నిచ్చెన నిన్ను మోస్తుందా – నువ్వు నిచ్చెనని మోస్తున్నావా??

In Search of Purpose#5

నిచ్చెన నిన్ను మోస్తుందా – నువ్వు నిచ్చెనని మోస్తున్నావా??
============================

మాకు ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో Semiconductor Devices and Circuits(SDC) అని ఓ ల్యాబ్ ఉండేది. ఆ ల్యాబ్ డీల్ చేసేది శ్రీలక్ష్మీ మేడం. ఆమె ఈ పేరుతో కంటే ఓ Nick Nameతోనే అందరికీ పరిచయం.
అకడమిక్ ఇయర్లో మొదట్లోనే, ఈ Nick Name సీనియర్లనుండి జూనియర్లకు పాస్ ఆన్ అయిపోయేది. అప్పట్లో అందర్తో పాటు నేనూ చాలా సార్లు ఆ పదాన్నే వాడాను గానీ, ఇప్పుడు ఆలోచిస్తే, ఆ Nick Name, ఉమెన్ ఆబ్జెక్టిఫికేషన్ తప్ప మరొకటి కాదని అర్థమవ్తుంది. (అందుకే అది ఇక్కడరాయట్లేదు.)

ఇక విషయానికి వస్తే.. క్లాసులు ప్రారంభమైన మొదట్లో, లెక్చరర్లు రోల్ నంబర్లను కాకుండా పేర్లను పిలుస్తుంటారు. పేర్లను, ఫేసుల్ని గుర్తుపెట్టుకుంటే, తర్వాత ప్రాక్సీ అటెండెన్స్లను అరికట్టొచ్చని( ఒకరి రోల్ నంబర్లకు ఇంకొకరు ప్రెజెంట్ చెప్పడం) అలా చేస్తారు. అలా మా శ్రీ లక్ష్మీ మేడం కూడా, ఒక్కొక్క పేరునూ పిలిచి, ఆ ఫేసుల్ని తేరిపార చూస్తూ, ఇంటర్ ఎక్కడ, ఏ వూరినుండి వచ్చారు వంటి ప్రశ్నలు వేసింది.. నా వంతు రాగానే –
“మహమ్మద్ హనీఫా నా.. ఈ పేరు వెరైటీగా ఉందే, దీని అర్థమేంటి” – అని అడిగింది. ఇది అప్పటిదాకా ఎవరూ నన్ను అడగని ప్రశ్న.
నేను బ్లాంక్ ఫేసుతో – “తెలీదు మేడం” – అన్నాను.
“తెలీదా, కనీసం అది ఏ భాష పదమో తెలుసా?” – అంది.
-హిందీ గానీ, ఉర్దూ గానీ అయ్యుంటుంది – అన్నా..
“ఇంజనీరింగ్ చదువుతున్నావ్, కనీసం నీపేరు అర్థమేంటో అది ఏ భాషాపదమో కూడా తెలీదా. సిగ్గు లేదూ “.. అని తిట్టింది.
(కొన్ని తిట్లు కూడా బాగుంటాయి 😉 ).
“నెక్స్ట్ క్లాస్ కల్లా దాని అర్థమేమిటో కనుక్కో ” – మేడం ఆర్డర్ వేసింది.

ఆ ఏదో క్యాజువలా చెప్పింది, అంతగా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఏం అడుగుద్దిలే అనిపించిందిగానీ, కాకపోతే, నా పేరుకు కూడా నాకు అర్థం తెలీయకపోవడం నిజంగానే చాలా గిల్టీగా అనిపించింది. ఇప్పట్లోలా అప్పట్లో స్మార్ట్ ఫోన్లు లేవుగా..ఠపీ మని బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ని అడగడానికి.. కాబట్టి , ఆ సాయంత్రమే, అక్కడ దగ్గర్లో మసీదు ఎక్కడుందో కనుక్కుని అక్కడికి వెళ్ళి, నమాజ్ తర్వాత ఇమాం గారిని అడిగాను. – హనీఫ్ అంటే అర్థం ఏమిటని.

ఆయనకు బాగా నాలెడ్జ్ ఎక్కువున్నట్లుంది.
“హనఫీ స్కూల్ ఆఫ్ థాట్ గురించీ, మిగతా సాంప్రదాయాలకూ దీనికి ఉన్న తేడాలూ ఇలా ఓ ఐదు నిమిషాలపాటు ఏదో చెప్పాడు. నాకు ఒక్క ముక్కా అర్థం కాలేదు.
“అలాకాదు, నా పేరుకు అర్థం కనుక్కొమని మా మేడం చెప్పింది. ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటారు” – అని అడిగా.
ఆయన పైకి కిందికి ఓ చూపు చూసి – “హనీఫ్ అంటే – సచ్చా ఫాలోవర్( True Fallower), మహమ్మద్ హనీఫ్ అంటే – మహమ్మద్ ప్రవక్త యొక్క ఫాలోవర్ ” – అని చెప్పారు.

ఈ మాత్రం తెలిస్తే చాలు, పిచ్చెక్కిస్తా, అనుకుని అక్కడి నుండి వచ్చేశా.

నెక్స్ట్ క్లాసులో నా పేరు రాగానే, మేడం అడగనే అడిగింది- అర్థం కనుకున్నావా అని.
యెస్ మేడం – ” మహమ్మద్ హనీఫ్ అంటే, మహమ్మద్ ప్రవక్త యొక్క ఫాలోవర్ అని చెప్పా. ఏదో సాధించేసినట్లు.. ఎక్ష్ప్రెషన్ పెట్టి.

మరి ఫాలో అవ్తున్నావా? – ఇమ్మీడియట్ గా నెక్స్ట్ కొచెన్ వచ్చింది.
ఇది మల్లీ అనెక్స్పెక్టెడ్ కొశ్చెన్. దీనికి ఏమని సమాధానం ఇస్తే, ఆవిడ ఏం తిడుతుందో.. కాబట్టి, కాస్త డిప్లోమాటిక్ గా చెప్పాలనుకున్నా..

“కొంచెం, కొంచెం ఫాలో అవ్తున్నా” – అని చెప్పాను.

“ఏ, పూర్తిగా ఎందుకు కాదు” – మల్లీ ఇంకో ప్రశ్న.
“అంటే, అదీ.. ఆయనంటే పాత రోజుల్లో అలా, ఇప్పుడు అలా ఉండటం కష్టం కదా..” ఏదో గొనిగాను.

ఓ.కె. అని మేడం నెక్స్ట్ పేరు పిలవడంతో, నేను బతుకు జీవుడా అనుకున్నా..
============
గత పోస్టు లో రాసినట్లు, పేర్లతో పాటు మనకు చాలా ఐడెంటిటీలు కూడా ఆటొమ్యాటిక్ గా వచ్చేస్తాయి. వీటి ద్వారా మనకు స్పెసిఫిక్ గా ఎలాంటి కష్టం,నష్టం కలగనప్పుడు దానిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ముస్లిం ఐడెంటిటీ వల్ల ప్రాక్టికల్ గా కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని నష్టాలున్నాయి. నా జీవితకాలంలో ఇవి తొలగిపోతాయనే నమ్మకమేదీ కనుచూపుమేరలో కనిపించడంలేదు. అలాంటప్పుడు నేను ఆ ఐడెంటిటిని ఎందుకు క్యారీ చేయాలి. మిగతా వారు, మీ ఇస్లాం అలాంటిదంట కదా అంటే, ‘అబ్బే నేను మాత్రం అలాంటోన్ని కాను ‘ అని ఎందుకు సంజాయిషీలు ఇచ్చుకుంటూ బతకాలి. ఆ ఐడెంటిటీ, ఆ హిస్టరీ నిజంగానే అంత బ్యాడ్ అయితే, మళ్ళీ, వాళ్ళు నన్ను ఇలా అన్నారని ఎందుకు Crying Baby లా ఏడ్వాలి. ప్రభుత్వాఫీసులో ఓ ఫారం ఫిల్ చేసి, గెజిట్ లో పేరు మార్చుకుంటున్నట్లు చిన్న ప్రకటనొకటి ఇస్తే సరి. చుట్టూ ఉన్న ప్రపంచంతో జీవితమంతా ఫైట్ చేసే కంటే, ఇది వన్ టైం యాక్టివిటి కదా. పైగా ఈ గుదిబండను రేపు నా పిల్లలకి కూడా తగిలించి వారిని కూడా ఈ ఐడియాలజీకి ఎందుకు కట్టు బానిసల్ని చేయాలి? — ఆలోచనలు నిచ్చెన లాంటివి, నిచ్చెన మనం పైకి ఎక్కడానికి ఉపయోగపడాలి గానీ, మనం అస్తమానం నిచ్చెనని మన భుజాలపై మోయకూడదు.మనం పైకి ఎక్కడానికి పనికి రాదని తెలిసిపోయిన మరుక్షణం ఆ నిచ్చెనని వదిలించుకోవాలి తప్ప, నిన్న అది మనల్ని మోసింది కాబట్టి, ఈరోజు నేను దానిని మోస్తాననడం ఇంటెలిజెన్స్ అవదు. ఇవీ అప్పటి నా ఆలోచనలు.

చాలా మంది తమ ఐడెంటిటిలను భారంగా మోస్తూ ఉంటారు. ఎందుకంటే, ఈ ఐడెంటిటీని బ్రేక్ చేయడమంటే, కుటుంబ బంధాల్ని, అనేక సామాజిక విలువల్ని బ్రేక్ చేయడమే. మనం ఏదో సాధించేశామని ఫీలయ్ పోతున్న కొన్ని హోదాలు/గౌరవాల్ని పనంగా పెట్టడమే. అంత సాహసం ఎవరూ చేయరు. కానీ, ఆర్జీవీ’స్ ఇండివిడ్యూవలిజం కుటుంబ బంధాల్ని, సామాజిక విలువల్ని అస్సలు గుర్తించదు. హోదా, గౌరవం అనే పదాలకు ఇక్కడ స్థానం లేదు. దీని ప్రకారం కేవలం మనిషి( నువ్వు) మాత్రమే సెంట్రల్ ఆబ్జెక్ట్. నీకేమనిపిస్తే అది చెయ్, ఏది కన్వీనియెంట్ ఐతే అది ఫాలో ఐపో. అంతే.
మరి – సమాజం ఎలా నడవాలి., అంటే..?
నువ్వు ఒంటరిగా వచ్చావ్, ఒంటరిగానే పోతావ్. నీకు ముందు కూడా సమాజం ఉంది, నీ తర్వాత ఉన్నా, ఉండకపోయినా, అది నీకు ఇర్రెలవెంట్. అది చూడటానికి నువ్వెలాగూ ఉండవ్ కదా.
(వర్మ అతని భార్యకు విడాకులు ఇవ్వడం, కూతుర్ని కూడా కూతురిలా కాకుండా -‘ఇంకో వ్యక్తిలా చూడటం – ఇవన్నీ ఈ యాంగిల్ లో ఆలోచిస్తే అర్థమవుతాయి.)
**************************

INFORMED DECISION
==================
ఓ డెసిషన్ కి రావడానికి ముందు, మనం ఎంత ఇంఫర్మేషన్ ని, ఎలాంటి ఇంఫర్మేషన్ ని ప్రాసెస్/అనలైజ్ చేశామనేది ముఖ్యం. చుట్టూ ఉన్న సమాజం, ఇస్లాం గురించి అనేక జనరలైజేషన్స్ చేస్తుంది. నేనూ అవే జనలైజేషన్స్ ని ఎందుకు అడాప్ట్ చేసుకోవాలి. పైన చెప్పినట్లు, అసలు సొసైటీ అంటూ ఏదీ లేదుకదా, ఉన్నదల్లా, కొందరు వ్యక్తుల సమూహం మాత్రమే. అలాంటిది ఎవరో ఇతర వ్యక్తుల జనలైజేషన్స్ ని, నేను ఎందుకు ఓన్ చేసుకోవాలి. అప్పుడు ఇస్లాం గురించి నాకు నేనుగా ఓ కంక్లూజన్ కి రావాలంటే , అసలు నా దగ్గర దాని గురించి ఉన్న సమాచారం ఎంత, ఇవి తరువాతి ప్రశ్నలు. మొదట్లో చెప్పినట్లు. పాతికేల్లు వచ్చేవరకూ, నాకు నా ఇస్లామిక్ పేరుకున్న అర్థం కూడా తెలీదు. మరి ఈ లిమిటెడ్ ఇంఫర్మేషన్ తో ఓ అంచనాకు రావడం ఎలా సాధ్యం.

నేను ఇస్లాం గురించి తెలుసుకోవలసింది చాలా వుందని అప్పుడే అర్థం ఐంది. కానీ, తెలుసుకోవడం ఎలా. ఇస్లాం కి సెంట్రల్ ఫిగర్ మొహమ్మద్ ప్రవక్త. ఆయనెవరు, ఏం చేశారు, ఎలా జీవించారు, ఏం చెప్పారు. ఇవన్నీ తెలుసుకుంటే వ్యవహారం ఓ కొలిక్కివచ్చే అవకాశం ఉంది. కానీ, ఆ సమాచారం ఐనా ఎక్కడి నుండీ రాబట్టాలి. ఆయన గొప్పల్ని ముస్లింలు తన్మయత్వంతో చెప్తుంటారు. మహమ్మద్ ప్రవక్త గురించి వీరిని అడగడం అంటే- బిడ్డ గురించి తల్లిని అడగడమే. ఏ తల్లీ తన బిడ్డ గురించి చెడుగా చెప్పదు కదా. So, i started my search about prophet Muhammad, by reading the Researched Books of Non-Muslims. such as.. Lesley Hazleton(Agnostic Jew), Karen Armstrong(Catholic), Martin Lings( Christian converted to Islam later), Will write briefly about their works next..

Leave a Reply

Your email address will not be published.