ఫండమెంటలిస్ట్!!!

“ఒరే అబ్బాయిలూ, ఫండమెంటల్స్ చానా ఇంపార్టెంటు. ఫండమెంటల్స్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉంటే, సబ్జెక్టు అంత బాగా అర్థమవుతుంది. ఇవి అర్థం కాకుంటే, ఇక అసలు సబ్జెక్టే అర్థం కాదు” – హైస్కూల్లో ఈ మాట చెప్పని టీచర్లు, వినని స్టూడెంట్సూ ఎవ్వరూ ఉండరు. అదీ ఫండమెంటల్స్ కు ఉన్న సిగ్నిఫికెన్స్. ఫండమెంటల్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేవారిని ‘ఫండమెంటలిస్ట్’ అంటారు.

చిన్నప్పుడు ఇంత పరమపవిత్రమైన ‘ఫండమెంటల్స్’ అనే పదం కాస్తా, పెద్దయ్యాక పరమ దుర్మాగమైన పదంగా -‘ఫండమెంటలిస్ట్’ గా పరిచయం అయింది. ఆ కథేంటో చూద్దాం.

ప్రతి ఏరియా ఆఫ్ స్టడీకీ కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. అట్లే, ఇస్లాం విషయానికి వస్తే – ఖురాన్ లోని వాక్యాలు, వాటికి మహమ్మద్ ప్రవక్త(pbh) ఇచ్చిన వివరణలు, ఆయన జీవించి చూపిన విధానం -ఇవే ఫండమెంటల్స్.

ఉదాహరణకు – ఖురాన్ వాక్యాలు వడ్డి ఇవ్వడాన్నీ,అట్లే తీసుకోవడాన్నీ కూడా తీవ్రంగా తప్పుబట్టాయి. కాబట్టి, చాలా ముస్లింలు వడ్డి జోలికి వెళ్ళరు. సేవింగ్స్ అకౌంట్ లో 10లక్షలుంటే దాన్నలాగే వదిలేస్తారు గానీ, దానిని ఫిక్స్డ్ డిపాజిక్ట్ కింద కన్వర్ట్ చేసి వడ్డీ తీసుకునే సులువైన ఆప్షన్ ఉన్నా, ఆ పని చేయరు. కొందరైతే, బ్యాంక్ వారు మూన్నెళ్ళకోసారి ఇచ్చే నామమాత్రపు వడ్డీ కూడా మాకొద్దని స్పెషల్ అప్లికేషన్ ఫిల్ చేసి మరీ బ్యాంకులో ఇస్తారు. ఇక అట్లే, EMI ఆప్షన్ మీద ఇళ్ళూ,వాహనాలు తీసుకోవడం వంటి అంశాల జోలికి చచ్చినా వెళ్ళరు.. – వీరందరూ వడ్డీకి సంబంధించిన ఇస్లామిక్ ఫండమెంటల్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారన్నట్లు.

ఇంకొందరుంటారు- వారి అప్రోచ్ ఎలా ఉంటుందంటే..వారు కూడా ఐదు పూటలా నమాజ్ చదువుతారు,నెలంతా రంజాన్ ఉపవాసాలుంటారు.. అన్ని విషయాల్లో ఇస్లాం ని ఫాలో అవుతుంటారు, కానీ EMI మీద ఫ్లాట్ తీసుకుంటారు.. ఎందుకలా అంటే వారి రీజనింగ్ ఎలా ఉంటుందంటే- ప్రవక్త/ఖురాన్ వడ్డీకి అప్పు తీసుకోవద్దు,ఇవ్వవద్దు అని చెప్పారు. ఇక్కడ బ్యాంకు నాకు డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బులు నాకిస్తే, నేను తీసుకెళ్ళి నాకు నచ్చిన ఇళ్ళు కొనుక్కుని, బ్యాంకుకి నెలనెలా వడ్డీ చెల్లిస్తే అది తప్పవుతుంది. కానీ, ఇక్కడ బ్యాంకు ఆ ఫ్లాట్ ప్రాపర్టీని క్షుణ్ణంగా అధ్యయనం/అసెస్ చేసింది. ఆ తర్వాతే, అది కూడా ఆ ఫ్లాట్ కొనడానికే నాకు డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బుతో నేనెళ్ళి ఇంకో ఫ్లాట్ కొనే ఆప్షన్ కూడా లేదు. దీనిని బట్టి, ఇది క్లియర్ గా ప్రవక్త(pbh) చెప్పిన వడ్డీ లాంటి లావాదేవీ కిందికి రాదు. ప్రవక్త టైమ్‌లో EMI అనే కాన్సెప్టే లేదు కదా. ఈ రోజుల్లో, EMI లేకుండా, కేవలం నెలజీతం కూడబెట్టుకుంటూ, మొత్తం డబ్బులు సమకూరాకే సిటీలో ఓ ఫ్లాట్ కొనడం అసాధ్యం. కాబట్టి, మారుతున్న కాలానికి తగ్గట్లు, మనం కూడా కొన్ని ఇంటర్ప్రెటేషన్లను మార్చడం తప్పు కాదు. ఆ రోజుల్లో ప్రవక్త ఒంటెమీద ప్రయాణం చేసేవారని, ఇప్పుడు మనం కూడా ఒంటె మీద ప్రయాణం చేయలేం కదా.” -ఇదీ ఆ రీజనింగ్. ఈ టైపు థింకింగ్ కరెక్టా,కాదా అనేది – ఆ వ్యక్తికీ-సృష్టికర్తకూ మధ్య వారి,వారి అండర్స్టాండింగ్.

మొత్తానికి చెప్పాలంటే, ఈ ఎగ్జాంపుల్ లో, మొదటి కేటగిరీ వ్యక్తుల్ని ‘ఫండమెంటలిస్ట్’ లుగానూ, రెండవ కేటగరీ వ్యక్తుల్ని ‘మాడర్నిస్టులు’గానూ అభివర్ణించొచ్చు.

బిన్ లాడెన్ ఫండమెంటలిస్టా.. మాడర్నిస్టా..?
———————————————
బిన్ లాడెన్ బతికున్నప్పుడు అనేక ఇంగ్లీష్,అరబిక్ చానెళ్ళకు ఇంటర్వ్యూలూ, ఆడియో,వీడియో ప్రెస్ స్టేట్మెంట్లూ ఇచ్చి ఉన్నాడు. వీటి ఆధారంగా బిన్ లాడెన్ ఆలోచనా సరలిని ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. లాడెన్ వివిధ సంధర్భాలలో చెప్పిన విషయాలన్నిటీ కలిపి – Bruce Lawrence అనే జర్నలిస్టు “Messages to the World: The Statements of Osama Bin Laden” – పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించి ఉన్నాడు. దీనిలో తేదీలతో సహా, వివిధ ఇంటర్వ్యూలను మెన్షన్ చేసి ఉన్నారు. 2001, అక్టోబర్ 21 నాడు, అల్-జజీరా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, (link -https://www.pbs.org/wgbh/pages/frontline/shows/binladen/who/interview.html?fbclid=IwAR0lCUZinJKDy9ixsgSlVHTiQZcfaqgkaEA_FtHy3XRNL2NSwYBbw_gGPus ) “అమెరికన్లను చంపాలని నువ్వు ఇచ్చిన ఫత్వా, అమాయకులనూ,స్త్రీలనూ,పిల్లల్నీ చంపకూడదనే ఇస్లాం బోధనలకు వ్యతిరేకం కాదా”, అని అడిగినప్పుడు లాడెన్ ఈ వ్యాఖ్య చేశాడు – “అమాయకుల్ని, స్త్రీలనూ,పిల్లల్నీ చంపడం తప్పని ఇస్లామిక్ స్కాలర్లు చెప్తుంటారు. దీనికి ఆధారంగా ప్రవక్త వివిధ సంధర్భాలలో చేసిన వ్యాఖ్యల్ని ఉదహరిస్తుంటారు. వీరు చెప్పేదంతా కరెక్టే. స్త్రీలు,పిల్లల్ని చంపడం తప్పని ప్రవక్త చెప్పి ఉన్నారు, దీనిలో అణుమానమే లేదు. కాకపోతే, ఇది అన్ని వేళలా అప్లికబుల్ కాదు. అవిశ్వాసులు మన స్త్రీలు,పిల్లల్ని చంపుతున్నప్పుడు, వారినలా చేయకుండా ఆపడం కోసం, మనం వారి స్త్రీలు,పిల్లల్ని చంపడం తప్పు కాదు” -ఇదీ బిన్ లాడెన్ ఇచ్చిన సమాధానం.
ఇదంతా బ్రూస్ లారెన్స్ పుస్తకంలో యధాతధంగా ఉంది.

1998 మే నెలలో, అమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ(ABC) కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లాడెన్ చెప్పిన విషయాలు మరింత డీటైల్డ్ గా ఉన్నాయి. -“రెండో ప్రపంచ యుద్దం తర్వాత, ప్రపంచం మీద, మరీ ముఖ్యంగా ముస్లింల మీదా అమెరికా ఆకృత్యాలు దారుణంగా పెరిగిపోయాయి. స్త్రీలు, పిల్లలపై దాడులు చేయడాన్ని అమెరికన్లే మొదలు పెట్టారు, దానికి అదే స్థాయిలో తిరిగి బదులివ్వకతప్పదు. అమెరికా చరిత్ర మొత్తం చూసుకున్నా – అది ఎప్పుడూ మిలిటరీ ప్రజలా, సాధారణ పౌరులా అని గానీ, ఆడా-మగా అనికానీ, చిన్నా-పెద్దాగానీ తేడా చూడకుండా అందరినీ చంపి నరమేధం సృష్టిస్తూనే ఉంది. హీరోషిమా,నాగసాకీలమీద అమెరికా వేసిన అణుబాంబులు కేవలం సైనికుల్ని మాత్రమే చంపడానికి కాదుకదా, అవి స్త్రీలూ,పిల్లల శరీరాల్ని కూడా చిద్రం చేశాయి. పాలస్తీనాలో యూదులతో కలిసి అక్కడి ముస్లింలను అమెరికా నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. అమెరికాపై, అదే తరహాలో, ప్రతీకారం తీర్చుకుంటే తప్ప దాని ఆకృత్యాలను నిరోధించగలిగే వేరే మార్గమేదీ లేదు. ” – ఇదీ బిన్ లాడెన్ చెప్పిన విషయం.
ఈ ఇంటర్వ్యూ ఇప్పటికీ ఆన్ లైన్ లో ఉంది.ఎవరైనా చదవొచ్చు. ( లింక్ కింద కామెంట్లలో ఉంది) link – https://thedebateinitiative.com/2013/06/12/who-justifies-terrorism-part-1/?fbclid=IwAR3msSkCdwg8Rft1dPM6r-Mlj8cR2vhGEONdpCcfE9FSm6HcyUH_u7jBh3g ) దీనిని బట్టి బిన్ లాడెన్, ఫండమెంటలిస్టా, మాడర్నిస్టా? అతను చేసిన హింసాత్మక చర్యలకు కారణం అమెరికా చేసిన దురాగతాలూ, దానికి అదే తరహాలో ప్రతీకారం తీర్చుకోవాలనే అతని థాట్ ప్రాసెస్ మాత్రమే తప్ప, ఇది ఖురాన్ కు గానీ, ప్రవక్త బోధనలకుగానీ సంబంధించిన విషయం కాదని ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. మొత్తానికి అతను మాడర్నిస్టే తప్ప, ఇస్లామిక్ ఫండమెంటల్స్ ను ఫాలో అవ్వలేదనీ కూడా అర్థమవుతుంది. కానీ, అతన్నీ,అతని లాంటి హింసాయుత చర్యలకు పాల్పడే వారందరినీ “ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ” లుగా పదే,పదే కొన్ని లక్షల సార్లు మెయిన్ స్ట్రీం మీడియా ఎందుకు పిలుస్తుంటుంది..?

ఇక్కడే మీడియా మాయాజాలం, ఇస్లామోఫోబిక్ ప్రాపగాండాని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాపగాండా ఏ స్థాయిలో ఉందంటే, చాలా మంది సో కాల్డ్ మాడరన్ ముస్లిం లు కూడా, ఇస్లామిక్ ఫండమెంటల్స్ లో నిజంగానే ఏదో ప్రాబ్లమాటిక్ యాంగిల్ ఉన్నట్లూ, ఓ రకమైన ఆత్మన్యూనతా భావనలోకి, అపరాధనా భావనలోకీ వెళ్ళిపోయారు. దీనికి తోడు, అక్కడక్కడా చెర్రీపిక్ లుగా , ఔటాఫ్ కాంటెక్స్ట్ కోట్ చేసే ఖురాన్ వాక్యాలు ఉండనే ఉన్నాయి. మొత్తానికి, ఇతరులద్వారా ‘మహా మాడరన్ ముస్లిం’లుగా గుర్తింపు పొందాలనే తపనను,తాపత్రయాన్నీ పక్కన పెట్టి, చిన్నప్పుడు హైస్కూల్లో చెప్పినట్లు, బ్యాక్ టు ఇస్లామిక్ బేసిక్స్ కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రవక్త జీవితాన్ని తరచి చదివి, ఖురాన్ ని మెయిన్ స్ట్రీం మీడియా కళ్ళతో, అది చెప్పినట్లు కాకుండా , తమ సొంత కళ్ళతో ముస్లిం లు అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది.. ఆ తెలుసుకున్నది, పది మందికీ చెప్పే ప్రయత్నం చేయాలి. అదే ఇస్లామోఫోబియాకు శాశ్వత పరిష్కారం

మహమ్మద్ హనీఫ్

Leave a Reply

Your email address will not be published.