చంద్రబాబూ.. ఐ యామ్ విత్ యు!!

చంద్రబాబూ.. ఐ యామ్ విత్ యు!!
=========================

“ఓ సిట్టింగ్ సీబీఐ జడ్జి, మరో ఇద్దరు జడ్జిలు అణుమానాస్పదంగా చనిపోతే అడిగే దిక్కులేదు.”

“ఎన్నికల్లో 20 MLA స్థానలు గెలిచిన పార్టీని పక్కన పెట్టి, 2 MLAలున్న పార్టీని గవర్నరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తాడు. చివరికి ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ”

“ఢిల్లీ ఆప్ MLAల్లో దాదాపు ముప్పావు వంతు వారిపై ఏదో ఓ అడ్డమైన కేసులు, పోలీసులు ఆఘమేఘాల మీద వారిని అరెస్టు కూడా చేసి కోర్టుకు తీసుకెల్లడం, అక్కడ కోర్టు, ఏ మాత్రం ఆధారాల్లేకుండా ఎందుకు అరెస్టు చేశారని పోలీసుల్ని తిట్టడం.”

“తమిల్ నాడు రాష్ట్ర పోలీసులకు, కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండా, ఆ రాష్ట్ర Chief SecreTary(CS) పై, అర్థరాత్రి సీబీఐ దాడులు, అరెస్టులు”

” ప్రధాన మంత్రి నాలుగేళ్ళలో, కనీసం, ఒక్కటంటే, ఒక్కటైనా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయకపోవడం.”

“పార్లమెంట్ సాక్షిగా, ప్రధాన మంత్రీ, ఇతర మంత్రులూ, నోటికొచ్చిన అడ్డమైన అబద్ధాలూ మాట్లాడటం.”

చెప్పుకుంటూపోతే, ఈ లిస్టు చాంతాడంత ఉంది. ఇవన్నీ ఓ నాలుగేళ్ళ ముందు వరకూ , కనీసం ఊహకు కూడా అందని విషయాలు. కానీ ఇప్పుడు మాత్రం నిలువెత్తు నిజాలు.

ఎందువల్ల..?

మోడీ- అమిత్ షా!!!.

వీరికి నీతి,న్యాయం, చట్టం, రాజ్యాంగం,కోర్టులు లాంటివి టిష్యూ పేపర్లతో సమానం. ఇంకా తక్కువేనేమో.

వీరు ఫాలో అయ్యేది క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. మాకు అనుకూలంగా ఉంటే – క్యారెట్. లేదంటే -స్టిక్.( బెత్తం). అంతే. అదొక్కటే పాలసీ ఇప్పుడు దేశాన్ని నడిపిస్తుంది.

దీనిని అర్థం చేసుకోలేకపోవడానికి చంద్రబాబు చిన్నాపిల్లోడు కాదు.

స్పెషల్ స్టేటస్ ఇస్తారా, ఇవ్వరా అని నిలదీస్తే, వారు ఠపీ మని ఇవ్వమనే చెప్తారు. ఎందుకంటే, ఇస్తే వారికొచ్చే ప్రయోజనం ఏమీ లేదుకాబట్టి. అప్పుడు CBN దగ్గర ఏం ఆప్షన్స్ ఉన్నాయి. ఈయన MPల అవసరం వారికి లేదు. కాబట్టి వారితో తెగదెంపులు చేసుకుని బయటికి వచ్చిన మరుక్షణం ఏమవుతుందో CBN కి బాగా తెలుసు. రేవంత్ రెడ్డి ఆడియో క్యాసెట్లు ఎలాగూ ఉండనే ఉన్నాయి. అసలు అవి లేకున్నా, మోడీ-షాలు బెత్తానికి పని చెప్పాలనుకుంటే అపేవారెవరూ లేరు.

ఇవన్నీ ఆలోచించే CBN సైలెంటైపోయుంటారు. అసలే పదేళ్ళతర్వాత అధికారం వచ్చింది. క్యాడర్ కి ఆస్తులు సమకూర్చిపెట్టాల్సిన బాధ్యత, రాబోయే ఎన్నికలకు నిధులు సమకూర్చుకోవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇచ్చిన ప్యాకేజీ తో అడ్జస్ట్ అవడమే మంచిదనుకున్నారు. అదే చేశారు.

ఇక , ఇప్పుడు మరో సం. లో ఎన్నికలకు వెల్లాలి కాబట్టి, దానికి తగ్గట్లు ప్లాన్ మార్చారు.

ఇప్పుడు CBN ప్లేస్ లో ఎవరున్నా, ఇలాగే చేసేవారు. అది జగన్ ఐనా,కేసీఆర్ ఐనా ఇంకెవరైనా. ఇప్పుడు తిట్టాలనుకుంటే, తిట్టాల్సింది – మోడీ-అమిత్ షాల దగుల్బాజీ రాజకీయాల్ని తప్ప, CBNని కాదు.

-మహమ్మద్ హనీఫ్.
3/8/2018

Leave a Reply

Your email address will not be published.