మానవ చరిత్రలో గ్రేటెస్ట్ సైంటిస్ట్ లలో ఒకరిగా చెప్పుకునే వ్యక్తి – ఐజాక్ న్యూటన్.
ఇతను 1642-1727 మధ్య ఇంగ్లాండ్ లో జీవించాడు.
ఇవాలా రేపూ, కాలేజీ సదువులు వెలగబెట్టేవారిలో చాలా మంది మతమూ-సైన్సూ ఆపోజిట్ బైనరీలనే భ్రమల్లో బతుకుతూ, తమను తాము నాస్తికులుగా డిక్లేర్ చేసుకుని, మతాల్ని నమ్మేవారందరూ మూఢవిశ్వాస్తులనీ వీరు మాత్రం గ్ఞానోదయం కలిగిన అపరమేధావులనీ ఫీలవుతూ, ఫేస్బుక్కూ,ట్విటర్లలో తమ మిడిమిడి జ్ఞానాల్ని ప్రదర్శిస్తుంటారు.
గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పతగ్గ ఐజాక్ న్యూటన్ కూడా మతాన్ని అత్యంత ధృడంగా నమ్మే క్రైస్తవ విశ్వాసి అని తెలిస్తే వీరుఏమైపోతారో. ఆ.. ఏముంది లెండి- “మిగతా విషయాల్లో ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా- ఈ విషయంలో మాత్రం తామే న్యూటన్ కంటే ఎక్కువగా తెలివైనవాళ్ళం అని కవర్ చేసుకుంటారు”, కాబోలు.
సరే ఇక విషయానికి వస్తే, ‘న్యూటన్ మత విశ్వాసానికి సంబంధించిన చర్చ ఇప్పుడెందుకు ‘-అని ఎవరైనా అడగొచ్చు. దీనికి సమాధానం – Rob Lliffe అనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చరిత్ర పరిశోధకుడు రెండు దశాబ్ధాల పాటు రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసిన Priest of Nature: The Religious Worlds of Isaac Newton అనే పుస్తకం. దీనిలో న్యూటన్ దేవున్ని,ప్రవక్తల్ని,మరణానంతర జీవితాల్ని నమ్మే ధృఢమైన క్రైస్తవ విశ్వాసి అని ఆధారాలతో తేల్చేశాడు. దీనికి ఆధారాలు – న్యూటన్ రహస్యంగా రాసుకున్న డైరీలు, తన అత్యంత ఆప్తులతో చేసిన ప్రైవేటు చర్చలు,రాసుకున్న ఉత్తర ప్రత్ర్యుత్తరాలు. వీటన్నిటినీ పై పుస్తకంలో కోట్ చేయడం జరిగింది.
ఈ విషయం ఇన్నాల్లూ ఎందుకు రహస్యంగా ఉండింది..?
దీనికి సమాధానం తెలియాలంటే – క్రైస్తవంలో ఉన్న వివిధ శాఖల గురించి తెలుసుకోవాలి. క్యాథలిక్ క్రైస్తవులు – ట్రినిటీని నమ్ముతారు. అంటే – దేవుడు(తండ్రి),ఏసుక్రీస్తు,దేవదూత – ఈ ముగ్గురూ ఒక్కటేననీ నమ్మడం.
వీరికి పూర్తి వ్యతిరేకంగా నమ్మేవారు – ప్రొటస్టెంట్ క్రైస్తవులు. వీరి దృష్టిలో, ట్రినిటీ అనేది కొందరు చర్చి పెద్దలు బైబిల్లోని వాక్యాల్ని మార్చి చేసిన పెద్ద స్కామ్. ఏసుక్రీస్తు కూడా అబ్రహాం,మోసెస్ ల లాగా కేవలం ఓ ప్రవక్త మాత్రమే అని వీరు నమ్ముతారు.
న్యూటన్ కాలంలో, బ్రిటన్లో పాలన చాలా వరకూ క్యాథలిక్ చర్చ్ పెద్దల కనుసన్నల్లోనే జరుగుతుండేది. ట్రినిటీని నమ్మకపోవడం, బహిరంగంగా విమర్శించడం లాంటివి మరణ శిక్ష విధించదగ్గ బ్లాస్ఫమస్ క్రైమ్‌స్ అనేంత దారుణ పరిస్థితి అప్పట్లో ఉండేది.
గ్రీకు భాషలో ప్రావీణ్యం ఉన్న న్యూటన్ -కోనీ గ్రీక్ లోని పురాతన బైబిల్ గ్రంధాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి- కేథలిక్ లు చెప్తున్న ట్రినిటీ పెద్ద ఫేక్ కాన్స్పెట్ అనే కన్‌క్లూజన్ కి వచ్చేశాడు. తనను తాను ప్రొటస్టెంట్ గా డిక్లేర్ చేసుకున్నాడు. డైరీల్లో, ఆంతరంగిక మిత్రులతో చర్చల్లో తప్ప, దీని గురించి బహిరంగంగా మాట్లాడటం గానీ, రాయడం గానీ ఎప్పుడూ చేయలేదు. అలా గానీ చేసి ఉంటే – అతన్ని యూనివర్సిటీ పరిశోధనా విభాగాలనుండీ తొలగించడమే కాక, జైల్లో పడేసి తీవ్రంగా శిక్షించి ఉండేవారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే న్యూటన్ ఈ విషయంలో చాలా గోప్యత పాటించాడు.
ఈ విషయాలన్నిటినీ Rob Lliffe, ఆధారాలతో బయటికి తీశాడు.
రోమన్ క్యాథలిక్ ల ట్రినిటీ సిద్ధాంతం, ఏసు క్రీస్తు,మేరీమాత లకు విగ్రహాలు పెట్టి పూజించడం లాంటివి – అబ్రహాం,మోసెస్,జీసస్ లు తమ జీవితాంతం బోధించిన ఏకేశ్వరోపాసనకు(మోనోథిజం) ను అపహాస్యం చేయడమేననే అభిప్రాయాన్ని న్యూటన్ అనేకసార్లు వ్యక్తపరిచాడని ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది. నిజానికి, ఏసుక్రీస్తు గురించి సరిగ్గా ఇస్లాం కూడా ఇదే చెప్తున్న విషయం ఇస్లాం గురించి ప్రాధమిక అవగాహన ఉన్నోల్లందరికీ తెలిసేఉంటుంది.
శుక్రవారం.ఇన్