పాలస్తీనా-ఇజ్రాయెల్: వివిధ స్పందనలు

ఇజ్రాయెల్-పాలస్తీనా అంశం గురించి నాస్తికులు,మానవతావాదులు,చెడ్డీగాల్లు,క్రైస్తవులు,ముస్లింల స్పందనలపై స్పందన:-

నాస్తికులు-మానవతా వాదులు:
వీరిలో కొందరు మొదట్లో హమాస్ దాడిని ఖండించినప్పటికీ, చాలా మంది ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య చారిత్రక నేపద్యాన్ని ప్రస్తావించి పాలస్తానీయులపై సానుభూతి ప్రకటించారు. ఇజ్రాయెల్ దుందుడుకు చర్యల్ని, గాజాపై చేస్తున్న ఆకృత్యాల్ని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. వీరి స్పందన -“బాధితుల పక్షం వహించడమే మానవతావాదం” – అనే డెఫినిషన్ కి అనుగుణంగానే ఉంది. ఇలాంటి నాస్తికులు,మానవతావాదులందరికీ జోహార్లు.

చెడ్డీ గాల్లు-ఇస్లామోఫోబులు:
వీరికి – ఏది కరెక్ట్-ఏది రాంగ్ అనే సిద్ధాంతమేమీ లేదు.. సమాచారం నిజమా-కాదా అనే పట్టింపు లేదు..”ముస్లింలు హింసింపబడుతున్నారు, చంపబడుతున్నారు”- అనే ఊహే వీరి బతుకులకి అంతులేని సంతృప్తినిస్తుంది. ఇజ్రాయెల్ అనే పేరు వీరికి వయాగ్రాతో సమానం. గత వారం రోజులుగా ఫేస్-బుక్, ట్విట్టర్ లలో ఇజ్రాయెల్ తరుపున ఫేక్ న్యూస్ లను స్ప్రెడ్ చేస్తున్నవారిలో, ప్రపంచంలోకెళ్ళా చెడ్డీ మూకలే అత్యధికంగా ఉన్నారు. మైనారిటీల్ని ద్వేషించడం తప్ప వీరి బతుకులకి వేరే అర్థమేలేదనేది తెలిసిన విషయమే కాబట్టి, వీరి స్పందనలో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు.

క్రైస్తవులు:
ఏసుక్రీస్తు బోధనల్ని నమ్మి ఆచరించేవారు క్రైస్తవులు అనుకుంటే- ఏసుక్రీస్తు ప్రేమకు ప్రతిరూపం అనీ, బాధితులకు, నిర్భాగ్యులకు అండగా ఉండమని చెప్పారని క్రైస్తవులు చెప్తుంటారు. అలాంటప్పుడు, ఇజ్రాయెల్ లోని యూదుసెట్లర్ లతో పోల్చితే పాలస్తీనా ప్రజలు కొన్ని వేలరెట్లు అధికంగా కష్టాల్ని,నష్టాల్ని అనుభవిస్తున్నారు కదా, మరి వీరి ప్రేమ,సానుభూతి పాలస్తీనా వారివైపే ఎక్కువగా ఉండాలి కదా. అలా పాలస్తీనా వారిపై సానుభూతిచూపించే క్రైస్తవులు చాలా,చాలా తక్కువమంది మాత్రమే తారసపడతారు.
ఎందుకిలా పీడకుల పక్షం వహించారనేదానికి వీల్లు చెప్పేసమాధానం- అలా చేస్తేనే క్రీస్తు రెండో రాకడ సాధ్యమవుతుందంట. సమాజంలో అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు క్రీస్తు మళ్ళీ వచ్చి శాంతిని స్థాపిస్తారని బైబిల్లో ఉన్న వాక్యాన్ని రివర్స్ లో అర్థం చేసుకుని, ఆ అరాచకమేదో త్వరగా జరిగిపోతే, క్రీస్తు త్వరగా వచ్చేస్తారు కదా అని వీరు తాపత్రయపడుతున్నట్లుగా ఉంది.
ఓ వ్యక్తి క్రీస్తును నమ్ముతున్నానని ప్రకటించగానే, అతని యాక్షన్స్ తో(చేసేపనులతో) సంబంధంలేకుండా, అతనికి స్వర్గంలోకి ఎంట్రీ గ్యారెంటీ(ఎందుకంటే, ఆ వ్యక్తి తప్పుల్ని ఏసుక్రీస్తు ఆల్రెడీ మొదటిరాకడలోనే, తన రక్తంతో చెల్లించేశారు కాబట్టి) అనే పాపులర్ క్రిష్టియన్ కాన్స్పెట్ పరంగా చూస్తే, ఎలాగోలా ఆరాచకం ప్రబలిపోయి ఏసుక్రీస్తు రెండో రాకడకు సన్నద్ధం అయిపోవడం అనేది కరెక్ట్ గానే అనిపించొచ్చు.

ముస్లింలు:
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలందరూ పాలస్తీనా పక్షమే వహించారు. పాలస్తీనాలో ఉన్నది ముస్లింలు కాబట్టి, వాల్లేమి చేసినా ముస్లింలు సమర్థించడమంటే అది ఖురాన్,ప్రవక్త బోధనలకి వ్యతిరేకంగా వెళ్ళడమే అవుతుంది.
“ఓ విశ్వాసులారా! ఎల్లప్పుడూ న్యాయంవైపునే నిలబడండి. ఆ న్యాయం మీకు,మీ తల్లిదండ్రులకు, మీ పిల్లలకు వ్యతిరేకమైనదైనా సరే(4:135)” అనే ఖురాన్ వాక్యమే ముస్లింలకు శిరోధార్యం.దీని ప్రకారం, గత వారం రోజులుగా ప్రపంచమంతా సర్క్యులేట్ అవుతున్న ఫేక్ న్యూస్లలో చెప్తున్నట్లు – చిన్నపిల్లల్ని పట్టుకుని తలనరకడం, మహిళల్ని నగ్నంగా ఊరేగించడం,రేప్ లాంటివి గనక చేస్తే.. అది హమాస్ గానీ, వేరే ఏ ముస్లిం అయినాగానీ.. వారిని ఖండించడంలో, వారిని తీవ్రంగా శిక్షంచమని డిమాండ్ చేయడంలో ఏ ముస్లింకి కూడా ఎలాంటి మొహమాటం ఉండకూడదు.
ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా అల్లాహ్ పై విశ్వాసం కోల్పోకుండా నీతిగా,న్యాయంగానే బతికి,మంచి పనులు చేస్తేనే, ఆ పనుల ఆధారంగా అంతిమదినం నాడు తీర్పు చెప్పబడుతుంది తప్ప, నేను ముస్లిం నని ప్రకటించుకోగానే స్వర్గంలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొరికే ఫెసిలిటీ ఇస్లాం లో లేదు.

ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా హమాస్ చేస్తున్న సాయుధ తిరుగుబాటు కరెక్టా,కాదా.. హమాస్ దాడుల్లో కొంతమంది సాధారణ ఇజ్రాయెల్ ప్రజలు చనిపోవడం కరెక్టా..ఏ ఒక్క ఇజ్రాయెల్ సివిలియన్ కీ హాని తలపెట్టకుండా, తమ ప్రతిఘటనని పాలస్తీనియన్లు ఎలా ప్రకటించవచ్చు.. ఇవి చర్చించదగిన కాంప్లికేటెడ్ అంశాలు..
రాత్రికి రాత్రి హమాస్ సంస్థను మూసేసి, పాలస్తీనాలోని ఆయుధాలన్నిటినీ తగలబెట్టేసి, పాలస్తీనాలోని మగాల్లందరూ గాంధీగారిలాగా గోచీ కట్టుకుని వీధుల్లోకొస్తే, ఇజ్రాయెల్ వారిమీద దాడులు చేయడం ఆపేస్తుందా? గత ఎనభై ఏళ్ళుగా ఆక్రమించుకున్న వారి ప్రాంతాల్ని వారికి తిరిగిచ్చేస్తుందా? కనీసం కొత్త ప్రాంతాల్ని ఆక్రమించకుండా ఉంటానని హామీ ఇస్తుందా? ఆ హామీకి కట్టుబడి ఉంటుందా? – వీటికి సమాధానం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అది తెలిస్తే, నీతి-న్యాయం ల గురించి మీకంటూ ఓ సిద్ధాంతం ఉంటే,ఇజ్రాయెల్-పాలస్తీనాల్లో ఎవరి పక్షం వహించాలనే విషయంలో పెద్దగా కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు.

-మహమ్మద్ హనీఫ్.

Leave a Reply

Your email address will not be published.