ఈ అన్నేదో చెప్తుండు.. జర ఇనుండ్రి

“దారుస్సలాం లో హాజరు వేయించుకుని, ఓ కుర్చీలో కూర్చుని, చక్క బల్ల ముందు వేసుకుని కార్పోరేటర్ కూర్చుంటాడు. ఎవ్వరొచ్చినా సరే, నేరుగా ఆయా ప్రాంతానికి సంబంధించిన కార్పోరేటర్ దగ్గరికి వెళ్ళాలి. అతని దగ్గరికెళ్ళి తమ కంప్లైంటు చెప్పిన తర్వాత, వారి సమక్షంలోనే కార్పోరేటర్, ఆ ఆఫీసర్ కి కాల్ చేస్తాడు. మొట్టమొదట వారి తల్లిగారిని స్మరించి(తేరె..మా –), క్యా బే.. అని మొదలు పెట్టి పని చేయిస్తాడు. ప్రతిరోజూ ఒంటిగంట వరకూ ఇది జరుగుతుంది. ఏ కార్పోరేటర్ ఐనా రాలేకపోతే, ముందుగా అనుమతి తీసుకోవాలి. ఏడుగురు యం.యల్.ఏలు,యం.యల్సీలు కూడా కూర్చుంటారక్కడ.ప్రతిరోజూ జరిగే దర్బార్ ఇది. రోజుకు కనీసం 700-800 మంది ప్రజలు తమ కంప్లైంట్లను తీసుకుని మజ్లిస్ దగ్గరకు వస్తుంటారు. ఆ కంప్లైంట్లకు సొల్యూషన్ వస్తుంది. ఆ కార్పోరేటర్లు సొల్యూషన్ వచ్చేలా చేస్తారు. ఒంటిగంటకు అందరూ కలిసి దారుస్సలాం లోనే ఉన్నటువంటి మసీదులోనే నమాజు చేస్తారు. ఆ సమస్యలపై వచ్చినవారు, వాటిని పరిష్కరించడానికి అక్కడున్న కార్పోరేటరు.. They do this everyday, on regular basis.. every day, they do.. నేనొక అరడజను సార్లు దారుస్సలాం కి వెళ్ళాను. ప్రతిసారీ నాకిదే దృశ్యం కనిపించింది. ముస్లిం మహిళలు దలిత,హిందూ మహిళల్ని వెంటపెట్టుకొచ్చి, కార్పోరేటర్, యం.యల్.ఏ లతో మాట్లాడించి వారి సమస్యల్ని పరిష్కరిస్తుంటారు. Can any party.. any so called secular, kuhana secular, జాతీయవాద, రాష్ట్రీయవాద,హిందూవాద.. any party do this? ఎవరైనా చేస్తున్నారా.. ఈ రకంగా. సో, MIM పార్టీని మతత్వత్వ పార్టీ అని తిట్టేదానికంటే ముందు, మనం MIM యొక్క వర్కింగ్ స్టైల్ ని కూడా అర్థం చేసుకోవాల. All their corporators are available to the common people, Thats why they are winning. “వీడియోలో ఇది చెప్పినాయన – రాకా సుధాకర్, సీనియర్ జర్నలిస్టు. నేను కూడా దారుస్సలాం కి వెళ్ళి ఉన్నా కాబట్టి, ఆయన చెప్పేదాన్లో అబద్ధం గానీ,అతిశయోక్తిగానీ లేదని నాకు తెలుసు. అణుమానమున్నోల్లు, ఓ సారి వెళ్ళి రండి. అదేమీ నల్లమల అడవుల్లో లేదు. నగరం నడిబొడ్డునే ఉంది. అలా వెళ్ళి స్వయంగా తెలుసుకోకుండా, ఇలా ఎవరైనా చెప్పే పాజిటివ్ విషయాలు నమ్మకుండా.. ఎంతసేపూ – “ముస్లింలు మతం చూసే ఓట్లేస్తారని మెజారిటీ అభిప్రాయం కాబట్టి, అలా నమ్మడమే/రాయడమే మాకు సమ్మగుంది అంటారా….” – అలాగే కానివ్వండి.

Video link of the speech –

Leave a Reply

Your email address will not be published.