రహ్మతుల్లా కైరానవీ – 1818లో, ఉత్తరప్రదేశ్ లోని శాంలీ జిల్లా, కైరానా పట్టణంలో జన్మించారు. ఈయన పూర్వీకులు అరేబియా ప్రాంతం నుండీ మొఘల్ పాలకుల కాలంలో భారత దేశానికి వలస వచ్చారు. ఈయన మూడవ ఇస్లామిక్ ఖలీఫా – ఉస్మాన్(ర) గారి వంశానికి చెందిన 34 వ తరం వ్యక్తి. అక్బర్ చక్రవర్తి – వీరి వంశస్తులకు కైరానా ప్రాంతంలో వందల ఎకరాల భూములు బహుమానంగా ఇవ్వడంతో వీరి కుటుంబం అక్కడ స్థిరపడింది.
Continue reading “1857 సైనికుల తిరుగుబాటు – రహ్మతుల్లా కైరానవీ”’ఆ నలుగురు’ ముస్లింలు ఎవరు, ఎందుకు చేస్తునారు?
ప్రస్తుతం దేశంలో ఏ మూల చూసినా, పల్లె,పట్నం అనే తేడా లేకుండా, కరోనా మృతుల అంతిమ సంస్కారాలు నిర్వహించడంలో ముస్లింలు అందరికంటే ముందు వరుసలో ఉంటున్నారు.చనిపోయిన వారి మతంతో సంబంధం లేకుండా, ఏ మతస్థులకు ఆ మత ఆచారమం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.కరోనా సోకుతుందేమోననే భయంతో, కడుపున పుట్టిన బిడ్డలు, సొంత తోబుట్టువులే శవం దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడుతున్న ప్రస్తుత పరిస్థుతుల్లో, ముస్లింలు తమకు ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికీ ఆ పార్దీవదేహాలను గౌరవ మర్యాదలతో మోసి, స్మశానవాటికలకు తరలిస్తున్నారు.
Continue reading “’ఆ నలుగురు’ ముస్లింలు ఎవరు, ఎందుకు చేస్తునారు?”సాతాను సామ్రాజ్యం!!
జాన్ యఫ్. కెన్నడీ అని ఒకప్పటి అమెరికన్ ప్రెసిడెంట్. 1963 లో, అతన్ని రోడ్డుపైనే కాల్చి చంపారు.అనేక విచారణా సంఘాలూ, కమీటీలూ వేశాక, ‘కెన్నడీ ని కాల్చింది ఇతనే’ – అని ఓ క్యారెక్టర్ -Xని ప్రవేశ పెట్టారు. పైగా ఆ X ఒంటరిగానే ఇదంతా చేశాడనీ, అతని వెనుక ఇంకెవరూ లేరనీ కూడా తీర్మానించేశారు. అసలు ‘ఇంతకూ ఎందుకు చంపావయ్యా’ అని న్యాయస్థానం అతన్ని రేపో, మాపో ప్రశ్నిస్తుందనగా , ఆ Xని మరో Y అనే అతను చంపేశాడు.
Continue reading “సాతాను సామ్రాజ్యం!!”ఖురాన్ లో యూదుల గురించి ఎందుకుంది, హిందువుల గురించి ఎందుకు లేదు..?
పదో క్లాసులోనో,ఇంటర్లోనో మొదటిసారిగా తెలుగులో ఖురాన్ చదివే ప్రయత్నం చేసినట్లు గుర్తు. కానీ, రెండో చాప్టర్ అల్-బఖరా ని దాటి ఎప్పుడూ ముందుకు వెళ్ళలేదు. కొన్ని లైన్స్ చదవగానే నిద్రరావడమో, అక్కడి కంటెంట్ అర్థం కాక, మైండ్ వెంటనే వేరే విషయాలపైకి డైవర్ట్ అవ్వడమో జరిగేది.
Continue reading “ఖురాన్ లో యూదుల గురించి ఎందుకుంది, హిందువుల గురించి ఎందుకు లేదు..?”యూదుల స్వర్ణయుగం
ఇది కూడా చాలామందికి తెలియని విషయం – యూదుల స్వర్ణయుగం అని ఒకటి ఉంది. గూగుల్ లో గోల్డెన్ ఏజ్ ఆఫ్ జ్యూస్(Golden age of jews) , అని కొడితే వస్తుంది. అది 8-12 శతాబ్ధాల మధ్య స్పెయిన్ లో. ఆ కాలంలో, స్పెయిన్ లో యూదుల వ్యాపారం, సంస్కృతి, మత స్వేచ్చ, సమాజంలో వారి ప్రాబల్యం.. వంటి వన్నీ గొప్పగా వెలుగొందాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ కాలంలో స్పెయిన్ పాలకులు ఎవరు..?
Continue reading “యూదుల స్వర్ణయుగం”ప్రవక్త జీవితంలో కీలక ఘట్టం – హుదేబియా సంధి
మహమ్మద్ ప్రవక్త క్రీ.శ.570 లో మక్కాలో జన్మించారు. అప్పటికే మక్కా, అరేబియా మొత్తానికి ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుండేది. అక్కడి నల్ల రాతి గృహం(కాబా) మహమ్మద్ ప్రవక్త నిర్మించింది కాదు. ఇస్లాం,క్రైస్తవ,యూదుమతాలు మూడింటిలోనూ ప్రస్తావించబడిన అబ్రహాం, ఏకేశ్వరోపాసన కోసం కాబా గృహాన్ని మొదటిసారిగా నిర్మించారు. కానీ, అబ్రహాం ప్రవక్త తదనంతరం అరబ్బులు ఆ కాబా గ్రృహాన్ని వివిధ విగ్రహాలతో నింపేశారు. ఒక్కో తెగ, ఒక్కో ఆకారాన్ని తమ దైవంగా ప్రకటించి, ఆ ప్రతిమల్ని కాబాలో ప్రతిష్ఠించారు. వీరు ప్రతి సంవత్సరమూ తమ తమ విగ్రహాల్ని సందర్శించడానికి, మరియూ కాబా చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి అక్కడికి వస్తుండటంతో, మొత్తం అరేబియా ఖండానికే కాబా ఓ ప్రముఖ వాణిజ్యకేంద్రంగా భాసిల్లేది.
Continue reading “ప్రవక్త జీవితంలో కీలక ఘట్టం – హుదేబియా సంధి”పాలస్తీనా -ఇజ్రాయెల్ లలో ఎవర్ని సపోర్ట్ చేయలి?
ఓ పురుషుడు,ఓ మహిళపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ మహిళ తనకున్న కొద్దిపాటి బలంతో తీవ్రంగా ప్రతిఘటిస్తుంది.
“పాపం, అతన్ని ఎలా గోల్లతో రక్కిందో చూడండి.
ఎలా అతని జుట్టుపట్టుకుని లాగిందో చూడండి.
ఎలా అతన్ని కాల్లతో తన్నిందో చూడండి” – అంటూ మాట్లాడేవారు తటస్థంగా ఉన్నట్లా?