డార్విన్ కోతి కథల మరో కోణం!!

డార్విన్ కోతి కథల మరో కోణం!!
=======================
“నేను ఎక్కడి నుండి వచ్చాను, చావు ఎలా ఉంటుంది, చనిపోయాక ఏమవుతుంది, నా ఆధీనంలో లేకుండా జరిగే అనేక అంశాల వెనక ఇంకెవరైనా ఉన్నారా..” – ఇలాంటి అనుమానాలు ప్రతి మనిషి మస్తిష్కంలోనూ ఏదో ఓ సంధర్భంలో వస్తూనే వుంటాయి. వీటికి కొందరు తమకు తెలిసిన సమాధానాలతో తృప్తిపడతారు. కొందరు ఎప్పటికీ అన్వేషిస్తూనే ఉంటారు. కొందరు కొత్త వాదాల్ని/సమాధానాల్ని ప్రతిపాదిస్తారు. ఇలా మనిషి పుట్టుకకి కారణంగా, అప్పటిదాకా ఎవరికీ తట్టని ఓ కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చిన వ్యక్తి -చార్లెస్ డార్విన్.

ఇతను ప్రతిపాదించిన ప్రధాన సిద్ధాంతం – Origin of species by means of Natural selection. నిజానికి దీనికి అతను ఇంకో పేరు కూడా పెట్టాడు. అదేంటో చివర్లో చూద్దాం. ఈ సిద్ధాంతం ప్రకారం, ఈ భూమిమీద మనిషి మనిషిగా పుట్టింపబడలేదు. అతను కొన్ని లక్షల సంవత్సరాల పాటు జరిగిన ఎవొల్యూషన్ ఫలితంగానే ఇప్పటి రూపానికి వచ్చాడు. మనిషితో పాటు, ఇతర జీవరాశులన్నీ ఒక కామన్ పాయింట్ దగ్గర మొదలై, ఎవల్యూషన్లోని వివిధ దశల్లో పుట్టుకొచ్చినవే.

అమీబా మొదలుకొని, ప్రతిజీవీ తనను తాను ప్రత్యుత్పత్తి చేసుకుంటూ వెల్లింది. ఈ క్రమంలో కొన్ని జీవులు ప్రకృతికి నచ్చే కొన్ని లక్షణాలను పునికి పుచ్చుకున్నాయి. (లేదా) మంచి లక్షణాల్ని పునికుపుచ్చుకున్న కొన్ని జీవుల్ని ప్రకృతి ఆదరించి మిగతా జీవుల్ని అంతరింపజేసింది. దీనినే న్యాచురల్ సెలెక్షన్ అన్నాడు. ఇలా జీవులు నిరంతరం అనేక విధాలుగా పరిణామం చెందుతూ వచ్చాయి. ఇంకా చెందుతూనే ఉన్నాయి. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇదీ స్థూలంగా డార్విన్ సిద్ధాంతం. దీనికి ప్రూఫ్ లుగా, కొన్ని అస్తి పంజరాలు, శిలాజాలు, కోతి – ఏప్ – వంగి నడిచే మనుషుల బొమ్మలు,కోతీ-చింపాజీల ముఖాలు-ఆ పక్కనే పాపం ఆఫ్రికన్ మనుషుల ముఖాలూ-ఆ పై భాగంలో బ్రాడ్ పిట్ లాంటి వ్యక్తుల గుండ్రటి ముఖాలూ వేసిన బొమ్మలూ.. చూపిస్తారు.

దీని వల్ల దేవుడు, స్వర్గం, నరకం వంటి నమ్మకాల పునాదులు కదిలిపోయాయి. అంతరాత్మ, మానవత్వం వంటివి అర్థంలేని పదాలైపోయాయి. ఎందుకంటే మనిషికి, జంతువుకూ ఏ మాత్రం తేడా లేదు. మనిషి, జంతువు కంటే కొంచెం ఎక్కువ ఇవాల్వ్ అయ్యాడంతే. ఆదాం- ఈవ్ ల మత సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా యూరప్ సమాజం దీనిని ఆదరించింది.ఈ సిద్ధాంతాన్ని పాఠ్యపుస్తకాల్లో పొందుపరిచింది. ఇప్పుడు కూడా తమను తాము నాస్తికులుగా పిలుచుకునే అనేక మంది విశ్వాసాలకు మూలాధారం ఈ డార్విన్ సిద్ధాంతమే.

డార్విన్ సిద్ధాంతాన్ని పైపైన చదివిన వారికి ఇంత వరకూ మాత్రమే తెలిసే అవకాశం ఉంది. ఇంకొంచెం లోతుగా వెళ్ళి డార్విన్ చెప్పిన ఇతర అంశాల గురించి చూద్దాం.

“”the civilized races of man will almost certainly exterminate, and replace, the savage races throughout the world”. – ది డిసెంట్ ఆఫ్ మ్యాన్ అనే వ్యాసంలో డార్విన్ రాసిన వాక్యం ఇది.

Letter 13230: Darwin to Graham, William, 3 July 1881

“I could show fight on natural selection having done and doing more for the progress of civilization than you seem inclined to admit. Remember what risks the nations of Europe ran, not so many centuries ago of being overwhelmed by the Turks, and how ridiculous such an idea now is. The more civilised so-called Caucasian races have beaten the Turkish hollow in the struggle for existence. Looking to the world at no very distant date, what an endless number of the lower races will have been eliminated by the higher civilised races throughout the world.”

డార్విన్ తన మిత్రుడికి రాసిన ఉత్తరం లోని వాక్యాలు అవి. డార్విన చెప్పిన ఇలాంటి అనేక అంశాల ఆధారంగా ఒక విషయం తేటతెల్లమవుతుంది. అది – “మానవులందరూ సమానమే” అనే భావనకీ, డార్విన్ సిద్ధాంతానికి ఏ మాత్రమూ పొసగదు. డార్విన్ ప్రకారం, మానవజాతుల్లో కొన్ని ఉత్తమ జాతులు( బాగా పరిణామం చెందినవి), కొన్ని తక్కువు/నీచ జాతులు(అతను వాడిన పదం -సావేజ్ రేసెస్ ) అంటే, తక్కువ పరిణామం చెందినవి ఉంటాయి. వీటి మధ్య ప్రకృతి వనరులకోసం నిరంతరం ఘర్షణ జరుగుతుంటుంది. ఈ ఘర్షనలో అంతిమంగా ఉత్తమ జాతులే గెలుస్తాయి. మిగతావి అంతరిస్తాయి. దీనినే -‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ‘ అన్నాడు.

ఇలాంటి డార్విన్ ఆలోచనలన్నీ తదనంతరం ‘సోషల్ డార్వినిజం ‘ కి దారితీశాయి. దీనిలో ముఖ్యాంశాలు.
1. మానవులందరూ సమానం కాదు.
2. ఆత్మ, శరీరం అంటూ వేరువేరుగా లేవు. ఉన్నది శరీరం మాత్రమే. అతనిలోని డామినేంట్ ఇన్స్టింక్ట్సే ఎథిక్స్/నైతిక విలువలు గా సమాజంలో గుర్తింపబడ్డాయి.
3. జాతుల మధ్య వైరం అనేది అనివార్యం. కొన్ని జాతులు, ఇతర జాతులపై పడి దోచుకోవడం, వాటిని అణగ దొక్కడం చాలా సహజంగా జరిగే పరిణామం.
4. ఆఫ్రికన్ నీగ్రోకు, ఓ యూరోపియన్ కూ ఉండే సారూప్యత కంటే, ఆఫ్రికన్ నీగ్రోకూ, ఓ ఏప్ కూ ఉండే సారూప్యతే అధికం.

డార్విన్ బోధనల్లో, ప్రాచుర్యంలోకి రాని మరో ముఖ్య విషయం – అతను స్త్రీలను కూడా, పురుషుడి కన్నా తక్కువ స్థాయిలో పరిణామం చెందిన జీవిగా పేర్కొన్నాడు.
“The child, the female, and the senile white” all had the intellect and nature of the “grown up Negro” –Charles Darwin (1863:192)
Additional read – http://www.icr.org/article/darwins-teaching-womens-inferiority/
************

డార్విన్ కోతి సిద్ధంతాన్ని పైపైన చదువుకుని, నాస్తికులుగా తమను తాము డిక్లేర్ చేసుకున్నోల్లు చాలా మంది,-“ చూశారా మతం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో “ – అని తెగ ఫీలైపోతుంటారు. కానీ, ఈ సోషల్ డార్వినిజం మానవ జాతికి చేసిన హాని గురించి తెలుసుకుంటే, వీరు ఎప్పటికీ అలా మాట్లాడరు. హిట్లర్ నాజీయిజం, స్టాలినిజం , యూరోపియన్ కలనియనైజేషన్, ఆఫ్రికన్ నల్లజాతివారిని జంతువుల్లా పట్టి అమెరికా తీసుకెల్లడం… వీటన్నిటివెనకా డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో డార్విన్ ఆలోచనలున్నాయి.

క్యాపిటలిజం, మెటీరియలిజం, కన్స్యూమరిజం లు, మీడియా ఆధారంగా ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. స్వర్గం, నరకం, మతం అనే భావాలు వీటికి విరుద్ధం కాబట్టి, వీటిని నమ్మడాన్ని మూఢనమ్మకంగా మీడియా అస్తమానం గుర్తుచేస్తుంటుంది. పైగా, మతం అనే భావనని ఇస్లాం అత్యంత బలంగా వినిపిస్తుంది కాబట్టి , అది మీడియాకు ప్రస్తుతం బద్ధ శత్రువు. దీనిలో భాగంగానే డార్వినిజం సిద్ధాంతం యొక్క అవలక్షణాలు, మానవ జాతికి అది చేసిన ద్రోహం లాంటి అంశాలు ఎప్పుడూ చర్చకు రావు. కానీ ఈ అంశాలకు కనీసం తమకు తాము సమాధానం చెప్పుకోగలరేమో నాస్తిక మేధావులు ప్రశ్నించుకోవాలి.

“O mankind, We have created you from male and female, and have made you into nations and tribes, that you may know one another. Indeed the most honored of you in the sight of Allah is the most righteous – [Quran 49:13]”

నా వరకూ, మనుషులందరూ సమానమే అని నమ్మడానికి, పై ఖురాన్ వాక్యం ఒక్కటి చాలు.
అట్లే, “నేను డార్విన్ సిద్ధాంతాన్ని నమ్ముతాను కాబట్టి, మానవులందరూ సమానమే అనే కాన్సెప్ట్ ని ఒప్పుకోననే” వారితో కూడా ఎలాంటి పేచీ లేదు.
కానీ, నేను డార్విన్ సిద్ధాంతాన్ని నమ్ముతానంటూనే మళ్ళీ మనుషులందరూ సమానమేననే వారిని ఎలా అర్థం చేసుకోవాలి? వీరి కాన్ ఫిడెన్సుని చూస్తుంటే ముచ్చటేస్తుంటుంది.

*************
అన్నట్లు – డార్విన్ పుస్తకం -THE ORIGIN OF SPECIES కు మరో పేరు ఏంటో తెలుసా-
“The Preservation of Favoured Races in the Struggle for Life”.

SO, My Dear Darwinist , You ARE FROM WHICH FAVORED RACE..?

-మహమ్మద్ హనీఫ్.
12/23/2017

Leave a Reply

Your email address will not be published.