ఎందుకు..?

మహమ్మద్ అలీ – వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ టైటిల్ గెలిచాడు. ఆ మరుసటి ఏడాది – వియత్నాం యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు. తాను ఎన్నో ఏళ్ళు ప్రాణం పెట్టి నేర్చుకున్న బాక్సింగ్ కెరీర్ వదులుకోవడానికీ,జైలుకెళ్ళడానికీ కూడా సిద్ధపడ్డాడు. ఎందుకు..? దానికి అతను చెప్పిన కారణం – నేను నమ్మిన ఇస్లాం, నా అంతరాత్మ – వియత్నాం ప్రజలపై బాంబులేయడానికి నన్ను అనుమతించదు.

ఖబీబ్ నొమగమదేవ్ – మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో వరసపెట్టి 29 మ్యాచులు గెలిచిన మొనగాడు. హఠాత్తుగా ఇకపై మ్యాచులు ఆడనని ప్రకటించాడు. కోట్లకొద్దీ ఆదాయాన్నీ, సెలబ్రిటీ స్టేటస్ లనూ తృణప్రాయంగా వదులుకున్నాడు.ఎందుకు..? అతను చెప్పిన కారణం – “నా తల్లికి మాటిచ్చాను. ఇస్లాం ప్రకారం, తల్లిదండ్రుల తర్వాతే ఏదైనా.”
***********
ఫ్రాంక్ రిబెరీ(ఫ్రాన్స్), మొహమ్మద్ సలాహ్(లివర్ పూల్) డయర్రాహ్(రియల్ మ్యాడ్రిడ్) , ష్కోడ్రన్(స్పెయిన్) + అనేక ఇతర ఫుట్బాల్ ఆటగాల్లు హాషీమ్ ఆమ్‌లా, అజార్ అలీ, రషీద్ ఖాన్, ఇమాద్ వసీమ్ + అనేక ఇతర క్రికెట్ ఆటగాల్లు – ఫిరోజ్(ఎస్సెక్స్, యూకే), ఎనెస్ కాంటర్(అమెరికా), తారిక్ అబ్దుల్ వహాద్(ఫ్రాన్స్) + బాస్కెట్ బాల్ ఆటగాల్లు ఇలాంటి అనేక ఆటగాల్లు – తాము ఆల్కహాల్, గ్యాంబ్లింగ్ బ్రాండ్ల లోగోలున్న దుస్తుల్ని ధరించమని తెగేసి చెప్పారు. కోట్లాది డాలర్ల సంపాదననూ వదులుకున్నారు, కొన్ని సార్లు టీమ్ లో స్థానాన్ని కూడా రిస్కులో పెట్టుకున్నారు. ఎందుకు..?వీరు చెప్పిన కారణం – ఆల్కహాల్,జూదం లాంటి తీసుకోవడం అటుంచి, వాటిని ఇతరులకు ప్రమోట్ చేయడం కూడా తప్పనే తమ ఇస్లాం మత బోధనలవల్ల.
**********
వీరు కాక.. ఇస్లాం కారణంగానే తాము ఉన్నత నైతిక విలువల్నీ, సత్ప్రవర్తననూ కలిగిఉన్నామని సాధారణ ముస్లింలు నిరూపించించిన దృష్టాంతాలు అడపాదడపా మిడియాలో ఏదో ఓ మూల వస్తూనే ఉంటాయి. ఇవన్నీ చదివి – ముస్లింలందరూ మంచోల్లనిగానీ, ఇస్లాం ఎంత మంచిదో/గొప్పదో చూశారా, అని గానీ జనరలైజ్డ్ స్టేట్మెంట్లు ఎవరూ ఇవ్వరు.
***********
అదే ఓ ముస్లిం పేరున్నోడెవడైనా, ఏదైనా చెడ్డపని చేస్తేమాత్రం – ముస్లింలందరూ ఇలా ఎందుకుంటారు, ఇస్లాం ఇదీ,ఇస్లాం అదీ అనే పోస్ట్లు,కామెంట్లు తెగరాసేస్తారు. ఇలా రాసేది సంఘీయులో, రైటిస్టులో మాత్రమే కాదు, వీరిని విమర్శించే సో కాల్డ్ తటస్థ విష్లేశకులు కూడా. ఎందుకంటారూ..?

Leave a Reply

Your email address will not be published.