సనాఖాన్ – హిందీ,తమిల్,తెలుగు,కన్నడ కలిపి 15 సినిమాలూ, హిందీ బిగ్-బాస్, ఝలక్ దిఖ్లాజా వంటి కొన్ని టీవీ షోలూ చేసింది. రెండు రోజుల ముందు – సడెన్ గా తాను టీవీ/సినిమాలకూ, మొత్తంగా మోడలింగ్/ఎంటర్టైన్మెంట్ రంగానికీ స్వస్తి చెప్తున్నట్లు ప్రకటించింది. తన ట్విట్టర్,ఇన్స్టాగ్రాం అకౌంట్ల నుండీ, తాను గతంలో పోస్ట్ చేసిన అన్ని గ్లామరస్ ఫోటోలనూ డిలీట్ చేసేసింది. హిజాబ్ తో ఉన్న లేటెస్ట్ ఫోటోను పోస్ట్ చేసింది. ఇదంతా చేయడం వెనక తన మైండ్లో నడిచిన థాట్ ప్రాసెస్ ని ఓ చక్కని పోస్టులో రాసింది.
ఇలా చేయటానికి ఈమె చెప్పిన ప్రధాన కారణాలు రెండు.
ఆస్తికులు-నాస్తికులు మధ్యలో కరోనా!!
సినిమాల ప్రభావం జనాల మీద అస్సలుండదని కొందరు వాదిస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు.
మిగతా సినిమాలేమోగానీ, పాతాళ భైరవి, అమ్మోరు, అరుంధతీ, దయామయుడు, బిస్మిల్లాకీ బర్కత్ , వంటి సినిమాల ప్రభావం మాత్రం అటు నాస్తికులు, ఇటు ఆస్తికులూ.. ఇద్దరి మీదా ఉంది.
ఈ సినిమాలన్నిట్లోనూ ఉన్న కామన్ స్టోరీలైన్ ఏమంటే – దేవున్ని నమ్మే ఓ క్యారెక్టర్/క్యారెక్టర్లు ఉంటారు. వారికి సినిమా మొదట్లో విపరీతమైన కష్టాలొస్తాయి. ఓ రెండు గంటలు గడిచి, సినిమా క్లైమాక్సుకొచ్చేసరికి – దేవుడు ప్రత్యక్షమై, వీరి కష్టాలన్నీ పోగొడతాడు. హ్యాపీ ఎండింగ్ తో శుభం కార్డు పడుతుంది.
Continue reading “ఆస్తికులు-నాస్తికులు మధ్యలో కరోనా!!”లైఫ్ – ఓ టెంపుల్ రన్!!
రన్..రన్..రన్
మార్కులు,చదువులు,ఉద్యోగం
రన్..రన్..రన్
బస్సుల్లో,ఆటోల్లో ఎన్నాల్లు.. బైక్ కొనుక్కో ఎప్పుడైనా,ఎక్కడికైనా వెల్లొచ్చు-
డిస్కు బ్రేకులుండాల.. కసక్కున్న ఎక్కడ బ్రేకేస్తే అక్కడాగాల.
బైక్తో పోటో దిగి ప్రొఫైల్ పిక్కులా పెట్టు. మస్తు లైకులు వస్తాయి.
రన్..రన్..రన్
ఆ ఇద్దరు – కొన్ని ప్రశ్నలు!!
అతనో పోలీసు ఉన్నతాధికారి.ఐపీయస్. అమాయకులైన యువకుల్ని ఇళ్ళలోనుండీ ఎత్తుకెళ్ళి-చంపి పడేసి, వీరు మోడీని చంపడానికి వచ్చిన తీవ్రవాదులనీ, తాను ప్రాణాలకు తెగించి వారిని ఎంకౌంటర్ చేశాననీ, శవాలను మీడియా ముందు చూపించడం, ప్రమోషన్లు కొట్టడం ఇతని హాబీ.
ఆ రకంగా, అధికారికంగా 6 మందిని చంపేశాడు. అనధికారిక లెక్కల గురించి మాట్లాడకపోవడమే మేలు.
గీతా జోహ్రీ అనే మరో నిజాయితీ గల పోలీసాఫీసర్ ఇన్వెస్టిగేషన్ వల్ల, అప్పట్లో తెహల్కాలో పనిచేస్తున్న రాణా అయ్యూబ్ అనే జర్నలిస్టు చేసిన సాహసోపేత ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వల్లా.. ఇతని నేరాలు ఒక్కొక్కటీ బయటపడ్డాయి. గుజరాత్ హైకోర్టు ఆదేశాల మేరకు, ఉద్యోగం నుండీ సస్పెండ్ అయ్యి, కొన్నాల్లు జైల్లో కూడా ఉన్నాడు. 2014 తర్వాత కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుండీ పరిస్థితి తల్లకిందులైంది.
ఇస్లాం పై స్వామి వివేకానంద చేసిన కామెంట్లు
“ప్రపంచంలోని ప్రతిమానవుని ఆత్మా, నా ఆత్మలాగే, సర్వసమానమనే భావన హిందువుల్లో ఎప్పుడూ లేదు. మరో పక్క, నా అనుభవం ప్రకారం – మానవ సమానత్వాన్ని అత్యంత గొప్పగా చెప్పిన మతమేదైనా ఉందంటే – అది ఇస్లామే, ఇస్లాం మాత్రమే.”
-“మహమ్మదీయ మతం జనాలకు ఓ సందేశం ఇచ్చింది. అది సమానత్వం. అదే ప్రేమ.
జాతి,వర్ణం లాంటి బేధాలకు ఆస్కారమే లేదు.”
నేను రాయీస్ మహమ్మద్ గా ఎందుకు మారానంటే -రవిచంద్రన్ బాత్రన్,దలిత ఉద్యమకారుడు
(దిప్రింట్ కి ,ఇంగ్లీష్ లో రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం.)
కులం గురించి గత 14 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నాను,
‘దలిత్ కెమెరా’ ఛానెల్ కోసం, దలితులకు సంబంధించిన అనేక అంశాలపై 8 ఏళ్ళపాటు వివిధ డాక్యుమెంటరీలు షూట్ చేశాను. ఈ మొత్తం ప్రయాణం ద్వారా ఒక్క అంశం మాత్రం తిరుగులేని నిజమని అర్థమైంది. అది – బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు, “కులాన్ని ఎదుర్కొనే ఏకైక మార్గం – హిందూఇజం ని వదిలేయడమే.”
ఆయన అడుగుజాడల్లోనే నడిచి, నేను కూడా జనవరి 30, 2020 తేదీన, కేరళ త్రిస్సూర్ జిల్లాలోని చారిత్రాత్మక ప్రాంతమైన కొడుంగల్లూర్ లో హిందూమతాన్ని వదిలేసి – ఇస్లాం స్వీకరించాను. భారతదేశంలో మొట్టమొదటి మసీదు కొడుంగల్లూర్ లోనే కట్టబడింది. ఇప్పుడు నేను ‘రాయీస్ మహమ్మద్’ ని.
మహిళలపై దాడులు
“టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి నిలబడు“.
-“అక్కడ నిలబడితే వచ్చే,పోయేవారందరూ అదో రకంగా చూస్తారు. నేను వెళ్ళను.”
ఆ వచ్చే,పోయే వారు ఎవరు?ఎవరి గురించి ఆ అమ్మాయి మాట్లాడింది? ఎవరికి భయపడి వెళ్ళకుండా, దూరంగా నిలబడి ఆ ఘాతుకానికి బలైంది? ఆమె చెప్పింది నిరక్షరాస్యులో, దొంగలో, తీవ్రవాదుల గురించో కాదు. సగటు జనం గురించి. ఇళ్ళలో తండ్రిగా,అన్నగా,భర్తగా అన్ని బాధ్యతలూ సక్రమంగా నిర్వర్తిస్తూ, సమాజంలో మంచి వారుగా గుర్తింపబడుతూనే– ఓ స్త్రీ రోడ్డుపై కనిపిస్తే, తినేసేలా వెగటు చూపులు, వెగటు కామెంట్లు చేసే మర్యాదస్తుల గురించే ఆ అమ్మాయి చెప్పింది, వారి చూపులకే ఆమె భయపడింది.
Continue reading “మహిళలపై దాడులు”“ఎంత సాధించావన్నది కాదు, ఎంత కోల్పోయావన్నదే ముఖ్యం”
మహమ్మద్ అలీ – ఈ పేరు వినగానే -“ప్రపంచం చూసిన అతి గొప్ప బాక్సర్” – అనే విషయం మీకు గుర్తొస్తే, మీకు అతని గురించి పూర్తిగా తెలీదని అర్థం. అతని గొప్పతనాన్ని – రింగ్ లో సాధించిన పతకాల ద్వారా కొలవలేం.
Continue reading ““ఎంత సాధించావన్నది కాదు, ఎంత కోల్పోయావన్నదే ముఖ్యం””ద మైండ్-సెట్ ఆఫ్ ఐడెంటిటీ
పార్ట్-1: నువ్వు సున్నీ ముస్లిమా – షియా ముస్లిమా..?
************
కొన్నేల్ల క్రితం.. అమెరికా నుండీ ఓ క్లైంట్ మ్యానేజర్ హైదరాబాద్ విజిట్ కి వచ్చాడు.
మా మ్యానేజర్ నన్ను పిలిచి – “ఈయన నాలుగురోజులు ఉంటాడు. సాయంత్రం వరకూ మీటింగ్స్ లో ఉంటాడు. తరువాత సిటీ చూడటానికి వెల్తాడు. నువ్వే ఈ నాలుగు రోజులూ దగ్గరుండి అన్నీ చూపించాలి. అతనిచ్చే ఫీడ్బ్యాక్ మనకు చాలా ఇంపార్టెంట్, సో, టేక్ కేర్ ఆఫ్ హిమ్” – అని చెప్పాడు. హెచ్చార్ లకీ, సీనియర్ మ్యానేజర్స్ కి చెప్పాల్సిన పని, నాకెందుకు చెప్తున్నాడు, అని ఆలోచిస్తుండగానే, – ” హిజ్ నేం ఈజ్ – మెహ్మూద్ ****, బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ అమెరికా, టు టర్కిష్ పేరెంట్స్ ” -అని చెప్పాడు. ఈ చివరి ఇన్ఫర్మేషన్ తో, మా మ్యానేజర్ ఈ పని నాకెందుకు అప్పజెప్తున్నాడో అర్థమైంది.
*********
కుతుబ్షాహీ టాంబ్స్ దగ్గర, నేను గ్రూప్స్ ఎగ్జాం కి చదువుకున్న అసఫ్ జాహీ హిస్టరీ సంగతులేవో అతనికి చెప్తున్నప్పుడు – సడన్ గా అడిగాడు, -” ఆర్ యు ఎ సున్ని ముస్లిం ఆర్ షియా ముస్లిం?” అని.
Continue reading “ద మైండ్-సెట్ ఆఫ్ ఐడెంటిటీ”జైరా వసీమ్ – మొదటామె కాదు, చివరామె కూడా కాదు!!
జైరా వసీమ్ – మొదటామె కాదు, చివరామె కూడా కాదు!!
గత వారం జైరా వసీమ్ పేరు వార్తల్లో మారుమోగింది. ఈమె చేసింది మూడే సినిమాలు. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్,ద స్కై ఈజ్ పింక్(ఇంకా రిలీజ్ అవ్వలేదు). మొదటి రెండు సినిమాలు ఈమెకు బోలెడన్ని జాతీయ,అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి.
Continue reading “జైరా వసీమ్ – మొదటామె కాదు, చివరామె కూడా కాదు!!”