లైఫ్ – ఓ టెంపుల్ రన్!!

రన్..రన్..రన్
మార్కులు,చదువులు,ఉద్యోగం
రన్..రన్..రన్
బస్సుల్లో,ఆటోల్లో ఎన్నాల్లు.. బైక్ కొనుక్కో ఎప్పుడైనా,ఎక్కడికైనా వెల్లొచ్చు-
డిస్కు బ్రేకులుండాల.. కసక్కున్న ఎక్కడ బ్రేకేస్తే అక్కడాగాల.
బైక్తో పోటో దిగి ప్రొఫైల్ పిక్కులా పెట్టు. మస్తు లైకులు వస్తాయి.
రన్..రన్..రన్


అద్దింట్లో ఎన్నాల్లుంటావ్ – సొంతిల్లంటూ ఒకటుండాలకదా..
స్యాలరీ స్లిప్పులిచ్చి ఫ్లాటు తీసుకో – ఈయమ్మై జస్ట్ పాతికవేలే.
ఆ జుట్టేంటి తెల్లగా – గార్నియర్ వాడు..
రన్..రన్..రన్
బైకులో కష్టం, వానొచ్చినా – ఎండొచ్చినా..
కారు తీస్కో- ఎంచక్కా ఏసీలో వెల్లొచ్చు – నెలకు జస్ట్ పదిహేను వేలే.
ఆ బొజ్జేంటి అలా పెరుగుతుంది.. జిమ్ములో చేరు, ఎక్సైజులు చెయ్.
రన్..రన్..రన్
ఈ ఫ్లాట్ మరీ ఇరుకైపోయింది. 3BHK తీస్కో. విత్ రిజర్వుడ్ పార్కింగ్, మాడ్యులార్ కిచెన్.
స్యాలరీ చాలడం లేదా.. కంపెనీ మారు, కొత్త స్కిల్లు నేర్చుకో, ఎక్కువపని చేయ్.. బాస్ ని ఇంప్రెస్ చేయ్.
రన్..రన్..రన్..
ముఖంపై ఆ ముడతలేంటి – పాండ్స్ ఏజ్ మిరకిల్ క్రీం రాయి.
రన్..రన్..రన్.
ఈ కారుకు డిక్కీ లేదు. సెడాన్ తీస్కో. ఎంత లగేజ్ ఐనా పడుతుంది. లెగ్ రూమ్ కూడా చాలా ఎక్కువ.
కాళ్ళు బాగా సాపుకోవచ్చు.
రన్..రన్..రన్.
అపార్ట్మెంట్ లో కష్టం. విల్లా తీస్కో. సపరేట్ గా ఉండొచ్చు. ఎలాంటి డిస్టర్బెన్సూ ఉండదు.
కమ్యూనిటీ ఉంటుంది. క్లబ్ హౌసూ.. సిమ్మింగ్ ఫూలూ.
మోకాల్ల నొప్పులా – అపోలో ‘నీ’ రీప్లేస్మెంట్ ఉందిలే..
రన్..రన్..రన్.
ఆన్సైట్ వెళ్ళు.. అమెరికా,ఆస్ట్రేలియా, యూరప్.. సేం పని డబుల్ సంపాదన..
లైఫ్ కూడా పీస్ఫుల్ గా ఉంటుంది.
రన్..రన్..రన్..
ఇంకా ఈ సెడాన్ ఏంటి.. యస్యూవీ తీస్కో, స్పోర్ట్స్ మాడల్… ఆ ఇంజన్ పవర్.. ఆ ఠీవీ..
ఇంద, నీ రాతలకూ, చేతలకు గుర్తుగా, శాలువా, ఓ షీల్డు, మెడలూ.. షోకేసులో పెట్టుకో.
గుండె నొప్పా స్టంట్స్ వేస్కో..
రన్..రన్..రన్..
ఫాం హౌస్ తీస్కో.. వీకెండ్స్ కి అక్కడికెల్లి ఎంజాయ్ చేయొచ్చు..
రన్..రన్..రన్..
లేయట్లేదేంటి.
ఇంకేం రన్..
ఈయన టైమ్ ఈజ్ అప్.
బాడీని త్వరగా తీసేయండి. ఎక్కువసేపు ఉంచకూడదు.
4*5*6 – వెడల్పు,లోతు,పొడవు ఉండేలా గుంతను తవ్వండి. తెల్ల బట్ట తెప్పించండి.
స్టేటస్ అప్డేట్ చేయండి. – “వచ్చిన చోటికే వెళ్ళిపోయాడు.”

Leave a Reply

Your email address will not be published.