Islam అండ్ Sex

“శారీరక కోర్కెలు చాలా నీచమైనవి. మానవుడు వాటిని త్యజించి పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా బతకాలి” – అని ఇస్లాం చెప్తుందనుకుంటే – మీరు ముద్దపప్పులో కాలేసినట్టే.నిజానికి, పురుషుడికి అత్యంత ఆకర్షనీయమైనది స్త్రీ యే నని ఖురాన్ నిర్ధారిస్తుంది.(అక్నాలెడ్జ్ చేస్తుంది) “పురుషుడు వాంఛించేవి – స్త్రీలు, కుమారులు, బంగారు సంపద, సారవంతమైన భూములు, మేలిమి గుర్రాలు( ప్రస్తుత కాలంలో కార్లు..?). ఇవన్నీ ఇహలోక సౌఖ్యాలు మాత్రమే.”ఖురాన్ 3:14, (ఇంచుమించు అనువాదం)లిస్ట్ లో మొట్ట మొదటిది – స్త్రీ. అందంగా ఉన్న స్త్రీ పట్ల ఆకర్షితులవ్వడం, వారితో శారీరకంగా ఇదవ్వాలని కోరుకోవడం – ఇవన్నీ పార్ట్ ఆఫ్ హ్యూమన్ డిజైన్. ఆ డిజైనర్ నుండీ వచ్చిన ఇస్లాం/ఖురాన్, మగాడి ఆ బేసిక్ ఫీచర్ ని తప్పుపట్టడమో, దానిని వదులుకుని, బ్రహ్మచారి లా బతకమనో చెప్పదు. బట్.. అయితే.. కానీ..


ఆ బేసిక్ ఫీచర్ ని, అటు స్త్రీకి గానీ, ఇటు పురుషుడికి గానీ, మొత్తంగా సమాజానికి గానీ నష్టం/ఇబ్బంది కలిగించని రీతిలో ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చో చెబుతుంది. పురుషున్ని, ఆ నచ్చిన స్త్రీ అవివాహిత అయితే, ఆమెకి కూడా అంగీకారం అయితే, ఆమె కోరినంత మెహర్ చెల్లించి, పెద్దల సమక్షంలో ఆమెని నికా( కాంట్రాక్ట్) చేసుకోమంటుంది. ఆమె అంతకు ముందే పెళ్ళి చేసుకుని విడాకులు తీసుకుని ఉన్నా, భర్త చనిపోయి ఉన్నా సరే, సేం రూల్.తరువాత, పడగ్గదిలో వారిద్దరూ ఏం చేసుకున్నా అది వారిష్టం. ఆమెను, ఆమెకు పుట్టబోయే సంతానాన్ని పూర్తిగా సమ్రక్షించాల్సిన బాధ్యత, వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత ఆ పురుషుడిదే. ఈ బాధ్యత తీర్చిన తర్వాత కూడా, సదరు పురుషుడి దగ్గర, ఇంకా టన్నులకొద్దీ ఒంట్లో ఓపిక/శక్తి, టైం, మరో కుటుంబాన్ని పోషించగలిగే ఆర్థిక వనరులు ఉంటే, అతను మరో స్త్రీ పట్ల ఆకర్షితుడైతే , అప్పుడు కూడా మళ్ళీ సేం ప్రాసెస్. – ఆమె అంగీకారం – కోరినంత మెహర్ – నికా – సమ్రక్షణ – కుటుంబ బాధ్యత. ఇక్కడ మొదటి కుటుంబానికి ఎలాంటి లోటు గానీ, మొదటి భార్యని ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం గానీ ఉండకూడదు. ఈ విషయం ఖురాన్ స్పష్టంగానే చెప్తుంది. “ఇద్దరికీ సమ న్యాయం చేయగలననుకుంటే రెండో పెళ్ళి, లేదంటే ఒక్క భార్యే నీకు ఉత్తమం” అని (ఖురాన్ 4:3) . ఈ రకంగా పురుషుడు, మ్యాగ్జిమం నాలుగు కుటుంబాల్ని కలిగి ఉండొచ్చు. ఒక్క కుటుంబాన్ని మెయింటెన్ చేసేటప్పటికే జీవితం సంకనాకిపోతున్న ఈ రోజుల్లో, నాలుగు కుటుంబాల్ని పోషించడం, ఏ దుబాయ్ రాజకుటుంబ సభ్యులకో తప్ప ఇతరులకి సాధ్యమయ్యేది కాదు. “రెండో కుటుంబాన్ని సాకేంత సీన్ లేదు కానీ, కోరిక మాత్రం యమా రేంజ్ లో ఉంది,ఇప్పుడు ఏంటి పరిస్థితి” అని కొందరడగొచ్చు. దీనికి షార్ట్ కట్ చిట్కాలేం లేవుగానీ, కొన్ని సూచనలు మాత్రం ఉన్నాయి. అవి – “పరస్త్రీని తేరిపార చూడకుండా, చూపుని కిందికి దించుకుమ్మని ఖురాన్ పురుషుల్ని ఆదేశిస్తుంది”. ( 24:30). రోజుకు ఐదు పూటలా నమాజ్, ఎక్కువ సేపు ప్రార్థనల్లో గడపడం, రంజాన్ లో మాత్రమే కాకుండా, మిగతా రోజుల్లో కూడా, అప్పుడప్పుడు ఉపవాసాలు, మితంగా తినడం – ఇలాంటివి.ఇలా కాకుండా, నికా చేసుకోకుండా పరస్త్రీలతో సంబంధాలు, రహస్య ఒప్పందాలు, చాట్ లలో గోకడాలు… ఇలాంటి వన్నీ ఇస్లాం లో నిషిద్దం. జడ్జిలనబడే కొందరు మానవమాత్రులు – ‘అబ్బే అవేమీ తప్పు కాదు’, అని తీర్పులిచ్చినప్పటికీ.”ఇవన్నీ సరేగానీ, పురుషులు ఒకే సమయంలో నలుగురేంది, మహిళలు మాత్రం ఒక్కరే ఏంది, ఇది స్త్రీలకు అన్యాయం కాదా, అణచేయడం కాదా, తొక్కేయ్యడం కాదా”, అని ఉద్దరిస్టులు కొందరు ఫీలవుతుంటారు. ఇలాంటి ఉద్దరిస్టులకు ఇప్పుడు బేసిక్ స్త్రీ-పురుష శరీర ధర్మశాస్త్రం వివరించడం అయ్యేపని కాదు, పైగా వారికి తెలీదనీ కాదు, కాకపోతే, అలా అడగడం ఆదర్శం అని వారిబ్రైన్లో ఫీడ్ ఐపోయి ఉండటం వల్ల అలా అడుగుతారు. వీరికి మరో జగమెరిగిన ఉద్దరిస్టు – చలం వ్యాఖ్యల్ని గుర్తుచేయడం అవసరం. చలం ఏమన్నాడంటే – “స్త్రీ ప్రేమ కోసం సెక్స్ ని వాడుకుంటుంది. పురుషుడు సెక్స్ కోసం ప్రేమని నటిస్తాడు” అని. అంటే ఏంటీ..? స్రీకి సెక్స్ కావాలి, కానీ, దానికంటే ముఖ్యంగా కావాల్సింది ప్రేమ(కేరింగ్, సమ్రక్షణ). ఇవి ఇవ్వడానికి ఒక్క పురుషుడు చాలు. అతను ఇవి ఇవ్వలేనప్పుడు, ఆమె నిరభ్యంతరంగా అతనికి విడాకులు ఇచ్చి మరో పెళ్ళి చేసుకోవచ్చని ఇస్లాం చెబుతుంది. అంతే తప్ప, పతియే దేవుడు, చచ్చేదాకా అతనితోనే ఉండాలనే టైపు భావజాలం ఇస్లాం లో లేదు.

“వాల్లకి నాలుగేంటీ, వీల్లకు ఒకటే ఏంటి” – అని అమాయకంగా అడిగే వారు, ఈ రిపోర్ట్ ని ఒకసారి చదవండి. https://pubmed.ncbi.nlm.nih.gov/25987056/ ఇది – అమెరికన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న, నేషనల్ సెంటర్ ఫర్ బయో టెక్నాలజీ ఇన్ ఫర్మేషన్ అనే సంస్థ వారు, 34 సంవత్సరాల పాటు, సెర్వికల్ క్యాన్సర్ బారిన పడ్డ మహిళల అధికారిక రికార్డుల్ని పరిశీలించి, వారి పర్సనల్ లైఫ్ స్టైల్ డాటాను అనలైజ్ చేసి తయారు చేసిన పరిశోధనా పత్రం. వాల్లు తేల్చింది ఏమిటంటే – ఒకరి కంటే ఎక్కువ మంది సెక్సువల్ పార్ట్నర్స్ ఉండటం, మహిళల్లో సెర్వికల్ క్యాన్సర్(గర్భాశయ క్యాన్సర్) కి దారితీస్తుంది అని. అఫ్కోర్స్ మీడియా ఇట్టాంటి వార్తల జోలికి అస్సలు వెళ్ళదు కాబట్టి, ఇలాంటి న్యూస్లు ఎక్కువమందికి తెలిసే అవకాశం ఉండదు, అది వేరే విషయం. ఇప్పుడు ఎమోషన్లో – ” ఏమిటీ అన్యాయం, ఒకరికంటే ఎక్కువమంది సెక్సువల్ పార్ట్నర్స్ ఉన్న మగాడికి సెర్వికల్ క్యాన్సర్ ఎందుకు రాదు, అని ఆవేశంగా అడిగే వారు కూడా ఉంటారు. చిట్టి బాబూ.. మగాల్లకు సెర్విక్స్ అనేది ఉండదు బాబూ అని చెబితే – ఏ.. ఎందుకుండదు.. స్త్రీలకు మాత్రమే ఎందుకుంటుంది, ఇదన్యాయం, మహిళల్ని తొక్కేయడమే, అని ఆపసోపాలు పడిపోతారు. మొత్తానికి చెప్పోచ్చేదేమంటే, ‘మహిళలు – పురుషులకంటే తక్కువ’ అనేది ఎంత మతిలేని వాదనో, ‘మహిళలు పురుషులతో సమానం’ అనేది కూడా, అంతే మతిలేని వాదన.

Leave a Reply

Your email address will not be published.