మందు పెట్టిన్రు!!

ప్రాపగాండాకి పరాకాష్ఠ గా చెప్పదగ్గ విషయం – Joseph Goebbels గురించి తెలిసినంతగా, ఆ జోసెఫ్ గోబెల్స్ కే బాబులాంటోడు – Edward Bernays గురించి చాలామందికి తెలియకపోవడం. మొన్నామధ్య ఓ షార్ట్ వీడియో వచ్చింది. దాన్లో ఒకడి దగ్గరికి ఓ ఫ్రెండ్ వచ్చి, “మామా, నాకు ఓ అమ్మాయి హ్యాండిచ్చింది” అంటాడు. దానికి అతను- “నువ్వు కావాలంటే, ఆ అమ్మాయికి మందుపెడ్తా, ఇంక నీ వెనకాలే కుక్కపిల్లలా తిరుగుతుంటుంది”- అంటాడు.

ఇంకొకడు వచ్చి- “మామా, నన్ను ఆఫీస్ లో బాస్ తెగ సతాయిస్తున్నాడు” అంటాడు. దానికి అతను, “నువ్వు కావాలంటే చెప్పు, మీ బాస్ కి మందు పెడ్తా, ఇంక జీవితంలో నీజోలికి రాడు”- అంటాడు. ఇదంతా వింటున్న, అస్తమానం అతన్నే అంటిపెట్టుకుని ఉండే మరో ఫ్రెండు – “ఈ రోజుల్లో ఈ మందుపెట్టడం ఏంటన్నా… ఇదంతా నేను నమ్మను” అంటాడు. దానికి అతను – “ఒరే,నువ్వు పదో తరగతి వరకూ నాకు పెద్దగా పరిచయం లేవు.అప్పట్లో నీకు వేరే ఫ్రెండ్స్ చాలా మంది ఉండేవారు. కానీ పది తర్వాతి నుండీ అందర్నీ వదిలేసి, కేవలం నన్నే అంటిపెట్టుకుని ఉంటున్నావ్.. ఎందుకో తెలుసా? నీకు మందు పెట్టారా.. అదీ మందు మహత్యం అంటాడు.

ప్రస్తుత ఆధునిక యుగంలో, జనాల అభిప్రాయాల్ని మార్చే, ఏమార్చే ప్రాపగాండా కూడా, ఈ మందులాంటిదే. ఈ ప్రాపగాండా మందుకు బాబులాంటోడు – Edward Bernays. ఇతని గురించి చెప్పాలంటే.. ఓ నాలుగు పుస్తకాలు రాయొచ్చు. మచ్చుకు ఒక్క విషయం చెప్పుకుందాం – 1927లో “అమెరికన్ టొబాకో కంపెనీ” నష్టాల్లో నడుస్తుండింది. దానిని లాభాల్లోకి తీసుకురావడం ఎలాగో చెప్పమని, కంపెనీ వారు ఎడ్వర్డ్ బెర్నెస్ ని సలహా అడిగారు. అప్పటిదాకా, పొగతాగడం అనేది కేవలం మొగోల్లకు సంబంధించిన వ్యవహారంగా ఉండేది. మహిళలు పొగతాగేవారు కాదు. ఒకరిద్దరు తాగినా, ఎక్కడో చాటుమాటుగా, రహస్యంగా మాత్రమే తాగేవారు. ఆడోల్లకు మాత్రం తాగడానికి నోరులేదా, ఊపిరితిత్తులు లేవా, పొగవదలడానికి ముక్కు లేదా.. వారితో కూడా పొగతాగిస్తే సిగరెట్ల అమ్మకాలు ఈజీగా డబుల్ చేయొచ్చని కనిపెట్టాడు. డైరెక్ట్ గా తాగమంటే తాగరు కదా.. అందుకని ఫెమినిజం అనే ఆయుధాన్ని మహిళల మీద ప్రయోగించాడు.

Torches of FreeDom అనే పేరుతో మహిళల ఉద్ధరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అమెరికన్ నగరాల్లో మహిళలతో ర్యాలీలు జరిపించి, మీటింగ్లు పెట్టించి, అన్ని మీటింగ్లలోనూ ముందు వరుసలో కూర్చున్న మహిళలు చేతిలో సిగరెట్లు పట్టుకుని కూర్చుని ఉన్న ఫోటోల్ని అన్ని మ్యాగజైన్ల ఫ్రెంట్ పేజీల్లో వేయించాడు. మహిళలు సన్నగా ఉంటేనే అందంగా ఉంటారనీ, సన్నగా ఉండాలంటే స్వీట్లు మానేసి, స్వీట్లు తినాలనిపించినప్పుడల్లా సిగరెట్ తాగడం మంచిదనే విషయాన్ని వివిధ హాలీవుడ్ హీరోయిన్ల చేతా, చివరికి డాక్టర్ల చేత కూడా చెప్పించాడు. ఆ రకంగా మహిళలు సిగరెట్ తాగడాన్ని, ఆధునికతకు, స్వేచ్చకు చిహ్నంగా మార్చాడు…ఈ ప్రాపగాండా మందు ఏ రేంజ్ లో పనిచేసిందంటే – రెండేల్లు తిరిగేసరికల్లా సిగరెట్ల అమ్మకాలు ఆకాశాన్నంటాయి.

ఈ రకంగా, అమెరికన్ సమాజం మీద డైరెక్ట్ గా, మిగతా ప్రపంచం మీద ఇన్-డైరెక్ట్ గా ఎడ్వర్డ్ బెర్నెస్ చేసిన ప్రయోగాలు, సాధించిన ఘణకార్యాలు చాలా ఉన్నాయి. ఆసక్తి ఉన్నోల్లు – యూటూబ్ లో ఉన్న – “ద సెంచరీ ఆఫ్ సెల్ఫ్” అనే నాలుగు గంటల డాక్యుమెంటరీ చూసి నోరెల్లబెట్టుకోవచ్చు. కలల గురించి, మానవ మనస్తత్వాల గురించి పెద్ద,పెద్ద పుస్తకాలు రాసిన సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ ఎడ్వర్డ్ బెర్నెస్ యొక్క తాత.మాడ్రన్ ప్రాపగాండా కి ప్రధాన క్యారియర్ అయిన నెట్-ఫ్లెక్స్ పెట్టిన -Marc Randolph ఇతనికి మనవడు. అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అదే పనన్నమాట. సిద్ధాంతాలూ, ఎన్నికలూ, ప్రపంచ రాయకీయాలూ,యుద్ధాలూ, వ్యాక్సిన్లు.. కాదేదీ ప్రాపగాండాకి అతీతం.

యూదుడైన ఈ ఎడ్వర్డ్ బెర్నెస్, “జ్యూయిష్ మెంటల్ హెల్త్ సొసైటీ” అనే సంస్థలో కూడా క్రియాశీలక సభ్యుడిగా ఉండేవాడు. అన్నట్లు… “చార్లెస్ డార్విన్-రామ్ గోపాల్ వర్మ- ఓ ముస్లిం” పుస్తకంలో, “ఖురాన్ లో యూదుల ప్రస్తావన అన్నిసార్లు ఎందుకుంది” అనే చాప్టర్ మీకు గుర్తుందా..?

Leave a Reply

Your email address will not be published.