణ్యందక్కుతుందని ప్రవక్త చెప్పి ఉన్నారు కాబట్టి.

ఇక ఇఫ్తార్ తర్వాత కాసేపు విశ్రాంతితీసుకున్నాకరాత్రి నమాజ్ – ఇషా,తరావీలు ఉంటాయిఇది 10-11PM  గంటలకు పూర్తవుతుందిఅక్కడి నుండీస్త్రీల పని మొదలవుతుందిమరుసటిరోజుతెల్లవారు ఝామున తినే సహరీ వంట వండే కార్యక్రమంమొదలవుతుంది వంట కార్యక్రమంపూర్తవగానే  , మహిళలుతమచుట్టుపక్కల ఇల్లల్లోని ఇతర మహిళల్తోకలిసి షాపింగ్ కు బయలు దేరుతారు.ఇక్కడి దుబాయ్ మార్కెట్ స్త్రీల,పిల్లలషాపింగ్ కి పెట్టింది పేరురంగురంగుల,రకారకాల డిజైన్ల బట్టలుడ్రెస్మెటీరియల్లుఅదో ప్రత్యేక ప్రపంచం,మహిళల ప్రపంచం షాపులన్నీ రాత్రి1, 2 వరకూ కూడా మహిళా కష్టమర్లతోకిక్కిరిసి ఉంటాయిఅంతమందిమహిళలు అర్థరాత్రి వేల తిరుగుతున్నా,ఎక్కడా ఈవ్ టీజింగ్ లు గానీమహిళల్నికామెంట్లు చేయడం గానీ ఉండదుఅసలు ఒక్కరంటే ఒక్కరు కూడా పోలీసుఇక్కడ కనిపించరు

ఇక్కడి హోటల్లలో రుమాన్షాగోస్,మందార్ లాంటి అనేక హోటల్లు రాత్రంతాతెరిచే ఉంటాయి రాత్రుల్లల్లో రోడ్లపైఇరానీ చాయ్ తాగుతూనస్రత్ ఫతే అలీఖాన్ ఖవ్వాలీఆతిఫ్ అస్లం – తాజ్ దారేహరం లాంటి పాటలు వినడం –అనుభవించినోల్లకే అర్థమవుతాయి.

 అధ్బుత జీవన సౌందర్యం నాకుపరిచయమై ఇప్పటికి ఇది మూడవసంవత్సరంనిజానికి బీటెక్ తర్వాత2004లోనే హైదరాబాద్ లోవాలినప్పటికీబ్యాచిలర్ గా మాధాపూర్లోఉన్న మొదటి ఐదేల్లూ దీని గురించితెలీలేదుతరువాత పెళ్ళి అయ్యాకమాఆవిడ ఆఫీసుకు దగ్గర్లో ఉండాలనితార్నాకకి మారాముఅక్కడ ముస్లింలుతక్కువ కాబట్టి అప్పుడూ దీని గురించితెలీలేదుఇక మూడేల్ల క్రితం ఆఫీసుమారడంతోకోఠీసుల్తాన్ బజార్,నారాయణ గూడ లాంటి ప్రాంతాల్లో అద్దెఇల్లు  వెతకడం  తో అసలు కథమొదలైందినా ఫేస్ చూసినా తెలుగువినీముస్లిం అయ్యుండొచ్చనేఅణుమానం రాకపోవడంతో,ఇల్లివ్వడానికి ఒప్పుకున్న ఓనర్లకునాపేరు వినగానే –బామ్మర్ది వేరే వారికిమాటిచ్చిన సంగతివాల్లావిడ వేరే వారిదగ్గర ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్న సంగతీగుర్తొచ్చేవికొందరైతే డైరెక్ట్ గా ‘ముస్లింలకుఇవ్వమని ‘ ఎలాంటి మొహమాటంలేకుండా మొఖం మీదే చెప్పేవారు.తార్నాకలోఆంధ్రా,తెలంగాణాలోని ఇతర జిల్లాలనుండీ సిటీకొచ్చి సెటిలైనవారే ఎక్కువవారిలో ఒకరు కాకపోతే,ఒకరైనా ముస్లింలని తెలిసినాఇల్లిచ్చేవారుకానీనారాయన్ గూడా,కోఠీసుల్తాన్ బజార్చిక్కడ్ పల్లి లాంటిచోట్ల మార్వాడీలునార్త్ నుండీ వచ్చినవారు ఎక్కువ ఏరియాల్లో ఆర్ ఎస్ఎస్ ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉండటంకాకతాలీయం కాదుఅక్కడి ముస్లింద్వేషం  స్థాయిలో ఉందో చూశాక,  ఏరియాల్లో ఇల్లు వెతికే ప్రయత్నాల్నివిరమించుకున్నానుఅలాంటి ఏరియాల్లోకెళ్ళి బిక్కుబిక్కు మంటూ ఉండే కంటే,ముస్లింలు ఎక్కువగా ఉండే ఏరియాల్లోకేవెళ్ళడం ఉత్తమం అని అప్పుడేఅర్థమైందిఅలా టోలిచొకి లోకిల్యాండయ్యాంఇక్కడ ఇల్లువెతికేటప్పుడుదాదాపు ప్రతి ఇంటి మీద,అపార్ట్మెంట్ మీద ఇంతింత పెద్ద అక్షరాల్తోరాసిన అరబిక్ అక్షరాలు చూడగానే ఏదోతెలీని హాయిగా అనిపించేదిఅప్పట్లోనాకు అరబిక్ చదవడంరాకపోయినప్పటికీబహుశా ఇంటిఓనర్  నా పేరు విన్నాకనాకు ఇళ్ళునిరాకరించే సమస్యే లేదనే భరోసా వల్లకావచ్చు

 

మొత్తానికి నాకు ఇల్లు అద్దెకివ్వడానికినిరాకరించిన ఓనర్లూ – మీకు చాలాథ్యాంక్స్ మీ వల్లే నాకు టోలీచౌకీ పరిచయం అయింది.

అందరికీ ఈద్ ముబారక్.

-మహమ్మద్ హనీఫ్.

www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.