జ్వరం వస్తే హాస్పిటల్ కి వెళ్తారు గానీ, గుడికో/మసీదుకో/చర్చ్ కో కాదు కదా అనేది – “నాస్తిక-ఆస్తిక” చర్చల్లో ఎలిమెంటరీ స్థాయి కొచెన్.
స్టేషన్ కొచ్చిన కొత్త కానిస్టేబుల్ లా, అప్పుడప్పుడే ఈ చర్చల్లోకి వచ్చిన లేలేత నాస్తికులు, ఇదో భీబత్సమైన లాజికల్ కొచెన్ అనేంత ఎక్సైట్మెంట్ తో ఈ ప్రశ్న అడుగుతుంటారు.
వారికి అదేస్థాయిలో చెప్పాల్సిన సమాధానం – “బాబూ, చిట్టీ – నీకు హాస్పిటల్ కెళ్ళి మందులు తెచ్చుకోవడం వరకూ మాత్రమే తెలుసు కానీ, ఆ మందులిచ్చిన డాక్టర్, తన మందులు పనిచేయాలని గుడికో/మసీదుకో/చర్చ్ కో వెళ్ళి మొక్కుకుంటాడ్రా అయ్యా” అని. అమెరికన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే “నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్” అనే సంస్థ నిర్వహించిన సర్వేలో 65% డాక్టర్లు దేవున్ని నమ్ముతారని తేలింది. Religious and Spiritual beliefs of Physicians – survey అని గూగుల్ లో కొడ్తే వస్తది, సదువుకోండి.
ఆ ఎలిమెంటరీ లెవల్ దాటి, ఇంకొంచెం పై లెవెల్ లో చెప్పాలంటే- గూగుల్ ఓపెన్ చేసి, who is the father of early modern medicine అని కొడ్తే, Ibn Sina అని సమాధానం వస్తది. ఈయన ఇస్లామిక్ పండితుడు. సృష్టిని శోధించమనే ఖురాన్,ప్రవక్త బోధనల ఇన్స్పిరేషన్ తో ఈయన సాగించిన అనేక పరిశోధనలు, మెడికల్ సైన్స్ నే మొత్తంగా మరో లెవెల్ కి తీసుకెళ్ళాయి.ఇలా సైన్స్ ని ముందుకు తీసుకెళ్ళిన ఇస్లామిక్ స్కాలర్ల లిస్టు చాంతాడంత ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నోల్లు శోధించి తెలుసుకోండి. ఇంట్రెస్ట్ లేనోల్లకు ఎంత డీటైల్డ్ గా రాసిన అవన్నీ పట్టించుకోకుండా ఆకతాయి కామెంట్లు రాయడం రొటీన్ గా జరుగుతుంది కాబట్టి, వారికోసం నేనెక్కువ టైమ్ స్పెండ్ చేయను.
****
మరి నోబెల్ బహుమతి పొందినోల్లలో ముస్లిం సైంటిస్టులు ఎందుకు లేరు అనే మరో..ఓ మోస్తరు ఇంటెలిజెంట్ కొచెన్ కూడా కొందరు అడుగుతారు. దీనికి సమాధానం, గడచిన 100-200 ఏళ్ళలో ముస్లిం రాజ్యాలు/దేశాల్లో వచ్చిన పాలనాపరమైన మార్పులు,ఆ పాలకుల తప్పిదాలు, మత విద్య-సెక్యులర్ విద్య అంటూ వేరు చేసి యూరోపియన్ మాడల్ ని అనుకరించే ప్రయత్నాలు.. ఇలా చాలా ఉన్నాయి.
********
మొత్తానికి ఫైనల్ గా చెప్పేదేమంటే – ఖురాన్, సృష్టికర్త యొక్క Signs ని వివరిస్తుంది, సృష్టిలోని Science ని కాదు. రెండింటికీ కాన్‌ఫ్లిక్ట్ లేదనీ, రెండు సైన్స్ లనూ అర్థంచేసుకోమని ఎంకరేజ్ చేస్తుంది. ఈ స్టేటెమెంట్ ను assess చేయాలంటే, గత 1400 సంవత్సరాల చరిత్ర,మేజర్ ఈవెంట్స్ పై కనీస ప్రాధమిక అవగాహన ఉండాలి. ఇవిరెండూ లేకుండా, తాడూ-బొంగరం లేని స్టేట్మెంట్లు వేస్టు.
www.shukravaram.in