- కొన్నేల్ల క్రితం, బంగ్లాదేశీ writer తస్లీమా నస్రీన్ మిటింగ్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు, యం.ఐ.యం నాయకులు కొందరు ఆమెపై దాడి చేశారు.
==>ఇది చాలా తప్పు. చట్టపరంగా,నైతికంగా కూడా. ఆ దాడి చేసినోల్లందరినీ జైల్లో వేసి మక్కిలిరగదన్నాలి. - అక్బరుద్దీన్ ఓవైసీ చాన్నాల్ల క్రితం, 15 నిమిషాలు– అంటూ ఏదో వాగాడు.
==>అది కూడా చాలా పెద్ద తప్పు.ఆ స్పీచ్ కి దాదాపు నలభై రోజులు జైల్లో ఉన్నాడు. అది తగిన శాస్తి అని నాకనిపిస్తుంది. రేపు కోర్టు ఇంకా పెద్ద శిక్షవిధించినా కూడా మంచిదే. - గత సంవత్సరం , కరీం నగర్ లో, మళ్ళీ రెచ్చగొట్టే ప్రసంగం చేసిన ఓవైసీ అని మీడియా రెండు రోజుల పాటు హంగామా చేసింది. ఆ వార్త ఆధారంగా, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటోల్లు కూడా ఓవైసీ స్పీచ్ దుర్మార్గమైనదని జడ్జిమెంట్లిచ్చారు.
==> నేనా స్పీచ్ మొత్తం విన్నాను. ఎక్కడా తప్పుపట్టాల్సింది కనిపించలేదు. స్పీచ్ మొత్తాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను, ఒరిజినల్ వీడియో లింక్ ఇచ్చాను. నాగేశ్వర్ అగ్న్ఞానాన్ని ఖండిస్తూ పోస్ట్ రాశాను.
దీనినే ఆబ్జెక్టివిజం అంటారు. ప్రీ కన్సీవ్డ్ ( pre- conceived) నోషన్స్ లేకుండా, మనోడు, పరాయోడు అనే ఫీలింగ్స్ లేకుండా – ఓ అంశాన్ని విశ్లేషించడం. చాలా మంది మేధావులమనుకునే వారికి కూడా ఇది లేకపోవడం – ఒక్కోసారి చిరాకు తెప్పిస్తుంటుంది.
ఇంతకు ముందు ఫార్ములా సినిమాలని వచ్చేవి. ఆరు పాటలు- వాటిలో ఓ క్లబ్ సాంగు, ఓ విషాద పాట కంపల్సరీ, నాలుగు ఫైట్లు, కామెడీ ట్రాకు, తల్లో,చెల్లో సెంటిమెంటు. – ఇది సూపర్ హిట్ ఫార్ములా అన్నట్లు.
ఇప్పుడు మన సోకాల్డ్ తటస్థ విశ్లేషకులు కూడా ఇదేరకమైన ఫార్ములాను వాడుతుంటారు.
బీజేపీని విమర్శించినప్పుడల్లా, యం.ఐ.యం నీ/ఓవైసీని కూడా విమర్శించాలి.
సంఘీ బ్యాచ్ ని తిట్టినప్పుడల్లా – హైదరాబాద్ ముస్లింలని కూడా తిట్టాలి.
ఇదీ ఆ ఫార్ములా.
చూడండి మేధావులూ – ఈ ఫార్ములా తప్పు. ఎందుకంటే, MIM నాయకులూ, బీజేపీ నాయకులూ ఒక్కటి కాదు. ఒక్క స్పీచ్ కి MIM లో నెంబర్-2 నాయకుడు, నలభై రోజులు జైల్లో ఉన్నాడు. బీజేపీలో ఇంతకంటే దారుణమైన స్పీచులిచ్చేవారిపై, ప్రైవేట్ సైన్యాలు మెయింటెన్ చేసే గ్రూపులపై ఈగలు కూడా వాలవు.
ఇక ఓల్డ్ సిటీ ముస్లింలంటరా , వారికి వేరే ఆప్షన్ లేదు. గుడ్డి కంటే మెల్లమేలన్నట్లు, కనీసం అప్రోచబుల్ గా ఐనా ఉంటారని MIM కే ఓట్లేస్తున్నారు.
కానీ బీజేపీ కి ఓట్లేస్తున్నవారికి కాంగ్రెస్, యన్సీపీ, యస్పీ, బియస్పీ,ఆర్జేడీ,జేడీయూ,టీడీపీ,వైసీపీ,టీఆరెస్, కమ్యూనిస్టులూ – వీటి రూపంలో ఆప్షన్లున్నాయి. ఇవన్నీ కాదని బీజేపీకి ఓట్లేయడానికి, దాన్లో ఏమంత నచ్చిందని అడగొచ్చు. హిందూమతమనే పేరును వాడుకోవడం తప్ప, హిందువులకు ఆ పార్టీ చేసిన మేలేంటనీ, ఇతర పార్టీలన్నీ కూడా హిందువులవే ఐనప్పుడు, వాటన్నిటీ కాదని బీజేపీకే ఓట్లేయడం వెనక లాజిక్ ఏంటనీ అనలైజ్ చేయొచ్చు. ఇలా అనలైజ్ చేసినప్పుడల్లా, ఠంచనుగా యం.ఐ.యం నీ , హైదరాబాద్ ముస్లింలనూ తల్చుకోవాల్సిన అవసరం లేదు. వారి తప్పుల్ని ఎత్తి చూపాల్సివచ్చినప్పుడు ఆ పని డైరెక్ట్ గానే చేయండి. ఆధారాలతో వారి లోపాల్ని/తప్పుల్ని కత్తికో కండగా ఖండించండి.
ఫార్ములా సినిమాలకు ఇప్పుడు కాలం చెల్లింది. ఫార్ములా విశ్లేషణలకు కూడా.