కృతజ్ఞత

కృతజ్ఞత, అంటే మనకు ఎవరైనా సహాయం చేస్తే, దానిని అక్నాలెడ్జ్ చేయడం, మనకు సహాయం చేసిన వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు తిరిగి సహాయం చేయడం – ఇవి మనిషికి ఉండాల్సిన కనీస మంచి లక్షణాలనీ, అవి లేకపోవడం అనేది పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అనే విషయం అందరూ ఒప్పుకుంటారు.

Continue reading “కృతజ్ఞత”

చదివితే కదా తెలిసేది

[ఇజాయెల్-పాలస్తీనా పూర్వాపరాలు తెలుసుకోకుండా, కేవలం ఇదేదో రెండు మతాలకు సంబంధించిన విషయం అనుకుని, ఏదో ఓ సైడ్ తీసుకుని గుడ్డిగా వాదించేవారు కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుంటే మంచిది. ]

Uri Avnery(1923-2018) – ఇజ్రాయెల్ మిలిటరీలో పనిచేశాడు. అనంతరం రెండు సార్లు ఇజ్రాయెల్ పార్లమెంట్ కు (దీన్ని కెనెస అంటారు) ఎన్నికయ్యాడు. యాసర్ అరాఫత్ తో చర్చల్లో పాల్గొన్న తొలితరం యూదుప్రముఖుల్లో ఒకడు. అనంతరం రాజకీయాలనుండీ విరమించుకుని రచయితగా, జర్నలిస్ట్ గా మారాడు. జియోనిజం, ఇస్రాయెల్-పాలస్తీనా వివాదం గురించి 6 పుస్తకాలు, వందలాది వ్యాసాలు రాశాడు.

Continue reading “చదివితే కదా తెలిసేది”

ఒక డిబేట్- అనేక ప్రకంపనలు

ఈ డిబేట్ సుమారు నెల క్రితం అమెరికాలో(టెక్సాస్)లో జరిగింది.

ఈ డిబేట్ ని కండక్ట్ చేసిన హోస్ట్- Patrick Bet-David. అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రముఖ వ్యక్తి, రచయిత, జర్నలిస్ట్. సీరియస్ అంశాల గురించి ఇతను చేసే టివీ/యూటూబ్ డిబేట్లను లక్షలాది మంది చూస్తారు. అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాండేట్లని కూడా ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ఇతను సాంప్రదాయక క్రిష్టియన్, అంటే, క్రైస్తవ మతాన్ని సీరియస్ గా ఆచరించే వ్యక్తి. ఇరాన్ లో పుట్టాడు.

Continue reading “ఒక డిబేట్- అనేక ప్రకంపనలు”

వలనబ్లువన్నకుమ్

పాలస్తీనాలో నెత్తురోడుతున్న పిల్లలఫోటోలు,వీడియోలూ చూసి, “దేవుడేగనక ఉంటే, ఆ పిల్లల్ని ఎందుకు కాపాడటం లేదు, కాబట్టి దేవుడు లేడు” అని డిక్లేర్ చేయొచ్చు. తుఫానులు,భూకంపాలు, రోడ్డుప్రమాదాల్లో చనిపోయిన పిల్లల్ని చూసి కూడా ఇలాగే కన్‌క్లూడ్ చేయొచ్చు.

మనం ఎక్కడ, ఎప్పుడు పుట్టాలనేది మనచేతుల్లో ఉన్న విషయం కాదు. ఆ పసిపిల్లల స్థానంలో మనం కూడా ఉండి ఉండొచ్చు. మనం (లేక) మన తల్లిదండ్రులు గొప్పోల్లు కాబట్టో, ఏదో బీభత్సమైన ప్లానింగ్ చేయబట్టో మనకు ఆ పరిస్థితి రాలేదని చెప్పడానికి లేదు. మనకు ఆ కష్టాలు రానందుకు “అల్-హందులిల్లాహ్”(Thanks to Creator) అని కూడా కన్‌క్లూడ్ చేయొచ్చు.

ఎవరి ఛాయిస్ వారిదే.

కూలిపోయిన తన ఇంటి శిధిలాల మీద కూర్చుని “వలనబ్లువన్నకుమ్”అని ఖురాన్ లోని వాక్యాల్ని ఎంతో ఆర్థంగా పాడుతున్న పాలస్తీనా బాలుని వీడియో దాదాపు అందరూ చూసే ఉంటారు. వలనబ్లువన్నకుమ్ – అంటే – “మేము నిన్ను తప్పక పరీక్షిస్తాం” అని.

మెడనరం కంటే దగ్గర

ఒక సిద్ధాంతం, లేదా , ఓ వ్యక్తి ఎలాంటివాడో తెలియాలంటే -అతనికి అపరిమిత అధికారం కట్టబెడితే, ఆ అధికారాన్ని ఎలా వినియోగిస్తున్నాడనేదాన్ని బట్టి అతను/(అతను నమ్మే సిద్ధాంతం) ఎలాంటిదో తెలిసిపోతుంది.

ఇస్లామిక్ చరిత్రలో అనేక సామ్రజ్యాలు వందల ఏళ్ళు పాలించాయి గానీ, పుట్టుక ఆధారంగా ఒక సమూహానికి చెందిన ప్రజల్ని టార్గెట్ చేసి వారిని అణచివేతకు గురి చేసిన దృష్టాంతం ఎక్కడా లేదు. ముస్లిమేతరులు జిజియా పన్ను చెళ్ళించాలనే నియమం షరియాలో ఉన్నమాట నిజమే. రాజ్యాధినేత యుద్ధ ప్రకటన చేయగానే పురుషులందరూ ఆయుధం ధరించి సైన్యంలో చేరాలనే నియమం కేవలం ముస్లిం పురుషులకు మాత్రమే వర్తిస్తుందనే నియమాన్ని కలిపి చూస్తే, జిజియా పన్ను, ప్రొటెక్షన్ పన్ను మాత్రమేననే విషయం అర్థమవుతుంది.

Continue reading “మెడనరం కంటే దగ్గర”

యూదు-ముస్లిం చరిత్ర: కొన్ని విషయాలు (యూదు మేధావుల వ్యాఖ్యల ఆధారంగా)

David J Wasserstein – విద్యావేత్త,రచయిత, చరిత్రకారుడు. జ్యూయిష్ బ్యాక్-గ్రౌండ్ నుండీ వచ్చాడు. ఇజ్రాయెల్ లోని టెల్-అవీవ్ యూనివర్సిటీలో 1990 నుండీ 2004 వరకూ బోధన చేసి, ప్రస్తుతం ఒక అమెరికన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఇతను రాసిన పుస్తకాలు – The Rise and Fall of the Party-Kings: Politics and Society in Islamic Spain 1002-1086 (Princeton University Press, 1985) and The Caliphate in the West: an Islamic Political Institution in the Iberian Peninsula (Oxford, 1993) and numerous articles on topics including Jewish history, Islamic history, and medieval numismatics. His most recent book is The Legend of the Septuagint from Antiquity to Today (Cambridge, 2006)

Continue reading “యూదు-ముస్లిం చరిత్ర: కొన్ని విషయాలు (యూదు మేధావుల వ్యాఖ్యల ఆధారంగా)”

పాలస్తీనా-ఇజ్రాయెల్: వివిధ స్పందనలు

ఇజ్రాయెల్-పాలస్తీనా అంశం గురించి నాస్తికులు,మానవతావాదులు,చెడ్డీగాల్లు,క్రైస్తవులు,ముస్లింల స్పందనలపై స్పందన:-

నాస్తికులు-మానవతా వాదులు:
వీరిలో కొందరు మొదట్లో హమాస్ దాడిని ఖండించినప్పటికీ, చాలా మంది ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య చారిత్రక నేపద్యాన్ని ప్రస్తావించి పాలస్తానీయులపై సానుభూతి ప్రకటించారు. ఇజ్రాయెల్ దుందుడుకు చర్యల్ని, గాజాపై చేస్తున్న ఆకృత్యాల్ని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. వీరి స్పందన -“బాధితుల పక్షం వహించడమే మానవతావాదం” – అనే డెఫినిషన్ కి అనుగుణంగానే ఉంది. ఇలాంటి నాస్తికులు,మానవతావాదులందరికీ జోహార్లు.

Continue reading “పాలస్తీనా-ఇజ్రాయెల్: వివిధ స్పందనలు”

మిడిల్ ఈస్ట్ లో బెస్ట్ నాయకత్వం – ఖతార్

మిడిల్ ఈస్ట్ దేశాల రాజకీయాల్ని గమనిస్తే – భౌగోలికంగా చిన్నదైనప్పటికీ, ఖతార్ దేశం చేసే పనులు చాలా గొప్పగా అనిపిస్తాయి.
1. సి.యెన్.యెన్,బీబీసీ,టైంస్ లాంటివి ముస్లిం/అరబ్ లకు వ్యతిరేకంగా వార్తల్ని రాస్తున్నాయని అందరూ కేవలం ఏడుస్తుంటే, ఖతార్ ఏకంగా వాటికి పోటీగా అల్-జజీరా ను స్థాపించి, ఇంటర్నేషల్ స్టేజ్ మీదకి వదిలింది. వెస్ట్రన్ మీడియా యొక్క వన్-సైడ్ న్యారేషన్ కి బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తుంది.

Continue reading “మిడిల్ ఈస్ట్ లో బెస్ట్ నాయకత్వం – ఖతార్”