ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్

రెండు కాళ్ళూ లేకుండా – ఒల్లంతా బొబ్బలతో పాకుడు బండిపై అడుక్కుంటున్న ఓ వ్యక్తి ఫోటోపెట్టి –
“అల్లా(ఉంటే) ఇతన్ని ఎందుకు ఇలా పుట్టించాడు” అని ఒకాయన అడిగారు.

ఈ వాదన నాస్తికత్వం తరుపున చాలా తరచుగా వినిపించబడుతుంది. దీనిని – ‘ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్ థియరీ ‘ అంటారు. దేవుడు అంటే గుడ్ కదా, గుడ్ ఉంటే , మరి ఈవిల్ ఉండకూడదు కదా – అనేది ఈ వాదన. దెయ్యాల సినిమాలు ఎక్కువగా చూసేవారు కూడా ఈ వాదనకు కనెక్ట్ అవుతారు. సినిమా చివర్లో దేవతో,బాబానో వచ్చి దెయ్యాన్ని పారదోలుతారు కదా, మరి నిజజీవితంలో దేవుడు ఈవిల్ ని ఎందుకు పారదోలడం లేదనేది ఈ వాదన. స్కూల్ టీచర్ కి పిల్లల భవిష్యత్తు మీద అంత శ్రద్ధే ఉంటే, మరి ఈ ఎగ్జాంస్ ఎందుకు, పిలల్ని లేపి ప్రశ్నలడగటం ఎందుకూ, అందర్నీ డైరెక్ట్ గా పాస్ చేసేయొచ్చు కదా – అని అడగటం లా లేదూ..?

సౌరవ్యవస్థా,సముద్రాలూ,నదులూ,పర్వతాలూ.. అన్నీ గమనిస్తే – ఇవన్నీ ఓ ఇంటెలిజెంట్ డిజైన్ లాగే కనిపిస్తాయి తప్ప, ఏదో యాక్సిడెంటల్ గా ఫాం అయిపోఇనట్లు అనిపించదు. ఈ ఇంటెలిజెంట్ డిజైన్, చాలా సార్లు చక్కగా పనిచేస్తుంది – కొన్ని సార్లు మాత్రమే – డిజైన్ గతితప్పుతుంది. అలాంటప్పుడే సునామీలూ, వరదలు, రోగాలూ వస్తుంటాయి. సో, ఎలా చూసుకున్నా – డీఫాల్ట్ గుడ్ మాత్రమే ఉంటుంది. బ్యాడ్/ఈవిల్ అనేది – ఎక్సెప్షన్. ఈ డీఫాల్ట్ గుడ్ దానంతట అదే ఎలా ఫాం అయ్యిందనేదానికి నాస్తికుల దగ్గర ఎలాంటి సమాధానం లేదుగానీ, ఈ ఎక్సెప్షన్ ని సాకుగా చూపి సృష్టికర్తను నిరాకరిస్తుంటారు.

సృష్టికర్త సమస్థాన్నీ సృష్టించానని చెప్పాడేగానీ,
‘సమస్థాన్నీ పర్ఫెక్ట్ గా, ఎవరికీ ఎలాంటి బాధలూ,కష్టాలూ లేకుండా సృష్టించాన’ని ఎక్కడ చెప్పాడు. ఖురాన్ మొత్తం వెతికి అలాంటి స్టేట్మెంట్ ఏదో చూపించండి.

పైగా కష్ట-సుఖాలు పార్ట్ ఆఫ్ క్రియేషన్ అని క్లియర్ గానే ఉంది.
“We Test You with Both Good and Evil Circumstances as a Trail. To Us you shall return” – Quran 21:35.

విశ్వాసి – ఓ అందమైన దృశ్యాన్నో, సీతాకోకచిలుక రంగుల్నో చూసి – “మాషాల్లాహ్..” అని సృష్టికర్తను పొగిడినట్లుగానే,
విశాదకర/బాధాకర దృశ్యాలను చూసినప్పుడు- “ఓ అల్లా.. ఇతనిపై, ఇలా కష్టాల్లో ఉన్న ప్రజలందరిపై దయ చూపమని” ప్రార్థిస్తాడు. ఎందుకంటే – సృష్టికర్త లెక్కలు వేరే ఉంటాయి. అవన్నీ మనకు తెలియాలనేం లేదు. మరణానంతర జీవితం ఇస్లామిక్ భక్తి భావంలో ఓ భాగం. మన కళ్ళతో చూడనంతమాత్రాన అది ఉండదని కొట్టిపారేయలేం. మన చుట్టూ ఉన్న గాలిలో కోట్లాది సూక్ష్మ క్రిములు ఉన్నాయని మైక్రోస్కోప్ కనిపెట్టని ఓ రెండు వందల ఏళ్ళ క్రితం చెప్పి ఉంటే – మేధావులమనుకునేవారు చాలా మంది దానినో పిచ్చి స్టేట్మెంట్ అనుకునేవారు. సో, మనం చూడలేనివీ/చూడనివీ లేవని చెప్పలేం.
“నీకు చక్కగా ఆరోగ్యం, రెండు కాళ్ళు, మంచి ఉద్యోగం, సంపాదన ఇస్తే – వాటన్నిటితో భూమ్మీద నువ్వేం చేశావ్ – అని సృష్టికర్త నిలదీసి అడిగినప్పుడు – చాలా మంది తాము వేస్ట్ చేసుకున్న అవకాశాన్ని తలుచుకుని బాధతో,అపరాధభావంతో వణికిపోవచ్చు.
అలాంటి పరిస్థితి ఆ ఫోటోలోని వ్యక్తికి రాకుండా, వైల్డ్ కార్డ్ ఎంట్రీలాంటిదేదైనా ఉండొచ్చు. ఆ రకంగా లాస్ట్ లాఫ్ అతనిదే అవ్వొచ్చునేమో.. Only the CREATOR has the ultimate Knowledge, the Creation’s knowledge is very limited.

“సృష్టికర్త మనపై చూపిన ప్రేమకు, మనకు కల్పించిన సౌకర్యాలకు ధన్యవాదాలు చెప్పుకోవడం – ఆ సౌకర్యాలని, ప్రేమనీ సాధ్యమైనంతగా ఇతరులకు పంచడం, మరింత మెరుగైన జీవనం కోసం ప్రయత్నించడం, ఏదో ఓ రోజు సృష్టికర్త దగ్గరకే తిరిగి వెల్లాల్సిఉంటుందనే స్పృహతో జీవించడం.. – ఇవే మానవుడు చేయాల్సింది.”

Leave a Reply

Your email address will not be published.